Mahindra Thar 5 door : ఆగస్ట్​ 15న మహీంద్రా థార్​ 5 డోర్​ లాంచ్​..!-mahindra thar 5 door likely to make debut on august 15 see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Thar 5 Door : ఆగస్ట్​ 15న మహీంద్రా థార్​ 5 డోర్​ లాంచ్​..!

Mahindra Thar 5 door : ఆగస్ట్​ 15న మహీంద్రా థార్​ 5 డోర్​ లాంచ్​..!

Sharath Chitturi HT Telugu
Jun 24, 2024 07:00 PM IST

Mahindra Thar 5 door : మహీంద్రా థార్​ ఆర్మాడాగా పిలుస్తున్న 5 డోర్​ వెహికిల్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయినట్టు తెలుస్తోంది. ఈ వెహికిల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా థార్ అర్మాడా
మహీంద్రా థార్ అర్మాడా (Instagram/cars_universe_yt)

Mahindra Thar Armada launch : మచ్​ అవైటెడ్​ కార్స్​ లాంచ్​లో.. మహీంద్రా థార్​ 5 డోర్​ ఒకటి. కాగా.. ఈ మహీంద్రా థార్ 5 డోర్.. ఆగస్టు 15, 2024 న లాంచ్ అవుతుందని సమాచారం. ఇక సంస్థ దీనికి..  'థార్ అర్మాడా' అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మహీంద్రా థార్​ 5 డోర్​..

ఈ మహీంద్రా థార్​ ఆర్మాడాకు సంబంధించిన టెస్ట్​ డ్రైవ్​ ఇప్పటికే అనేకమార్లు జరిగింది. పైగా.. వీటి స్పై షాట్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. వాటి ద్వారా పలు కీలక విషయాలు బయటపడ్డాయి.  3 డోర్​ లే- అవుట్​ని ఇందులో అస్సలు వాడలేదు. వీల్​బేస్​ని పెంచి.. 5 డోర్​ లే-అవుట్​ని డిజైన్​ చేసింది సంస్థ. ఫలితంగా.. రేర్​ ప్యాసింజర్లకు స్పేస్​ ఎక్కువగానే ఉంది. కార్గోకు కూడా స్పేస్​ సరిపోతుంది.

విజువల్​గా మాత్రం.. మహీంద్రా థార్ అర్మాడా కొన్ని విలక్షణమైన అంశాలతో పాటు మూడు డోర్ల సిబ్లింగ్​కి చెందిన పలు ఆకర్షణీయమైన ఫీచర్స్​ని నిలుపుకుంటుంది. కొత్త థార్​లో ప్రొజెక్టర్ సెటప్​లతో కూడిన సర్క్యులర్​ ఎల్​ఈడీ హెడ్​లైట్లు ఉంటాయని  స్పై షాట్స్​ తేల్చాయి. సిగ్నేచర్ ఫెండర్-మౌంటెడ్ మార్కర్ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. కానీ గ్రిల్​ని సంస్థ రీడిజైన్​ చేసింది. ఫలితంగా ఓవరాల్​ లుక్​.. మరింత బోల్డ్​, మరింత అగ్రెసివ్​గా కనిపిస్తుంది.

మహీంద్రా థార్​ 5 డోర్​ వెనుక భాగంలో కూడా మేకోవర్ వస్తుంది. ఇప్పటికే ఉన్న వాటి స్థానంలో కొత్త ఎల్ఈడీ టెయిల్​లైట్లు వస్తాయి. అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్​ను కలిగి ఉంటాయి. 18 ఇంచ్​ సైజ్​తో రావొచ్చు.

పొడిగించిన వీల్​బేస్​, అదనపు తలుపులు.. ఈ మహీంద్రా థార్​ ఆర్మాడాలో కనిపించే అత్యంత ముఖ్యమైన మార్పులు. ఇవి.. ఈ కారును ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెహికిల్​గా మారుస్తాయి.

Mahindra Thar Armada 5 door : మహీంద్రా థార్ అర్మాడా ఆధునిక టచ్​స్క్రీన్​ యూనిట్ కోసం పాత ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్​ను తొలగించనుందని, ఇది మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ నుంచి తీసుకుంటున్నట్టు సమాచారం. మెరుగైన క్యాబిన్ సౌకర్యం కోసం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్​ కూడా ఇందులో ఉంటుదట. స్టీరింగ్ వీల్ కూడా రిఫ్రెష్ పొందుతుంది. స్కార్పియో ఎన్ నుంచి డిజైన్​ రావొచ్చు.

కానీ మహీంద్రా ఇక్కడితో ఆగడం లేదు! టాప్-ఎండ్ వేరియంట్లో పనోరమిక్ సన్​రూఫ్​ అందించడం ద్వారా ఈ సెగ్మెంట్​లో మరో అడుగు ముందుకు ఉండనుంది సంస్థ. ఇది భారతదేశంలో సన్​రూఫ్​ కలిగిన ఏకైక ల్యాడర్​ ఫ్రేమ్​ ఎస్​యూవీగా నిలిచిపోతుంది ఈ మహీంద్రా థార్​ 5 డోర్​.

మహీంద్రా థార్​ 5 డోర్​.
మహీంద్రా థార్​ 5 డోర్​. (Facebook/ Sandeep Sreeram)

మహీంద్రా థార్ అర్మాడా 2.0-లీటర్ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ యూనిట్ వంటి సుపరిచిత ఆప్షన్స్​లో కొనసాగించే అవకాశం ఉంది. రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మేన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్​బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటాయని సమాచారం. రేర్ వీల్ డ్రైవ్, ఫోర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ మహీంద్రా థార్​ 5 డోర్​కి సంబంధించిన పూర్తి వివరాలు.. లాంచ్​ టైమ్​ నాటికి అందుబాటులోకి వస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం