Vivo T3 5G sale: భారత్ లో వివో 5జీ స్మార్ట్ ఫోన్ టీ 3 సేల్ ప్రారంభం; ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..-vivo t3 5g sale in india begins today check price offers availability and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo T3 5g Sale: భారత్ లో వివో 5జీ స్మార్ట్ ఫోన్ టీ 3 సేల్ ప్రారంభం; ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

Vivo T3 5G sale: భారత్ లో వివో 5జీ స్మార్ట్ ఫోన్ టీ 3 సేల్ ప్రారంభం; ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu
Mar 27, 2024 06:15 PM IST

Vivo T3 5G sale: వివో టీ 3 5 జీ స్మార్ట్ ఫోన్ సేల్స్ మార్చి 27 నుంచి భారత్ లో ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది.

వివో టీ 3 5 జీ స్మార్ట్ ఫోన్
వివో టీ 3 5 జీ స్మార్ట్ ఫోన్ (Flipkart)

Vivo T3 5G sale: వివో ఫ్యాన్స్ కు శుభవార్త. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివో టీ3 5జీ స్మార్ట్ ఫోన్ సేల్స్ మార్చి 27న ఇండియాలో ప్రారంభమవుతున్నాయి. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో ప్రీమియం లుక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను విశేషంగా ఆకర్షించనుంది.

వివో ధర, లభ్యత మరియు ఆఫర్లు:

మార్చి 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి వివో టీ 3 5 జీ (Vivo T3 5G) స్మార్ట్ ఫోన్స్ ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్, వివో ఎక్స్ క్లూజివ్ స్టోర్స్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. లిమిటెడ్ టైమ్ లాంచ్ ఆఫర్లో భాగంగా ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి జరిపే లావాదేవీలపై రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ను వివో అందిస్తోంది. దాంతో పాటు, కొనుగోలుదారులు రూ .2,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ ను కూడా పొందవచ్చు. వివో స్టోర్ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.699 విలువైన కాంప్లిమెంటరీ వివో ఎక్స్ ఈ 710 ఇయర్ ఫోన్స్ లభిస్తాయి. వివో టీ 3 5 జీ స్మార్ట్ ఫోన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి..

. వివో టీ3 5జీ (8జీబీ+128జీబీ): రూ.19,999

- వివో టీ3 5జీ (8జీబీ+256జీబీ): రూ.21,999

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

వివో టీ3 5జీ (Vivo T3 5G) లో యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరిచేలా రూపొందించిన ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 8 జీబీ ర్యామ్ తో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ను అమర్చారు. ఇది స్మూత్ మల్టీ టాస్కింగ్ కు వీలు కల్పిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్, 1800నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది.

50 ఎంపీ మెయిన్ కెమెరా

కెమెరా విషయానికి వస్తే, వివో టీ3 5జీ (Vivo T3 5G) లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఉన్న 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ తో ఉన్న మెయిన్ కెమెరా ఉంది. అలాగే, ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ వివో టీ3 5జీ (Vivo T3 5G) స్మార్ట్ ఫోన్ 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అదనపు సెక్యూరిటీ ఫీచర్ గా ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇమ్మర్సివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం స్టీరియో స్పీకర్ సెటప్ వంటి ముఖ్యమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

కనెక్టివిటీ

ఈ వివో టీ 3 5 జీ (Vivo T3 5G) స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, వైఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఇంకా, ఈ పరికరం ఐపి 54 ధూళి మరియు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వివో టీ3 5జీ నథింగ్ ఫోన్ (2ఏ), పోకో ఎక్స్6 వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తోంది.

Whats_app_banner