Maruti Suzuki Swift on road price Hyderabad : హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్..
Maruti Suzuki Swift on road price : మారుతీ సుజుకీ స్విఫ్ట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Maruti Suzuki Swift on road price Hyderabad : బడ్జెట్లో మంచి కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీకి బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్.. మీ లిస్ట్‌లో ఉందా? అయితే.. ఇది మీకోసమే. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ చూసేయండి..
హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ ఆన్‌రోడ్ ప్రైజ్..
మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ (పెట్రోల్):- రూ. 7,14,719 లక్షలు
స్విఫ్ట్ వీఎక్స్ఐ (పెట్రోల్):- రూ. 8.32 లక్షలు
స్విఫ్ట్ వీఎక్స్ఐ ఏఎంటీ (పెట్రోల్):- రూ. 8.91 లక్షలు
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ (పెట్రోల్):- రూ. 9.12 లక్షలు
స్విఫ్ట్ వీఎక్స్ఐ (సీఎన్జీ):- రూ. 9.39 లక్షలు
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఏఎంటీ (పెట్రోల్):- రూ. 9.70 లక్షలు
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ (పెట్రోల్):- రూ. 9.94 లక్షలు
Maruti Suzuki Swift : స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ డీటీ (పెట్రోల్):- రూ. 10.11 లక్షలు
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ (సీఎన్జీ):- రూ . 10.18 లక్షలు
స్విఫ్ట్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఏఎంటీ (పెట్రోల్):- రూ. 10.53 లక్షలు
స్విప్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ డీటీ ఏఎంటీ (పెట్రోల్):- రూ. 10.69 లక్షలు
అంటే.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 7.14 లక్షలు- రూ. 10.69 లక్షల మధ్యలో ఉంటుంది. ఇక.. ఇందులో ఎలాంటి డీజిల్ వేరియంట్ అందుబాటులో లేదు. స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్.. బెస్ట్ సెల్లింగ్‌గా ఉంది.
ఇదీ చూడండి:- Tata Punch EV on road price in Hyderabad : హైదరాబాద్‌లో టాటా పంచ్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
Maruti Suzuki Swift 2024 : సాధారణంగా.. ఏదైనా కారును లాంచ్ చేసేడప్పుడు.. దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి ఆటోమొబైల్ సంస్థలు. కానీ.. వాటి ఆన్‌రోడ్ ప్రైజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే.. కారు కొనే ముందు.. ఎక్స్‌షోరూం ధరతో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను కూడా తెలుసుకుని బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
కాగా.. మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌కు వెళ్లితే.. ఆ సమయంలో కారుపై ఏదైనా ఆఫర్, డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ వంటివి ఉన్నాయా? అనేది తెలుస్తుంది. అది మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. పైగా.. వాహనాన్ని ఫిజికల్‌గా చెక్ చేసినట్టు కూడా ఉంటుంది. అందుకే.. ఒకసారి మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ను సందర్శించి నిర్ణయం తీసుకోవడం బెటర్.
2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్..
2024 Maruti Suzuki Swift : ఇంకొన్ని రోజులు వెయిట్ చేయగలిగితే.. మీరు కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్‌నే కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పటికే.. డీలర్షిప్ షోరూమ్స్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. రూ.11,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. ఈ హ్యాచ్‌బ్యాక్.. మే 9న ఇండియాలో లాంచ్ అవుతుందని టాక్ నడుస్తోంది. ధరలు లేదా డెలివరీలపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం