Smartphones price hike : బ్యాడ్ న్యూస్- భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్స్ ధరలు!
Smartphones price hike : స్మార్ట్‌ఫోన్స్ ధరలు త్వరలోనే భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది. ఇందుకు అనేక కారణాలను కూడా వివరించింది.
ప్రస్తుత టెక్ ప్రపంచంలో అన్ని వేగంగా కదిలిపోతున్నాయి. ఇక్కడ అన్ని లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్‌ని కొనసాగించడం సమాజ అవసరాలను తీర్చడంలో అంతర్భాగంగా మారింది! మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌లో రోజుకో కొత్త అప్డేట్ కనిపిస్తోంది. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు చిహ్నంగా మారింది. స్మార్ట్‌ఫోన్స్‌ని కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉపయోగించే రోజులు పోయాయి. ఇప్పుడు మన డిజిటల్ డైరీగా, బ్యాంకుగా, వర్క్‌గా, షాపింగ్ మాల్గా స్మార్ట్‌ఫోన్‌ని వాడుతున్నాము. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్ వల్ల ఇప్పుడు మన జేబుకు చిల్లుపడే అవకాశం కనిపిస్తోంది! గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్స్ ధరలు విపరీతంగా పెరిగాయి. రానున్న రోజుల్లో కూడా ధరలు మరింత పెరుగుతాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్మార్ట్‌ఫోన్ ధరలు ఎందుకు పెరగొచ్చు?
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ మార్కెట్ ఔట్లుక్ నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ ధరలు 2024లో 3 శాతం, 2025లో 5 శాతం పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటి? ధరల్లో ఇంత పెద్ద వ్యత్యాసం ఎందుకు ఉంది? స్మార్ట్‌ఫోన్ తయారీకి అవసరమైన విడిభాగాల ధరలు పెరగడం, జనరేటివ్ ఏఐ చిప్‌ల స్వీకరణ, 5జీ నెట్వర్క్ వినియోగం పెరగడం, అధునాతన కంప్యూటింగ్ సామర్థ్యాల వినియోగం తదితర అంశాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నివేదిక పేర్కొంది.
ఇటీవలి సంవత్సరాల్లో, కంప్యూటర్ల నుంచి స్మార్ట్‌ఫోన్స్ వరకు జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో గణనీయమైన మార్పును మనం చూశాము. వినియోగదారులు తమ గ్యాడ్జెట్స్‌లో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు! దీనివల్ల బ్రాండ్లు తమ కొత్త తరం స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో పోటీ, అధునాతన ఫీచర్లను ఇంటిగ్రేట్ చేస్తున్నాయి. ఇది భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఈ డిమాండ్ కర్వ్ CPU, NPU, GPU పనితీరులో మెరుగుదలలతో GenAI చిప్‌ల అభివృద్ధి, వినియోగాన్ని పెంచింది.
జెన్ఏఐతో పాటు, స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కూడా 4 ఎన్ఎమ్, 3 ఎన్ఎమ్ వంటి అధునాతన తయారీ ప్రక్రియలను ఉపయోగించుకుంటున్నాయి. ఇది పెరుగుతున్న సంక్లిష్టతల కారణంగా విడిభాగాల ఖర్చుల వృద్ధికి కారణమవుతోంది. అందువల్ల, ఈ అంశాలు 2025 నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి! ఎందుకంటే మరిన్ని బ్రాండ్లు తమ కొత్త పరికరాల్లో జెన్ఎఐని ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్‌ఫోన్ యుగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో జెన్ఏఐ ఫీచర్ల ఏకీకరణ ఇదే ట్రెండ్‌ని కొనసాగిస్తుందని, ఇది ధరల పెరుగుదలకు కీలక కారణాల్లో ఒకటని నివేదిక పేర్కొంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం