Best ACs to buy in 2023 : వేసవి కాలం వచ్చేస్తోంది.. ది బెస్ట్​ ఏసీలు ఇవే!-list of best acs to buy in india for small rooms in 2023 check full list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Acs To Buy In 2023 : వేసవి కాలం వచ్చేస్తోంది.. ది బెస్ట్​ ఏసీలు ఇవే!

Best ACs to buy in 2023 : వేసవి కాలం వచ్చేస్తోంది.. ది బెస్ట్​ ఏసీలు ఇవే!

Sharath Chitturi HT Telugu
Feb 14, 2023 11:53 AM IST

Best ACs to buy in India : వేసవి కాలం సమీపిస్తోంది. మంచి ఏసీ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

వేసవి కాలం వచ్చేస్తోంది.. ది బెస్ట్​ ఏసీలు ఇవే!
వేసవి కాలం వచ్చేస్తోంది.. ది బెస్ట్​ ఏసీలు ఇవే! (Pexels)

Best ACs to buy in India : శీతాకాలంలో ఫ్యాన్​ వేయాలన్నా భయమేస్తుంది! కానీ చాలా మందికి రానున్న వేసవి కాలం గురించి ఇప్పటికే బెంగ మొదలైపోయింది. మార్చ్​ వచ్చిందంటే సూర్యుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలోనే మంచి ఎయిర్​ కండీషనర్​ (ఏసీ) తీసుకోవాలని చాలా మంది ప్లాన్​ చేస్తూ ఉంటారు. అయితే.. వేసవి కాలంలో ఏసీల ధరలు పెరుగుతాయి. అందుకే ఇప్పుడే ఏసీ తీసుకోవడం బెటర్​. ఈ నేపథ్యంలో.. చిన్న గదులకు సరిపోయే విధంగా ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న.. ది బెస్ట్​ ఏసీ లిస్ట్​ని మీకోసం మేము రూపొందించాము. మీరూ ఓ లుక్కేయండి..

పానాసోనిక్​ 1 టన్​ 3 స్టార్​ ఇన్వర్టర్​ స్ప్లిట్​ ఏసీ..

Panasonic 1 Ton 3 Star Inverter Split Air Conditioner price : ప్రముఖ బ్రాండ్​ పానాసోనిక్​ నుంచి వస్తున్న ఈ 1 టన్​ ఏసీ.. 120స్క్వేర్​ ఫీట్​ గదికి సరిపోతుంది. ఇందులో రెండు కంట్రోల్​ మోడ్స్​ ఉన్నాయి. ఫాస్ట్​ కూలింగ్​తో పాటు డీహ్యూమిడిఫైయర్​గానూ ఇది పనిచేస్తుంది. దీనికి 3 స్టార్​ రేటింగ్​ ఉంది. ఫలితంగా తక్కువ విద్యుత్​తో నడుస్తుంది.

స్పెసిఫికేషన్స్​..

మోడ్స్​:- పవర్​ఫుల్​, డ్రై

నాయిస్​ లెవల్​:- 37 డీబీ

యాన్యువల్​ ఎనర్జీ కన్జమ్షన్​:- 67.37 కిలోవాట్​- హవర్​.

వోల్టేజ్​:- 230 వోల్ట్స్​

ధర:- రూ. 37వేలు.

ఎల్​జీ 1 టన్​ 5 స్టార్​ ఏఐ డ్యూయెల్​ ఇన్​వర్టర్​ స్ప్లిట్​ ఏసీ..

LG 1 Ton 5 Star AI DUAL Inverter Split AC price : ఇది 110 స్క్వేర్​ఫీట్​ రూమ్​కు సరిపోతుంది. ఇందులో 6 ఇన్​ 1 కూలింగ్​ మోడ్​ ఉంటుంది. ఇదొక 5 స్టార్​ ఎనర్జీ రేటింగ్​ ఏసీ.

స్పెసిఫికేషన్స్​..

మోడ్​:- 6 ఇన్​ 1 కూలింగ్​

నాయిస్​ లెవల్​:- 21 డీబీ

యాన్యువల్​ ఎనర్జీ కన్జమ్షన్​:- 521.20 కిలోవాట్​- హవర్​

వోల్టేజ్​:- 230 వోల్ట్స్​

ధర:- రూ. 40,999

బ్లూ స్టార్​ 0.8 టన్స్​ 3 స్టార్​ ఇన్​వర్టర్​ స్ప్లిట్​ ఏసీ..

Blue Star 0.8 Tons 3 Star Inverter Split AC price : చిన్న గదులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇదొక 3 స్టార్​ ఎనర్జీ రేటింగ్​ ఏసీ. 50డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ గది వెంటనే చల్లపరిచే ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్​..

మోడ్​:- వేరియబుల్​ కంప్రెసర్​, టర్బో కూలింగ్​

నాయిస్​ లెవల్​:- 32.5 డీబీ

యాన్యువల్​ ఎనర్జీ కన్జమ్షన్​:- 521.6 కిలోవాట్​- హవర్​

వోల్టేజ్​:- 240 వోల్ట్స్​

ధర:- రూ. 27,999.

లాయి|ద్​ 1.0 టన్​ 3 స్టార్​ ఇన్​వర్టర్​ స్ప్లిట్​ ఏసీ..

Lloyd 1.0 Ton 3 Star Inverter Split AC price : చిన్న గది.. నిమిషాల్లో చల్లగా మారిపోవాలంటే ఈ ఏసీని ప్రిఫర్​ చేయవచ్చు! ఇందులో ఉన్న మోడ్స్​ ఎఫెక్టివ్​గా ఉంటాయి.

స్పెసిఫికేషన్స్​..

మోడ్స్​:- వేరియబుల్​ కంప్రెసర్​, టర్బో కూలింగ్​

నాయిస్​ లెవల్​:- 32 డీబీ

యాన్యువల్​ ఎనర్జీ కన్జమ్షన్​:- 698.49కిలోవాట్​- హవర్​

వోల్టేజ్​:- 230 వోల్ట్స్​

ధర:- రూ. 29,850

అమెజాన్​ బేసిక్స్​ 1 టన్​ 3 స్టార్​ ఇన్​వర్టర్​ స్ప్లిట్​ ఏసీ..

Amazon Basics 1 Ton 3 Star Inverter Split AC : ఈ ఏసీలో ఫిల్ట్రేషన్​ సిస్టెమ్​ ఉంటుంది. మైక్రోబ్స్​, ఇతర కాలుష్య పదార్థాలను ట్రాప్​ చేస్తుంది. ఫలితంగా ఫిల్టర్​ చేసిన గాలి బయటకు వస్తింది. ఆటో ఆపరేట్​ అడ్జెస్టెబుల్​ టెంపరేచర్​, ఫ్యాన్​ స్పీడ్​ వంటివి ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్​..

మోడ్స్​:- ఆటో, ఫ్యాన్​, డ్రై, స్లీప్​

నాయిస్​ లెవల్​:- 3 డీబీ

యాన్యువల్​ ఎనర్జీ కన్జమ్షన్​:- 685.26 కిలోవాట్​- హవర్​

వోల్టేజ్​:- 230 వోల్ట్స్​

ధర:- రూ. 30వేల లోపు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్