Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్.. ఇదీ మహీంగ్స్ ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ క్రేజ్!
Mahindra XUV 3XO bookings : మహీంద్రా కొత్త ఎస్యూవీ.. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓకి అదిరిపోయే డిమాండ్ కనిపిస్తోంది! బుకింగ్స్ మొదలైన 60 నిమిషాల్లోనే.. ఏకంగా 50వేల బుకింగ్స్ రావడం విశేషం.
Mahindra XUV 3XO price : ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ఎస్యూవీ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా.. మరో హిట్ కొట్టింది! మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా లాంచ్ చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓను కస్టమర్ల ఎగబడి కొంటున్నారు. బుకింగ్స్ మొదలైన గంటకే.. 5ంవేలకుపైగా మంది కస్టమర్లు.. ఈ కొత్త ఎస్‌యూవీని బుక్ చేసుకోవడం విశేషం! అంటే ప్రతి సెకనుకు 833 యూనిట్లు బుక్ అయినట్టు అర్థం! ఇక మే 26 నుంచి ఈ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభంకానున్నాయి. మహీంద్రా ఇప్పటికే.. 10వేల ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ యూనిట్లను ఉత్పత్తి చేసిందని, సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కోసం నెలకు 9,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని సమాచారం. వినియోగదారులు సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత డీలర్షిప్ ,షోరూమ్‌కు వెళ్లి రూ .21,000 టోకెన్ అమౌంట్‌ని చెల్లించడం ద్వారా ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓను బుక్ చేసుకోవచ్చు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓను తొమ్మిది వేరియంట్లలో అందిస్తోంది సంస్థ. వీటి ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభమై రూ.15.49 లక్షల వరకు ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతీ సుజుకీ బ్రెజా, స్కోడా నుంచి రాబోయే సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలు.. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ప్రధాన ప్రత్యర్థులు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ విశేషాలు..
Mahindra XUV 3XO on road price Hyderabad : దేశీయ తయారీదారు ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓకు మూడు ఇంజిన్ ఆప్షన్స్ ఇచ్చింది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ విత్ డైరెక్ట్-ఇంజెక్షన్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.
స్టాండర్డ్‌గా.. మూడు ఇంజిన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ను పొందుతాయి. డీజిల్ ఇంజిన్ మాత్రమే 6-స్పీడ్ ఏఎమ్టీని పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్లు ఇప్పుడు కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్‌యూవీకి కొన్ని సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను జోడించింది సంస్థ. తద్వారా ఇది సెగ్మెంట్లో పోటీని మరింత పెంచుతుంది. 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మోడ్స్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
‘మేము సిద్ధంగా ఉన్నాము..’
Mahindra XUV 3XO on road price : ఎం అండ్ ఎం లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. “ఎక్స్‌యూవీ 3ఎక్స్ ఓ ప్రారంభించిన కొద్దిసేపటికే 50000 బుకింగ్‌లను అందుకున్నట్లు ప్రకటించడానికి మేము చాలా గర్విస్తున్నాము, ఇది మా వినియోగదారులు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. ఇటువంటి సృజనాత్మకత, అంచనాలకు మించి విలువను అందించడంలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. 'ఎవ్రీథింగ్ యూ వాంట్ అండ్ మోర్' అందించడానికి రూపొందించిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ భవిష్యత్తు దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ అద్భుతమైన డిమాంట్ని తీర్చడానికి, మా వినియోగదారులకు ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓను డెలివరీ చేయడం ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నాము,” అని చెప్పారు.
సంబంధిత కథనం