ఐక్యూ జెడ్9ఎస్ ప్రో Vs వన్ ప్లస్ నార్డ్ సీఈ4.. ధర సేమ్ సేమ్.. మరి ఫీచర్లలో ఏది బెస్ట్?-iqoo z9s pro vs oneplus nord ce4 which phone delivers better performance and value check comparison here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఐక్యూ జెడ్9ఎస్ ప్రో Vs వన్ ప్లస్ నార్డ్ సీఈ4.. ధర సేమ్ సేమ్.. మరి ఫీచర్లలో ఏది బెస్ట్?

ఐక్యూ జెడ్9ఎస్ ప్రో Vs వన్ ప్లస్ నార్డ్ సీఈ4.. ధర సేమ్ సేమ్.. మరి ఫీచర్లలో ఏది బెస్ట్?

Anand Sai HT Telugu
Aug 25, 2024 09:49 PM IST

iQOO Z9s Pro Vs OnePlus Nord CE4 : రూ.24,999 ధరకు ఐక్యూ జెడ్9ఎస్ ప్రో, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్లు లభిస్తాయి. అయితే ఈ రెండు ఫోన్లలో ఏది కొనాలి అని కన్ఫ్యూజన్ ఉన్నవారు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు మోడళ్లను పోల్చిన సమాచారం ఉంది.

ఐక్యూ జెడ్9ఎస్ ప్రో Vs వన్ ప్లస్ నార్డ్ సీఈ4
ఐక్యూ జెడ్9ఎస్ ప్రో Vs వన్ ప్లస్ నార్డ్ సీఈ4

ఐక్యూ జెడ్9ఎస్ ప్రో వర్సెస్ వన్ ప్లస్ నార్డ్ సీఈ4.. ఈ రెండు ఫోన్లపై ఏదో ఒకటి కొనాలి అనుకునేవారికి ఇక కన్ఫ్యూజన్ అక్కర్లేదు. రెండు ఫోన్ల ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఇందులో ఏది మీకు నచ్చుతుందో చూడండి. రూ.24,999 ధరకు ఐక్యూ జెడ్ 9ఎస్ ప్రో స్మార్ట్ ఫోన్ వినియోగ దారులకు లభ్యం కానుంది. ఈ ధర వద్ద వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 కూడా లభిస్తుంది.

డిజైన్

ఐక్యూ జెడ్9ఎస్ ప్రో మెటల్ ఫ్రేమ్ తో కర్వ్డ్ డిజైన్ ను కలిగి ఉంది. ఇది రెండు ఫినిషింగ్‌లలో లభిస్తుంది. వైట్ ప్యాటర్న్, సిల్వర్ ఫ్రేమ్‌తో ప్లాస్టిక్ బాడీని కలిగి ఉండగా, ఫ్లాంబోయెంట్ ఆరెంజ్ మోడల్‌లో టెక్చర్డ్ మ్యాట్ ఫినిష్, గోల్డెన్ ఫ్రేమ్‌తో ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ గ్లాస్‌ను పోలిన ప్లాస్టిక్ ఎక్ట్సీరియర్‌ను కలిగి ఉంది. ఇది సెలాడన్ మార్బుల్, ఆకుపచ్చ పాలరాతి నమూనాలా అనిపిస్తుంది. డార్క్ క్రోమ్, నలుపు క్రోమ్ లాంటి రంగులో లభిస్తుంది. ఐక్యూ జెడ్ 9స్ ప్రో ఐపీ 64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ను అందిస్తుంది. అయితే నార్డ్ సిఈ4 ఐపీ 54 రక్షణను అందిస్తుంది.

డిస్ ప్లే

ఐక్యూ జెడ్ 9ఎస్ ప్రో కర్వ్ డ్ డిస్ ప్లేను కలిగి ఉండగా. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 ఫ్లాట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఐక్యూ జెడ్9ఎస్ ప్రోలో స్క్రాచ్ ప్రొటెక్షన్ కోసం స్కాట్ α గ్లాస్ ఉన్నాయి. ఇది నార్డ్ సీఈ4లో లేదు. రెండు ఫోన్లలో ఎఫ్‌హెచ్‌డీ + 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్లు ఉన్నాయి. ఇది స్పష్టమైన, సున్నితమైన దృశ్య అనుభవాన్ని అందిస్తుంది.

పనితీరు

రెండు మోడళ్లు క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్‌వోసీని ఉపయోగిస్తాయి. నార్డ్ సీఈ4 8జీబీతో పోలిస్తే ఐక్యూ జెడ్9ఎస్ ప్రోలో 12 జీబీ వరకు ర్యామ్ ఉంది. మల్టీటాస్కింగ్, హెవీ యాప్ వాడకం సమయంలో ఈ అదనపు ర్యామ్ పనితీరును మెరుగుపరుస్తుంది. బెంచ్‌మార్క్ ఫలితాల ప్రకారం వన్‌ప్లస్ నార్డ్ సీఈ4.. 8,19,347 పాయింట్లు సాధించింది. గీక్బెంచ్ సింగిల్-కోర్ పరీక్షలో 1,138 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షలో 2,950 పాయింట్లు సాధించింది. ఐక్యూ జెడ్9ఎస్ ప్రో 8,03,223 స్కోరును సాధించింది. సింగిల్-కోర్ గీక్బెంచ్ స్కోరు 1,131, మల్టీ-కోర్ స్కోరు 3,074, ఇది నార్డ్ సీఈ 4 కంటే ఎక్కువ.

కెమెరా పోలిక

ఐక్యూ జెడ్ 9ఎస్ ప్రో, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 రెండూ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. రెండు మోడళ్లలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ

రెండు ఫోన్లలో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఐక్యూ జెడ్9ఎస్ ప్రో 80 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయగా, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 100 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ధర

ఐక్యూ జెడ్9ఎస్ ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. అదే కాన్ఫిగరేషన్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 ధర రూ.24,999గా ఉంది.