Vivo X Fold 3 : వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవేనా?-tech new vivo x fold 3 set to launch in china real soon check specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo X Fold 3 : వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవేనా?

Vivo X Fold 3 : వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవేనా?

Sharath Chitturi HT Telugu
Mar 18, 2024 12:00 PM IST

Vivo X Fold 3 : వివో నుంచి ఎక్స్​ ఫోల్డ్​ 3 సిరీస్​ లాంచ్​కు రెడీ అవుతోంది. లాంచ్​ డేట్​ని సంస్థ అధికారికంగా ప్రకటించింది.

త్వరలోనే వీవో ఎక్స్​ ఫోల్డ్​ 3 లాంచ్​..
త్వరలోనే వీవో ఎక్స్​ ఫోల్డ్​ 3 లాంచ్​.. (VIVO/ Representative)

Vivo X Fold 3 : వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​.. లాంచ్​కు రెడీ అవుతోంది. దీని పేరు వివో ఎక్స్​ ఫోల్డ్​ 3. ఈ నెల్​26న.. చైనాలో ఈ సిరీస్​​ లాంచ్​ అవుతుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఈ వివో కొత్త స్మార్ట్​ఫోన్స్​​ ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ఫీచర్స్​ ఇవేనా..?

ఈ వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 సిరీస్​లో రెండు స్మార్ట్​ఫోన్స్​ ఉంటాయి. ఒక స్టాండర్డ్​ వర్షెన్​. ఇంకోటి.. వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో. ఈ ఫోల్టెబుల్​ స్మార్ట్​ఫోన్స్​కి సంబంధించిన ఫీచర్స్​ ఇప్పటికే లీక్​ అయ్యాయి. వీటి బాడీ అల్ట్రా-థిన్​గా ఉంటుందని, లైట్​వెయిట్​ డిజైన్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది.

వివో ఎక్స్​ ఫోల్డ్​ 3, ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో మోడల్స్​ని ఫోల్డ్​ చేస్తే.. 2015 వివో ఎక్స్​5 మ్యాక్స్​ కన్నా థిన్​గా ఉంటాయి. ఎక్స్​5 మ్యాక్స్​.. ప్రపంచంలోనే అతి సన్ననైన ఫోన్​గా (5.1ఎంఎం) పేరు సంపాదించుకుంది.

Vivo X Fold 3 pro price in India : స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 ప్రాసెసర్​తో వస్తున్న తొలి ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​గా.. ఈ వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో ఉంటుందని సమాచారం. ఇక స్టాండర్డ్​ వేరియంట్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 చిప్​సెట్​ ఉండొచ్చు.

లీక్స్​ ప్రకారం.. రెండు గ్యాడ్జెట్స్​లో.. 8.02 ఇంచ్​ సామ్​సంగ్​ ఈ7 అమోలెడ్​ మెయిన్​ స్క్రీన్​, 6.5 ఇంచ్​ అల్ట్రాసానిక్​ స్కానర్​తో కూడిన ఇన్నర్​ స్క్రీన్​ ఉంటాయి. రెండు మోడల్స్​లోనూ 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రావైడ్​, 64ఎంపీ పెరిస్కోపిల్​ లెన్స్​తో కూడిన రేర్​ కమెరా సెటప్​ వస్తుంది. వివో ఇన్​-హైస్​ వీ3 ఇమేజింగ్​ ప్రాసెసర్​ కూడా ఇందులో ఉంటుంది.

ఇక ఈ రెండు ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో.. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 4 సాఫ్ట్​వేర్​ ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ వీటి సొంతం. వీటికి.. 120వాట్​, 50వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా ఉంటుందట.

వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 సిరీస్​ ధర ఎంత..?

Vivo X Fold 3 launch date in India : చైనాలో.. వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ధర 1,113 డాలర్లుగా ఉండొచ్చు. ఇక ప్రో వేరియంట్​ ధర కనీసం 1,390 డాలర్లుగా ఉండొచ్చు.

అయితే.. ప్రస్తుతం ఇవన్నీ రుమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. ఫీచర్స్​, ధరపై సంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. లాంచ్​ టైమ్​కి వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇండియాలో ఈ గ్యాడ్జెట్స్​ ఎప్పుడు లాంచ్​ అవుతాయి? అన్న విషయం తెలియాల్సి ఉంది.

వివో టీ3 5జీ..

ఇండియాలో వివో కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అవుతోంది. దాని పేరు వివో టీ3. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. ఇది.. వివో టీ2కి సక్సెసర్​! ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం