OnePlus Pad Price : వన్‌ప్లస్ ప్యాడ్‌పై మరోసారి తగ్గింపు.. ఈసారి ఎంత తగ్గించారంటే
OnePlus Pad Price Reduce : వన్‌ప్లస్ ప్యాడ్2పై కంపెనీ భారీగా తగ్గింపు చేసింది. లాంచ్ అయిన కొద్ది రోజులకే ధరలను తగ్గించింది. ప్రస్తుతం ఇది ఎంత ధరకు వస్తుందో తెలుసుకుందాం..
వన్‌ప్లస్ ప్యాడ్ లాంచ్ అయిన వారం తర్వాత ధర తగ్గించారు. అంతకుముందు కూడా దీని ధరను తగ్గించింది. కంపెనీ వరుసగా రెండుసార్లు ధరను తగ్గించి మార్కెట్లో అమ్ముతుంది. వన్‌ప్లస్ తన తాజా ప్రీమియం ఆండ్రాయిడ్ టాబ్లెట్ - వన్‌ప్లస్ ప్యాడ్ 2 ను సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో విడుదల చేసింది. ప్యాడ్ 2 లాంచ్ అయిన వారం రోజులకే కంపెనీ గత ఏడాది లాంచ్ చేసిన వన్ ప్లస్ ప్యాడ్ ధరను తగ్గించింది. ఈ ట్యాబ్లెట్ రెండు వెర్షన్లలో వస్తుంది. రెండింటి ధర రూ .3500 తగ్గింది. వన్‌ప్లస్ ప్యాడ్ ధర తగ్గడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల ధర రూ.1,500 తగ్గింది.

వన్‌ప్లస్ ప్యాడ్‌ను 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో వరుసగా రూ.37,999, రూ.39,999 ధరలతో లాంచ్ చేసింది కంపెనీ. 8 జీబీ వేరియంట్ ధర రూ.36,499 కాగా, 12 జీబీ వేరియంట్ ధర రూ.38,499గా ఉంది. ఇప్పుడు రూ.3,500 తగ్గింపు తర్వాత 8 జీబీ వేరియంట్‌ను రూ.32,999కు, 12 జీబీ వేరియంట్‌ను రూ.34,999కు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ ప్యాడ్ హాలో గ్రీన్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది.
వన్ ప్లస్ ప్యాడ్ మంచి కర్వ్డ్ ఫ్రేమ్, తేలికపాటి డిజైన్ ను కలిగి ఉంది. వన్‌ప్లస్ స్టైల్‌లో, వన్‌ప్లస్ మాగ్నెటిక్ కీబోర్డ్ ఫోలియో కేస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 11.6 అంగుళాల డిస్ ప్లే, 2800×2000 పిక్సల్స్ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్, 12 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు.
ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. వన్‌ప్లస్ ప్యాడ్‌లో డాల్బీ అట్మోస్‌తో వచ్చే క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. ఇందులో 9510 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.