Maruti Suzuki Swift : 19ఏళ్లు గడిచినా తగ్గని మారుతీ సుజుకీ స్విఫ్ట్​ క్రేజ్​.. కారణాలు ఇవే!-maruti suzuki swift 19 years of success what makes it standout ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Swift : 19ఏళ్లు గడిచినా తగ్గని మారుతీ సుజుకీ స్విఫ్ట్​ క్రేజ్​.. కారణాలు ఇవే!

Maruti Suzuki Swift : 19ఏళ్లు గడిచినా తగ్గని మారుతీ సుజుకీ స్విఫ్ట్​ క్రేజ్​.. కారణాలు ఇవే!

Sharath Chitturi HT Telugu
Apr 27, 2024 12:10 PM IST

Maruti Suzuki Swift success : లాంచ్​ అయిన 19ఏళ్లకు కూడా మారుతీ సుజుకీ స్విఫ్ట్​.. సేల్స్​ పరంగా దూసుకెళుతోంది! ఇందుకు కారణాలేంటి? భారతీయులు స్విఫ్ట్​ని ఎందుకు ప్రేమిస్తున్నారు? ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ స్విఫ్ట్​..
మారుతీ సుజుకీ స్విఫ్ట్​..

Maruti Suzuki Swift : భారత దేశ ఆటోమొబైల్​ మార్కెట్​ ఎంత మారినా, ఎస్​యూవీలు ఎంతలా దండయాత్ర చేసినా.. చెక్కుచెదరకుండా.. లాంచ్​ అయిన 19ఏళ్లకు కూడా సూపర్​ డిమాండ్​ అందుకుని, బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా రాణిస్తోంది మారుతీ సుజుకీ స్విఫ్ట్​. ఎఫ్​వై 2023-24లో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో మూడో స్థానంలో నిలిచింది. మరి ఈ హ్యాచ్​బ్యాక్​ని భారతీయులు ఎందుకు అంత ఇష్టపడుతున్నారు? ఇందులోని ప్రత్యేకతలేంటి? ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ స్విఫ్ట్​.. తగ్గేదే లే!

2005లో తొలిసారి భారత్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది మారుతీ సుజుకీ స్విఫ్ట్​. గత ఆర్థిక ఏడాదిలో 1,95,321 యూనిట్​లు అమ్ముడుపోయాయి. ఈ ఫిగర్​ చూస్తే చాలు.. స్విఫ్ట్​కి డిమాండ్​ ఎంత ఉందో తెలిసిపోతుంది. హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​, టాటా టియాగో వంటి మోడల్స్​ నుంచి పోటీ ఎదురవుతున్నా.. స్విఫ్ట్​ హ్యాచ్​బ్యాక్​ దూసుకెళుతుండటం విశేషం. ఇందుకు ప్రధాన కారణాలు.. స్విఫ్ట్​ డిజైన్​- లుక్స్​, వాల్యూ ఫర్​ మనీ ఫీచర్స్​, ఫ్యుయెల్​ ఎఫీషియెన్సీ.

డిజైన- లుక్స్​:- 2005లో బయటకు వచ్చిన మారుతీ సుజికీ స్విఫ్ట్​.. అప్పట్లో నయా డిజైన్​తో ట్రెండ్​ సెట్​ చేసింది. హై క్వాలిటీ మెటీరియల్​తో స్పెషియస్​ కేబిన్​ చూసి అందరు వావ్​! అనుకున్నారు. కాక్​పిక్​ తరహా గ్లాస్​ హౌజ్​, వైడ్​ హిప్స్​, స్క్వేర్​ బేస్​ వంటి డిజైన్​ ఎలిమెంట్స్​.. అందరిని ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి:- Maruti Suzuki Swift on road price Hyderabad : హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

వాల్యూ ఫర్​ మనీ:- మారుతీ సుజుకీ లైనప్​లో స్విఫ్ట్​కి.. వాల్యూ ఫర్​ మనీ మోడల్​ అని పేరు ఉంది. ప్రస్తుతం ఉన్న అన్ని స్విఫ్ట్​ వేరియంట్లలో ఏబీఎస్​, డ్యూయెల్​ ఫ్రెంట్​ ఎయిర్​బ్యాగ్స్​తో పాటు అనేక సేఫ్టీ ఫీచర్స్​ స్టాండర్డ్​గా వస్తున్నాయి. ఇక ఫుల్లీ లోడెడ్​ వర్షెన్​లో ఎన్నో ప్రీమియం ఫీచర్స్​ కూడా ఉన్నాయి. అవన్నీ తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం. పైగా.. స్విఫ్ట్​కి రీసేల్​ వాల్యూ కూడా అధికంగా ఉండటం.. మరో హైలైట్​. అంటే.. మార్కెట్​తో పోల్చితే.. తక్కువ ధరకే మంచి ఫీచర్స్​ ఉన్న స్విఫ్ట్​ కారు కొనుక్కుని.. విక్రయించేడప్పుడు.. కాస్త మెరుగైన రీసేల్​ వాల్యూ కూడా పొందొచ్చు!

2024 Maruti Suzuki Swift : ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీ​:- ఈ మధ్య వస్తున్న వాహనాల్లో ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీ పెద్దగా ఉండట్లేదు. కానీ ఈ విషయంలో మారుతీ సుజుకీ ఒక మెట్టు పైనే ఉంటుంది. ఇక మారుతీ సుజుకీ స్విఫ్ట్​లోని 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​.. 22.38 కేఎంపీఎల్​ మైలేజ్​ని ఇస్తుంది. ఇందులో 1.2 లీటర్​ సీఎన్​జీ ఇంజిన్​.. 30.9 కేఎంపీకేజీ మైలేజ్​ ఇస్తుంది. స్విఫ్ట్​తో పోటీ పడే హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ పెట్రోల్​ వేరియంట్​ 16కేఎంపీఎల్​, సీఎన్​జీ మోడల్​ 27 కేఎంపీకేజీ మైలేజ్​ ఇస్తుంది. ఇక్కడే.. డిఫరెన్స్​ తెలిసిపోతోంది.

ఇక మారుతీ సుజుకీ స్విఫ్ట్​కి అప్డేటెడ్​ వర్షెన్​ మే నెలలో లాంచ్​కు రెడీ అవుతోంది. ప్రస్తుత మోడల్​ కన్నా ఇందులో.. అనేక కొత్త ఫీచర్స్​ ఉంటాయని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం