AC Buying Guide: ఏసీ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా! ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
AC Buying Guide: వేసవి సమీపిస్తున్న తరుణంలో ఏసీ కొనాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే ఏసీ కొనే ముందు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. కెపాసిటీ, స్టార్ రేటింగ్‍తో పాటు మరికొన్నింటిని తెలుసుకున్నాకే ఎంపిక చేసుకోవాలి.
AC Buying Guide: చలికాలం (Winter) ముగుస్తోంది. మరికొన్ని రోజుల్లో వేసవి కాలం (Summer) రాబోతోంది. ఈసారి కూడా ఎండలు మండిపోయే అవకాశం ఉంది. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు ఇప్పటి నుంచే చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. ఇందుకోసం ఎయిర్ కండీషనర్ (Air Conditioner - AC)ను కొనాలని అనుకుంటుంటారు. ఎందుకంటే వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ (AC) ఓ మంచి ఆప్షన్‍గా ఉంటుంది. అయితే ఏసీని కొనే ముందు కొన్ని విషయాలను (AC Buying Guide) తెలుసుకోవాలి. మీకు ఎలాంటి, ఎంత కెపాసిటీ ఏసీ సూటవుతుందో తెలుసుకొని కొనుగోలు చేయాలి.
స్టార్ రేటింగ్ ముఖ్యం
AC BEE Star Rating: ఎయిర్ కండీషనర్లకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) ఇచ్చే రేటింగ్ చాలా ముఖ్యం. ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు తక్కువ విద్యుత్‍ను వాడుకుంటాయి. 1 నుంచి 5 స్టార్ రేటింగ్ వరకు ఏసీలు ఉంటాయి. 2 స్టార్ ఏసీతో పోలిస్తే 5 స్టార్ రేటింగ్ ఉండే ఏసీ తక్కువ విద్యుత్‍ను వాడుకుంటుంది. 5 స్టార్ రేటింగ్ ఏసీల వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఇన్‍బుల్ట్‌గా ఇన్వర్టర్ ఫీచర్ ఉండే ఏసీలు తక్కువ విద్యుత్‍ను వాడుకుంటాయి.
ఎన్ని టన్నులు ఉండేది తీసుకోవాలి?
AC Buying Guide: ఎయిర్ కండీషనర్‌కు సంబంధించి టోనేజ్ కెపాసిటీ (Tonnage Capacity) అనేది ముఖ్యమైన విషయం. మీరు ఏసీ ఏర్పాటు చేయాలనుకుంటున్న గదికి ఎంత కెపాసిటీ ఏసీ అవసరం అవుతుందో ముందుగా తెలుసుకోవాలి. మీ రూమ్ సైజును బట్టి ఏసీ కెపాసిటీని ఎంపిక చేసుకోవాలి.
- 120 నుంచి 140 స్క్వేర్ ఫీట్ (చదరపు అడుగులు sq.ft) విస్తీర్ణం వరకు ఉండే గదికి ఒక టన్ కెపాసిటీ ఉండే ఏసీ (1 Ton AC) సూటవుతుంది.
- 140 నుంచి 200 చదరపు అడుగుల వరకు విస్తీర్ణం ఉండే రూమ్‍కు 1.5 టన్ కెపాసిటీ ఉండే ఏసీని ఎంపిక చేసుకోవాలి. ఇక
- 200 చదరపు అడుగులకు మించి మీ రూమ్ సైజ్ ఉంటే 2 టన్నుల కెపాసిటీ Air Conditionerను తీసుకుంటే సరిపోతుంది.
కన్వర్టబుల్ ఏసీ తీసుకుంటే అవసరాన్ని బట్టి కెపాసిటీని తగ్గించుకునే ఫీచర్ కూడా ఉంటుంది.
ఈ రెండు రకాల్లో ఏది..
Split AC vs Window AC: ఎయిర్ కండీషనర్లలో రెండు రకాలు ఉంటాయి. అవి స్ల్పిట్ ఏసీ, విండో ఏసీ. స్ల్పిట్ ఏసీకి ఇండోర్, అవుట్ డోర్ యూనిట్లు ఉంటాయి. ఇండోర్ యూనిట్ గదిలో గోడకు ఉంటుంది. ఔట్‍డోర్ యూనిట్ బయటి ప్రదేశంలో ఉంచుకోవాలి. అదే విండో ఏసీ అయితే.. ఒకే యూనిట్ ఉంటుంది. కిటికీ అంత స్పేస్‍లో కూలింగ్ ఇచ్చే వైపును గదిలోపలికి వచ్చేలా గోడకు సెట్ చేసుకోవాలి. అయితే విండో ఏసీతో పోలిస్తే స్ప్లిట్ ఏసీ.. ఎక్కువగా కూలింగ్ ఇవ్వటంతో పాటు గదిలో గాలిని బాగా విస్తరింపజేయగలదు. ఎయిర్ ఫ్లో బాగుంటుంది. లుక్ పరంగానూ స్ల్పిట్ ఏసీ క్లాసీగా కనిపిస్తుంది. విండో ఏసీలు అంత ఆకర్షణీయంగా ఉండవు. స్ప్లిట్ ఏసీని గదిలో వేరే చోటికి సులభంగా మార్చుకోవచ్చు. విండో ఏసీని ఒక్కసారి సెట్ చేస్తే వేరే చోటికి మార్చడం కష్టంతో కూడుకున్న పని. అయితే, విండో ఏసీల కంటే స్ల్పిట్ ఏసీలు ధర ఎక్కువగా ఉంటాయి. స్ప్లిట్ ఏసీలకు మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా అవసరం.
మరిన్ని..
AC Buying Guide: ఇటీవలి కాలంలో ఏసీలు స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. వైఫై, వాయిస్ కంట్రోల్స్, స్మార్ట్ ఫోన్ నుంచి కంట్రోల్ చేసేలా యాప్ సపోర్ట్ సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. ఏసీని కొనే ముందు ఫీచర్లను కూడా తెలుసుకోవాలి. ఎయిర్ కండీషనర్‌లోని భాగాలు ఏ మెటీరియల్‍తో తయారయ్యాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కండెన్సర్ కాయిల్.. కాపర్‌తో ఉండే ఏసీలు మెరుగ్గా పనిచేస్తాయి. అల్యూమినియమ్ కాయిల్‍లతో పోలిస్తే కాపర్ కాయిల్ ఉన్న ఏసీలు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి.
సర్వీస్ ఎలా..
AC Buying Guide: ఎయిర్ కండీషనర్ కొన్న తర్వాత సర్వీస్ అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. మీరు కొనాలనుకుంటున్న కంపెనీ సర్వీస్ ఎలా ఉందో ముందుగా తెలుసుకోవాలి. మీ ఇంటికి ఎంత దూరంలో ఆ కంపెనీ సర్వీస్ సెంటర్ ఉందో సమాచారం తెలుసుకోవాలి. ఏసీ కొనే ముందు ఆ కంపెనీ డీలర్‌నో లేకపోతే సర్వీస్ సెంటర్‌కో ఫోన్ చేసి సర్వీస్‍పై మీకు ఉన్న సందేహాలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలి. కంపెనీ సర్వీస్ రికార్డు ఎలా ఉందో వాకబు చేయాలి. వారెంటీ విషయంలో వివరాలను స్పష్టంగా చూడాలి. దేనికి ఎంత వారెంటీ వర్తిస్తుందో వివరంగా తెలుసుకోవాలి.