Oppo K12 Plus : 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కే12 ప్లస్ లాంచ్..
Oppo k12 plus 5g launch date in India : ఒప్పో కే12 ప్లస్ లాంచ్ అయ్యింది. ఇందులో 6400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
చైనాలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది ఒప్పో సంస్థ. దీని పేరు ఒప్పో కే12 ప్లస్. 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఈ నేపథ్యంలో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఒప్పో కే12 ప్లస్ లాంచ్- ఫీచర్స్ ఇవే..
ఒప్పో కే12 ప్లస్‌లో డ్యూయెల్ సిమ్ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14 సాఫ్ట్వేర్ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచ్ ఫుల్హెచ్డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఎల్పీడీడీఆర్4ఎక్స్ 8జీబీ ర్యామ్ ఉంది. 512జీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ దీని సొంతం.
ఇక ఒప్పో కే12 ప్లస్‌లో కెమెరా విషయానికొస్తే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ కెమెరాని ఇచ్చింది సంస్థ.
ఇదీ చూడండి:- JioFinance app: జియోఫైనాన్స్ యాప్ లాంచ్; ఇందులో ఈ లోన్ ఫీచర్స్ చాలా యూజ్ ఫుల్
ఈ ఒప్పో కే12 ప్లస్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియెంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సలేటర్, ఈ-క్యాంపస్ వంటి ఇతర ఫీచర్స్ ఈ మొబైల్ సొంతం.
ఈ ఒప్పో కే12 ప్లస్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.. 6,400ఎంఏహెచ్ బ్యాటరీ! ఇది 80వాట్ సూపర్‌వీఓఓసీ అడాప్టర్‌తో వస్తుంది. ఇన్-డిస్ప్లే స్కానర్ కూడా ఉంది. మొత్తం మీద ఈ గ్యాడ్జెట్ బరువు 192 గ్రాములు.
ఒప్పో కే12 ప్లస్ ధర ఎంత?
చైనాలో ఈ ఒప్పో కే12 ప్లస్ 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ధర 1,899 సీఎన్‌వై. అంటే సుమారు రూ. 22,600. 12జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్ ధరలు వరుసగా సుమారు రూ. 25వేలు, రూ .29,800. బసాల్ట్ బ్లాక్, స్నో పీక్ వైట్ వంటి కలర్స్‌లో ఇది అందుబాటులోకి వస్తుంది.
చైనాలో అక్టోబర్ 15న ఈ ఒప్పో కే12 ప్లస్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభమవుతాయి. ఆ తర్వాత డెలివరీలు కూడా మొదలవుతాయి.
కాగా ఇండియాలో ఈ మొబైల్ లాంచ్‌పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చయలేదు. కానీ ఇండియాలో ఒప్పోకి మార్కెట్ ఉంది. పైగా 'కే' సిరీస్‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్ ఇండియాలో కూడా లాంచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలను మేము మీకు అప్డేట్ చేస్తాము.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం