OnePlus Nord CE 4 : వన్​ప్లస్​ నార్డ్​ సీఈ4 లాంచ్​.. ధర ఎంతంటే!-oneplus nord ce 4 5g launched in india check price and specifications here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Ce 4 : వన్​ప్లస్​ నార్డ్​ సీఈ4 లాంచ్​.. ధర ఎంతంటే!

OnePlus Nord CE 4 : వన్​ప్లస్​ నార్డ్​ సీఈ4 లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Apr 02, 2024 06:12 AM IST

OnePlus Nord CE 4 price : వన్​ప్లస్​ నార్డ్​ సీఈ4 5జీ స్మార్ట్​ఫోన్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ స్మార్ట్​ఫోన్​ ధర, ఫీచర్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి.

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ4 ఇదిగో..
వన్​ప్లస్​ నార్డ్​ సీఈ4 ఇదిగో.. (OnePlus)

OnePlus Nord CE 4 price in India : ఈ ఏడాది ప్రారంభంలో వన్​ప్లస్​ 12 సిరీస్, వన్​ప్లస్​ వాచ్ 2 గ్యాడ్జెట్​ని సక్సెస్​ఫుల్​గా లాంచ్ చేసిన తరువాత, తన నార్డ్ సిరీస్ లైనప్​ని రిఫ్రెష్​ చేస్తోంది దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వన్​ప్లస్​. ఇందులో భాగంగా.. ఇండియా మార్కెట్​లో తాజాగా ఒక మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది. దీని పేరు వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. పవర్​ఫుల్​ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్​సెట్​తో పనిచేసే ఈ స్మార్ట్​ఫోన్​.. కొత్తగా లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 2ఏ, రెడ్మీ నోట్ 13 ప్రో, రియల్మీ 12 ప్రో వంటి మిడ్-రేంజ్ గ్యాడ్జెట్స్​కి గట్టి పోటీ ఇస్తుంది.

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4.. ధర

వన్​ప్లస్ నార్డ్ సీఈ 4 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. 8 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. ఏప్రిల్​ 1న ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అవ్వగా.. ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఈ గ్యాడ్జెట్​ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సేల్ మొదటి రోజు ఈ ఫోన్​ను కొనుగోలు చేసిన వారికి వన్​ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్​ని ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది వన్​ప్లస్ సంస్థ.

నార్డ్ సీఈ 4 5జీ స్పెసిఫికేషన్లు ఇవే..

OnePlus Nord CE 4 5G : వన్​ప్లస్ నార్డ్ సీఈ 4 5జీలో 6.7 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 2412×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. 210 హెచ్​జెడ్​ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యుఎం డిమ్మింగ్, హెచ్​డీఆర్ 10+ కలర్ సర్టిఫికేషన్, 10-బిట్ కలర్ డెప్త్ సపోర్ట్ వంటివి ఈ స్మార్ట్​ఫోన్​కి లభిస్తుంది.

నార్డ్ సీఈ 4 5 జీ క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసితో పనిచేస్తుంది. ఇది గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ పనుల కోసం అడ్రినో 720 జీపీయూతో కనెక్ట్​ చేసి ఉంటుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్- 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్​ను ఇందులో అందించింది వన్​ప్లస్​ సంస్థ.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి 600 ప్రైమరీ సెన్సార్​తో డ్యూయల్ రేర్​ కెమెరా సెన్సార్, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఈ స్మార్ట్​ఫోన్​లో ఉంది.

OnePlus Nord CE 4 price : వన్​ప్లస్ 12ఆర్ నుంచి స్ఫూర్తి పొందిన సీఈ 4 5జీలో.. 5,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ (నార్డ్ డివైజ్​లలో అతిపెద్దది) ఉంటుంది. ఇది 100డబ్ల్యూ సూపర్​వీఓఓసీ ఫాస్ట్ ఛార్జర్​తో జతచేసి ఉంటుంది. ఇది కేవలం 29 నిమిషాల్లో 0-100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేస్తుందని సంస్థ పేర్కొంది.

డార్క్ క్రోమ్, సెలాడన్ మార్బుల్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ సీఈ 4 5జీ స్మార్ట్​ఫోన్​ లభిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, వనప్లస్​ సీఈ 4 5 జీ డ్యూయెల్ 5 జీ సిమ్ కార్డులు, బ్లూటూత్ 5.4, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, 7 5 జీ బ్యాండ్లు, 1 టీబీ వరకు ఎక్స్​టర్నల్​ ఎస్​డీ కార్డు వంటివి ఉంటాయి.

సంబంధిత కథనం