Multibagger stock : రూ. 1లక్షను రూ. 1.57కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​!-multibagger manish goel stock turns 1 lakh into 1 57 crore in 14 years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Stock : రూ. 1లక్షను రూ. 1.57కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​!

Multibagger stock : రూ. 1లక్షను రూ. 1.57కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​!

Sharath Chitturi HT Telugu
Feb 25, 2023 11:09 AM IST

Multibagger stock : ప్రముఖ ఇన్​వెస్టర్​ మనీష్​ గోయెల్​ హోల్డ్​ చేస్తున్న ఓ స్టాక్​.. రూ. 1లక్షను రూ. 1.57కోట్లుగా మార్చింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

రూ. 1లక్షను రూ. 1.57కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​!
రూ. 1లక్షను రూ. 1.57కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​!

Multibagger stock : స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించాలంటే ఇన్​వెస్ట్​మెంట్​ చేయడం ఉత్తమం అని చాలా మంది నిపుణులు సూచిస్తూ ఉంటారు. ట్రేడింగ్​లో నష్టాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. అందుకే.. ఒక స్టాక్​ కొని, దీర్ఘకాలం దానిని హోల్డ్​ చేస్తే, మంచి రిటర్నులు చూడవచ్చు. అనేక మంది దిగ్గజ ఇన్​వెస్టర్లు కూడా చేసేది ఇదే. ప్రముఖ ఇన్​వెస్టర్​ వారెన్​ బఫెట్​.. 30ఏళ్ల క్రితం కొన్న కోకాకోలా స్టాక్స్​ని ఇంకా హోల్డ్​ చేస్తున్నారు.

yearly horoscope entry point

ఇక వాల్యూ ఇన్​వెస్టర్​ మనీష్​ గోయెల్​ ప్రకారం.. "సంపద సృష్టించుకునేందుకు స్టాక్​ మార్కెట్​లోకి వస్తున్నారంటే.. లాంగ్​ టర్మ్​ వాల్యూ ఇన్​వెస్టింగ్​తోనే అది సాధ్యపడుతుంది. అది కూడా.. స్మాల్​ క్యాప్​, మిడ్​ క్యాప్​ స్టాక్స్​తోనే సంపద సృష్టించుకోవచ్చు. అయితే.. ఫండమెంటల్​గా స్ట్రాంగ్​ ఉండి, అండర్​వాల్యూలో ఉన్న స్టాక్​ను కనిపెట్టడమే చాలా కష్టమైన విషయం."

Multibagger stock news : ఒక స్టాక్​ను ఎప్పుడు కొనాలి? ఎంత కాలం హోల్డ్​ చేయాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు మనీష్​ గోయెల్​.

"స్టాక్​కు చెందిన ఫెయిర్​ వాల్యూకు తగ్గట్టు పెట్టుబడులు చేయాలి. 52వీక్​ లో, 52 వీక్​ హై, స్ట్రాంగ్​ టెక్నికల్​ సపోర్ట్​ వంటి వాటిని పట్టించుకోకూడదు. ఫెయిర్​ వాల్యూ కన్నా కింద స్టాక్​ ప్రైజ్​ ట్రేడ్​ అవుతుంటే.. అప్పుడు కొనడం ఉత్తమం. ఫెయిర్​ వాల్యూ కన్నా ఎక్కువలో ట్రేడ్​ అవుతుంటే, దానిని సెల్​ చేయవచ్చు," అని మనీష్​ గోయెల్​ స్పష్టం చేశారు.

షేర్​ వాల్యూ ఫెయిర్​ ప్రైజ్​లో ఉందన్నది ఎలా తెలుసుకోవాలి? అన్న విషయాన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాము. మైథాన్​ అలాయ్స్​ షేర్లు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో ప్రస్తుతం లిస్ట్​ అయ్యి ఉన్నాయి. 2008-09 ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ స్టాక్​ రూ. 17,50 వద్ద బాటమ్​ను టచ్​ చేసింది. ఇప్పుడు.. ఇదొక మల్టీబ్యాగర్​ స్టాక్​. ప్రస్తుతం బీఎస్​ఈలో మైథాన్​ అలాయ్స్​ షేర్లు రూ. 918 వద్ద ఉంది.

మైథాన్​ అలాయ్స్​ షేర్​ బోనస్​ హిస్టరీ..

Maithan Alloys share price : దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టడంతో అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా బోనస్​లను సంస్థలు ప్రకటిస్తూ ఉంటే.. స్టాక్​ ధర పెరుగుతూ ఉంటుంది. 2010లో ఈ కెమికల్​ స్టాక్​ ఎక్స్​- బోనస్​ వద్ద ట్రేడ్​ అయ్యింది. 2015లోనూ ఇదే జరిగింది. అంటే.. 2008- 2009లో ఈ స్టాక్​ని కొనుగోలు చేసి ఉంటే, ఇప్పటికి రెండుసార్లు బోనస్​లు పొంది ఉండొచ్చు. బీఎస్​ఈ వెబ్​సైట్​ ప్రకారం.. 2010 జూన్​ 17న బోనస్​ షేర్లు 1:2 రేషియోలో ప్రకటించింది. అంటే.. 2 షేర్లు ఉన్న మదుపర్లకు అదనంగా మరో 1 షేరు వచ్చి చేరింది. ఇక 2015 జులై 15న.. 1:1 రేషియాలో బోనస్​ షేర్లను ప్రకటించింది. అంటే.. మైథాన్​ అలాయ్స్​ 1 షేరు ఉన్న మదుపర్లకు అదనంగా 1 షేరు వచ్చి చేరింది.

పెట్టుబడులపై ప్రభావం..

009లో రూ. 1లక్షను పెట్టుబడి పెట్టిన మదుపర్లకు 5,714 మైథాన్​ అలాయ్స్​ షేర్లు దక్కి ఉంటాయి. 2010లో 1:2 బోనస్​ షేర్లు వచ్చినప్పుడు మొత్తం స్టాక్స్​ 8,571కు చేరింది. ఆ తర్వాత 2015లో 1:1 బోనస్​ ప్రకటించిన తర్వాత.. 8,571 షేర్లు కాస్తా 17,142కు చేరాయి.

రూ. 1లక్ష = రూ. 1.57కోట్లు

Maithan Alloys share price target : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో మైథాన్​ అలాయ్స్​ షేర్​ ప్రైజ్​ 918 వద్ద ఉంది. అంటే.. 14ఏళ్ల క్రితం రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు దాని విలువ రూ. 1.57కోట్లకు చేరుతుంది. వీటిల్లో డివిడెండ్లు కూడా లేకపోవడం విశేషం.

(ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

Whats_app_banner