Vivo T3 5G : వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​.. క్రేజీ ఫీచర్స్​తో త్వరలోనే లాంచ్​!-vivo t3 5g specifications leaked check price in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo T3 5g : వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​.. క్రేజీ ఫీచర్స్​తో త్వరలోనే లాంచ్​!

Vivo T3 5G : వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​.. క్రేజీ ఫీచర్స్​తో త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Mar 09, 2024 12:29 PM IST

Vivo T3 5G : Vivo T3 5G : వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్ లాంచ్​కు సిద్ధమవుతోంది. క్రేజీ ఫీచర్స్​తో త్వరలోనే లాంచ్​ కానున్న ఈ మోడల్​ పేరు వివో టీ3 5జీ.

వివో టీ3 ఫీచర్స్​ ఇవేనా..?
వివో టీ3 ఫీచర్స్​ ఇవేనా..? (Representative Image)

Vivo T3 5G : వివో సంస్థ నుంచి మరో కొత్త స్మార్ట్​ఫోన్​.. ఇండియాలో లాంచ్​ అవుతోంది. దాని పేరు వివో టీ3. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. ఇది.. వివో టీ2కి సక్సెసర్​! ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో టీ3 5జీ స్పెసిఫికేషన్స్​..

నివేదికల ప్రకారం.. వివో టీ3 5జీ సర్టిఫికేషన్​ పూర్తయింది. అంటే.. త్వరలోనే ఇది ఈ స్మార్ట్​ఫోన్ ఇండియాలో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. లీక్స్​ ప్రకారం.. ఈ వివో కొత్త గ్యాడ్జెట్​లో 6.67 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లేతో పాటు ఫ్రెంట్​ కెమెరా కోసం సెంట్రల్​ పంచ్​ హోల్​ హౌజింగ్​ ఉంటుంది. ఈ మొబైల్​ పీక్​ బ్రైట్​నెస్​ 1800 నిట్స్​.

ఇక ఈ వివో టీ3 5జీలో మీడియాటెక్​ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​, 128జీబీ లేదా 256జీబీ స్టోరేజ్​ ఇందులో ఉండొచ్చు. అంతేకాకుండా.. వివో ఎక్స్​టెండెడ్​ ర్యామ్​ 3.0 ఫీచర్​ కూడా ఇందులో ఉంటుందని టాక్​ నడుస్తోంది.

Vivo T3 5G price in India : ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ వివో టీ3 5జీ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ కూడిన ట్రిపుర్​ కెమెరా సెటప్​ రేర్​లో వస్తుందట. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా రావొచ్చు.

వివో టీ3 5జీ ఇతర ఫీచర్స్​- ధర వివరాలు..

ఈ వివో టీ3 5జీలో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని సమాచారం. దీనికి 44వాట్​ ఫ్లాష్​ ఛార్జింగ్​ సపోర్ట్​ వస్తుందని తెలుస్తోంది. డ్యూయెల్​ స్పీకర్స్​, మైక్రో ఎస్​డీ కార్డ్​ స్లాట్​ వంటివి ఇతర ఫీచర్స్​గా ఉండొచ్చు.

ఇక ఈ వివో కొత్త స్మార్ట్​ఫోన్​కి ఐపీ54 వాటర్​, డస్ట్​ రెసిస్టెన్స్​ రేటింగ్​ ఉంటుంది. రెండు కలర్​ ఆప్షన్స్​లో ఇది లభిస్తుంది. అవి క్రిస్టల్​ ఫ్లేక్​, కాస్మిక్​ బ్లూ.

Vivo T3 5G speicifications : ఇండియాలో.. వివో టీ3 5జీ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 20వేలకు అటు, ఇటుగా ఉండొచ్చని టాక్​ నడుస్తోంది.

అయితే.. ఈ స్మార్ట్​ఫోన్​ స్పెసిఫికేషన్స్​, ధర వివరాలు ప్రస్తుతం రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. వీటని సంస్థ ధ్రువీకరించలేదు. కాగా.. లాంచ్​ డేట్​తో పాటు ఇతర వివరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

వివో సంస్థ మంచి జోరు మీద ఉన్నట్టు కనిపిస్తోంది. ఇండియాలో వరుసపెట్టి స్మార్ట్​ఫోన్స్​ని లాంచ్​ చేస్తోంది. మరి త్వరలోనే లాంచ్​కానున్న వివో టీ3 5జీకి ఎంత డిమాండ్​ ఉంటుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం