Maruti Swift 2024 : సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్​ బుకింగ్స్​ షురూ.. లాంచ్​ ఎప్పుడంటే!-newgen maruti swift bookings open at select dealerships will launch soon ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Swift 2024 : సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్​ బుకింగ్స్​ షురూ.. లాంచ్​ ఎప్పుడంటే!

Maruti Swift 2024 : సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్​ బుకింగ్స్​ షురూ.. లాంచ్​ ఎప్పుడంటే!

Sharath Chitturi HT Telugu
Apr 19, 2024 12:10 PM IST

2024 Maruti Swift bookings : మారుతీ సుజుకీ 2024 బుకింగ్స్​ మొదలయ్యాయి. టోకెన్​ అమౌంట్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కొత్త మారుతీ సుజుకీ బుకింగ్స్​ షురూ..
కొత్త మారుతీ సుజుకీ బుకింగ్స్​ షురూ..

Maruti Swift on road price Hyderabad : 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్​పై ఇప్పటికే చాలా బజ్​ నెలకొంది. ఈ బెస్ట్​ సెల్లింగ్​ హ్యాట్​బ్యాక్​.. మే 9న ఇండియాలో లాంచ్​ అవుతుందని టాక్ ​నడుస్తోంది. వీటన్నింటి మధ్య.. ఈ కారుకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. పలు ఎంపిక చేసిన డీలర్​షిప్ షోరూమ్స్​లో.. లాంచ్​కు ముందే ప్రీ-బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్​ను.. ఎంపిక చేసిన మారుతి సుజుకి ఎరీనా డీలర్​షిప్ షోరూమ్స్​లో రూ.11,000 టోకెన్ అమౌంట్​తో బుక్ చేసుకోవచ్చు. ధరలు లేదా డెలివరీలపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సరికొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్​..

2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్ గురించి వివరాలు తక్కువగా ఉన్నప్పటికీ, కొత్త తరం మోడల్ మల్టీ వేరియంట్లతో పాటు అనేక కలర్ ఆప్షన్లలో వస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. విజువల్​గా, ఈ సరికొత్త హ్యాచ్​బ్యాక్.. కొత్త గ్రిల్, బంపర్స్, అల్లాయ్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటీనాతో పాటు మెరుగైన ఫ్రంట్ డిజైన్​ను కలిగి ఉంటుంది. సీ-పిల్లర్​పై అమర్చిన వెనుక డోర్ హ్యాండిల్స్ ఇప్పుడు నెక్ట్స్ జనరేషన్​ మోడల్​లో కనిపిస్తాయి.

కొత్త స్విఫ్ట్​ ఇంటీరియర్​లో చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది. డ్యాష్​బోర్డ్ లేఅవుట్​ కొత్తగా ఉండొచ్చు. ఫ్రీ స్టాండింగ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​ను కలిగి ఉంది. సీటు, అప్​హోల్ స్టరీ మెటీరియల్ కూడా రిఫ్రెషింగా ఉన్నాయి.

ఇదీ చూడండి:-  Most unsafe cars in India : ఈ కార్లు కొంటే.. ప్రాణాలు గాల్లోనే! భద్రతలో ‘0’ రేటింగ్​..

2024 Maruti Suzuki Swift bookings :ఇక సేఫ్టీ విషయానికొస్తే.. కొత్త స్విఫ్ట్​లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్​ విత్ ఈబీడీ, ఈఎస్​పీ స్టాండర్డ్​గా, రెండవ వరుసలో సెంటర్ ప్యాసింజర్ కోసం మూడు పాయింట్ల సీట్ బెల్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. ఇండియా-స్పెక్ స్విఫ్ట్ గ్లోబల్ మోడల్లో అందుబాటులో ఉన్న 360 డిగ్రీల కెమెరా, అడాస్​ వంటివి ఇందులో ఉండకపోవచచు.

2024 Maruti Suzuki Swift : కొత్త తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్​బ్యాక్​లో​.. కొత్త జడ్-సిరీస్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్​ని ఉంటుందని తెలుస్తోంది. ఇది ప్రస్తుత మోడల్​లోని కే12 నాలుగు సిలిండర్ల పెట్రోల్ యూనిట్ స్థానంలో వస్తుంది. కొత్త ఇంజిన్.. పవర్- టార్క్ అవుట్​పుట్.. కే12 యూనిట్ ఉత్పత్తి చేసే విధంగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత ఇంజిన్.. గరిష్టంగా 89బీహెచ్​పీ పవర్, 113ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. కొత్త స్విఫ్ట్​లో 5-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, ఏఎమ్​టీ ఆప్షన్ అందుబాటులో ఉంటాయని ఆశించవచ్చు. అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండే మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ అతిపెద్ద హైలైట్!

WhatsApp channel

సంబంధిత కథనం