Bikes For Youth : మిడిల్ క్లాస్ యూత్‌కు కిక్కిచ్చే బైకులు.. జాలీగా రైడ్‌కి వెళ్లొచ్చు!
Middle Class Youth Bikes : మిడిల్ క్లాస్ యూత్‌కి కొన్ని బైకులు అంటే చాలా ఇష్టం. వాటి మీద రైడ్ చేయాలని తప్పకుండా అనుకుంటారు. అలాంటి బైక్స్ ఏంటో చూద్దాం..
కొత్త బైక్ కొనాలి అని యూత్‌కు ఉంటుంది. చూసేందుకు స్టైలిష్ లుక్‌లో ఉండాలి. వెళ్తుంటే అందరూ మీ వైపే చూడాలి అనుకుంటారు. అలాంటి బైక్స్ మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. కానీ ఏ మోటార్ సైకిల్ ఎంచుకోవాలో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. డిజైన్, ఫీచర్ల గురించి కూడా కొందరికి అంచనాలు ఎక్కువే ఉంటాయి. మీరు కూడా కొత్త బైక్‌ని కొనుగోలు చేయాలని చూస్తే... మీకోసం బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి.
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310, హీరో కరిజ్మా మోటార్‌సైకిళ్లు బాగుంటాయి. ఈ బైకుల ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.47 లక్షలుగా ఉంది. 199.5 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 24.5 హార్స్‌పవర్, 18.74 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. పల్సర్ ఎన్ఎస్200 మోటార్‌సైకిల్ 40.36 కేఎంపీఎల్ వరకు మైలేజీని ఇస్తుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పూర్తి ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీ లక్షణాలలో డబుల్ డిస్క్ బ్రేక్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 బైక్ ధర రూ. 2.50 నుండి రూ. 2.72 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. 312.7సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇది 35.6 హార్స్‌పవర్, 28.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటుంది. కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 మోటార్‌సైకిల్ 35 కేఎంపీఎల్ వరకు మైలేజీతో వస్తుంది. ఇది టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ట్రాక్, అర్బన్, రెయిన్, స్పోర్ట్ అండ్ సూపర్‌మోటో వంటి రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ప్రయాణికుల రక్షణ కోసం డబుల్ డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది.
హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్
హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ బైక్ ధర రూ.1.81 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. 210సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 25.5 పీఎస్ హార్స్ పవర్, 20.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ని పొందుతుంది. ఈ హీరో కరిజ్మా బైక్ 41.55 కేఎంపీఎల్ వరకు మైలేజీ ఇస్తుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సేఫ్టీ కోసం డబుల్ డిస్క్ బ్రేక్ ఉంది.