OnePlus Nord Buds 2: వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ లాంచ్.. ఏఎన్‍సీ ఫీచర్, 12.4mm సౌండ్ డ్రైవర్లతో..-oneplus nord buds 2 launched in india know price specifications features sale full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Buds 2: వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ లాంచ్.. ఏఎన్‍సీ ఫీచర్, 12.4mm సౌండ్ డ్రైవర్లతో..

OnePlus Nord Buds 2: వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ లాంచ్.. ఏఎన్‍సీ ఫీచర్, 12.4mm సౌండ్ డ్రైవర్లతో..

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 05, 2023 07:21 AM IST

OnePlus Nord Buds 2: వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ లాంచ్ అయ్యాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) ఫీచర్‌ ఈ ఇయర్‌బడ్స్‌కు హైలైట్‍గా ఉంది. వివరాలివే..

OnePlus Nord Buds 2: వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ లాంచ్ (Photo: OnePlus)
OnePlus Nord Buds 2: వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ లాంచ్ (Photo: OnePlus)

OnePlus Nord Buds 2: వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ విడుదలయ్యాయి. వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‍తో పాటు ఈ నయా ఇయర్‌బడ్స్‌ మోడల్‍ను కూడా వన్‍ప్లస్ ఇండియాలో లాంచ్ చేసింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) ఫీచర్‌ను వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 కలిగి ఉంది. ఏఎన్‍సీ ఉన్న చౌకైన వన్‍ప్లస్ బడ్స్‌గా ఇవి ఉన్నాయి. గత నార్డ్ బడ్స్‌తో పోలిస్తే ఇదే అతిపెద్ద అప్‍గ్రేడ్‍గా ఉంది. డైనమిక్ సౌండ్ డ్రైవర్లతో ఈ బడ్స్ వస్తున్నాయి. వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 స్పెసిఫికేషన్లు

OnePlus Nord Buds 2 Specifications: 12.4mm డైనమిక్ సౌండ్ డ్రైవర్లతో వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 వచ్చాయి. సౌండ్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉండేలా బాస్ వేవ్ అల్గారిథమ్ ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC)తో ఈ బడ్స్ వస్తున్నాయి. పరిసరాల శబ్దాల నుంచి ఇబ్బంది కలగకుండా ఇది ఈ ఫీచర్ నిరోధిస్తుంది. 25 డెసిబుల్స్ వరకు ఏఎన్‍సీ సపోర్ట్ ఉంటుంది. కాల్ క్వాలిటీ మెరుగ్గా ఉండేందుకు డ్యుయల్ మైక్ సెటప్, ఏఐ పవర్డ్ అడ్వాన్స్డ్ క్లియర్ కాల్ ఫీచర్‌తో ఈ బడ్స్ వస్తున్నాయి.

OnePlus Nord Buds 2: బ్లూటూత్ 5.3 వెర్షన్ కనెక్టివిటీతో వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 అడుగుపెట్టాయి. వన్‍ప్లస్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్ ఉంటుంది. ఎస్‍బీసీ, ఏఏసీ కొడెక్‍లు ఈ బడ్స్ సపోర్ట్ చేస్తాయి. స్మార్ట్ ఫోన్‍లో హే మెలోడీ యాప్‍కు ఈ బడ్స్‌ను సింక్ చేసుకొని, ఈక్వలైజర్ సహా మరిన్ని సెట్టింగ్‍లను మార్చుకోవచ్చు.

OnePlus Nord Buds 2: ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ బడ్స్‌ ఏడు గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. చార్జింగ్ కేస్‍తో మరో నాలుగుసార్ల వరకు చార్జ్ చేసుకోవచ్చు. మొత్తంగా చార్జింగ్ కేస్‍తో కలిపి 36 గంటల ప్లే బ్యాక్ టైమ్‍ను వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 ఇస్తాయి. చార్జింగ్ కేస్‍లో 480mAh బ్యాటరీ ఉంది. ఏఎన్‍సీ ఆన్ చేసుకొని వాడితే చార్జింగ్ కేస్‍తో కలుపుకొని 27 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ55 రేటింగ్‍తో ఈ బడ్స్ వచ్చాయి.

వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 ధర, సేల్

OnePlus Nord Buds 2 Price in India: వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ ధర రూ.2,999గా ఉంది. వైట్, గ్రే కలర్ ఆప్షన్‍లలో వచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన ఈ-కామర్స్ సైట్ అమెజాన్, వన్‍ప్లస్ ఆన్‍లైన్ స్టోర్, వన్‍ప్లస్ ఆఫ్‍లైన్ స్టోర్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 సేల్‍కు వస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం