Oppo Reno 13 : ఐఫోన్​ 16 డిజైన్​తో మార్కెట్​లోకి మిడ్​ రేంజ్ ఒప్పో​ స్మార్ట్​ఫోన్​..!-oppo reno 13 series leaked images showcase iphone 16 like design report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo Reno 13 : ఐఫోన్​ 16 డిజైన్​తో మార్కెట్​లోకి మిడ్​ రేంజ్ ఒప్పో​ స్మార్ట్​ఫోన్​..!

Oppo Reno 13 : ఐఫోన్​ 16 డిజైన్​తో మార్కెట్​లోకి మిడ్​ రేంజ్ ఒప్పో​ స్మార్ట్​ఫోన్​..!

Sharath Chitturi HT Telugu
Nov 16, 2024 02:09 PM IST

ఐఫోన్​ 16 ఫీల్​ ఇచ్చే మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ కావాలా? అయితే మీరు ఒప్పో రెనో 13 సిరీస్​ లాంచ్​ వరకు ఎదురుచూడాల్సిందే! ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఒప్పో రెనో 13
ఒప్పో రెనో 13 (Aishwarya Panda/ HT Tech)

ఒప్పో రెనో 12 సిరీస్​కి మంచి డిమాండ్​ కనిపించడంతో రెనో 13 సిరీస్​పై అంచనాలు పెరిగాయి. ఈ రెనో 13 సిరీస్​ నవంబర్ 25 న చైనాలో లాంచ్ కానుంది. చైనా మార్కెట్​ల ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ని టీజ్ చేసిన ఈ కంపెనీ 2025 చివరి​లో ప్రపంచవ్యాప్తంగా వీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అదే సమయంలో ఇటీవల ఒప్పో రెనో 13 ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. వీటి ద్వారా స్మార్ట్​ఫోన్స్​ డిజైన్​పై అవగాహన వచ్చింది. ఈ డిజైన్​.. తాజా ఐఫోన్ 16 మోడల్​ని పోలి ఉండటం గమనార్హం! ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ సిరీస్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఒప్పో రెనో 13 సిరీస్ డిజైన్

ఐఫోన్ 16 పక్కన ఉంచిన ఒప్పో రెనో 13 సిరీస్ చిత్రాలను ప్రదర్శిస్తూ జియోన్స్ అన్విన్ అనే టిప్​స్టర్ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఎక్స్​లో ఒక పోస్ట్​ను పంచుకున్నారు. డిస్​ప్లే, ఫ్రేమ్, రియర్ ప్యానెల్ డిజైన్ మధ్య సారూప్యతలను ఈ చిత్రాలు ప్రదర్శించాయి. ఈ ఫోటోలను బట్టి ఒప్పో మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్ సెగ్మెంట్​లోకి ఐఫోన్ లుక్​ను తీసుకువస్తోందని చెప్పవచ్చు. ఒప్పో రెనో 13 సిరీస్​లో ఐఫోన్ 16 లాంటి వర్టికల్లీ ప్లేస్​డ్​ కెమెరా మాడ్యూల్, కర్వ్డ్ ఎడ్జెస్​, అల్యూమినియం అల్లాయ్ లుక్ ఫ్రేమ్, ఇలాంటి బెజెల్స్, డివైజ్ థిక్​నెస్​ ఉన్నాయి.

కొత్త ఒప్పో రెనో 13 సిరీస్ పూర్తి డిజైన్​ను ఒప్పో ఇంకా వెల్లడించలేదు. అదనంగా, ఈ సిరీస్ ప్రస్తుతం చైనాలో లాంచ్ అవుతోందని, తరువాత ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చని గుర్తుంచుకోవాలి.

ఒప్పో రెనో 13 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఒప్పో రెనో 13 సిరీస్​లోని స్మార్ట్​ఫోన్స్​లో రెనో 13, రెనో 13 ప్రో అనే రెండు మోడళ్లు ఉండనున్నాయి.లీకైన స్పెసిఫికేషన్ల ఆధారంగా రెనో13 ప్రో 1.5కే రిజల్యూషన్​తో 6.78 ఇంచ్​ క్వాడ్ మైక్రో కర్వ్ డ్ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్​ప్లేతో రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 5,900 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ పనిచేయనుంది.

ఫోటోగ్రఫీ పరంగా, ఒప్పో రెనో 13 సిరీస్ ట్రిపుల్ కెమెరా సెటప్​తో రానుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉండవచ్చు. ఏదేమైనా, స్పెసిఫికేషన్లు లీకులు, పుకార్లపై ఆధారపడి ఉన్నాయని గమనించండి, కాబట్టి అప్​గ్రేడ్​ చేసిన ఫీచర్లను ధృవీకరించడానికి లాంచ్ వరకు వేచి ఉండవలసి ఉంటుంది.

ఇంకో విషయం హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్​డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి.

Whats_app_banner

సంబంధిత కథనం