OnePlus 13 : త్వరలో వన్‌ప్లస్ 13 లాంచ్- కీలక ఫీచర్స్ లీక్!
OnePlus 13 release date : వన్‌ప్లస్ 13 లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌కి చెందిన కీలక ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు..
చైనాలో వన్‌ప్లస్ 13 లాంచ్ ఈవెంట్‌కు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గురించి లీకులు అభిమానుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్ ఇండియాలో 2025 జనవరిలో లాంచ్ అవ్వొచ్చు. దీని స్పెసిఫికేషన్లు, డిజైన్, ఫీచర్లు చాలా వరకు చైనా వేరియంట్‌ని పోలి ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి లీకులు వెలువడుతున్నందున, వన్‌ప్లస్ 13 24 జీబీ LPDDR5X ర్యామ్‌తో అందించవచ్చని, ఇది మరింత స్టోరేజ్, పర్ఫార్మెన్స్ సామర్థ్యాన్ని అందిస్తుందని కొత్త పుకారు వెల్లడించింది. వన్‌ప్లస్ 13 గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్లస్ 13 స్టోరేజ్- ర్యామ్..
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబోలో రాబోయే వన్‌ప్లస్ 13 చైనా వేరియంట్ 24 జీబీ LPDDR5X ర్యామ్‌ని అందిస్తుందని పేర్కొంటూ ఒక పోస్ట్‌ని పంచుకున్నారు.
గత ఏడాది వన్‌ప్లస్ 12 కూడా ఇదే తరహాలో అందించడంతో ఇది గరిష్ట మెమరీ స్పేస్ అవుతుందని భావిస్తున్నారు. ర్యామ్‌తో పాటు, వన్ ప్లస్ 13 అందించే గరిష్ట స్టోరేజ్ కెపాసిటీ 1 టీబీ అని కూడా వెల్లడైంది. అదనంగా, ఈ సంవత్సరం వన్‌ప్లస్ 13 అత్యధిక స్టోరేజ్ వేరియంట్ ధరను మునుపటితో పోలిస్తే పెంచే విషయాన్ని కూడా వన్‌ప్లస్ పరిశీలిస్తోందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ 13 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్తో పనిచేస్తుందని భావిస్తున్నారు.
ఈ రూమర్స్ నిజమవుతాయా? లేదా? అన్నది తెలియాలంటే వన్‌ప్లస్ 13 లాంచ్ వరకు ఎదురుచూడాలి.
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ 6.82 ఇంచ్ ఎల్టిపిఓ బీఓఈ ఎక్స్ 2 మైక్రో-కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లేని 2 కే రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 13లో సోనీ ఎల్వైటీ 808 సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సోనీ ఎల్వైటీ 600 సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. 100వాట్ వైర్డ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్ ఉండనుంది.
అయితే, పైన పేర్కొన్న సమాచారం లీకులు, ఊహాగానాలపై ఆధారపడి ఉందని గమనించండి. అదనంగా, భారతీయ వన్‌ప్లస్ 13 ప్రేక్షకుల అవసరాలను తీర్చడానికి విభిన్న స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో వచ్చే అవకాశం లేకపోలేదు. పూర్తి వివరాలు లాంచ్ టైమ్ నాటికి అందుబాటులోకి వస్తాయి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం