Kia Seltos facelift : కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. ఆగస్ట్‌లో లాంచ్!
Kia Seltos facelift : కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆగస్ట్‌లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలు..
Kia Seltos facelift launch date India : 2023 మచ్ అవైటెడ్ వాహనాల్లో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఒకటి. ఇండియాలో కియా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న ఈ ఎస్యూవీ లేటెస్ట్ వర్షెన్.. ఈ ఏడాది ఆగస్ట్‌లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ 2023 మోడల్ బుకింగ్స్‌ను సంస్థ ప్రారంభించింది. రూ. 25వేల రీఫండెబుల్ టోకెన్ అమౌంట్‌తో సంస్థకు చెందిన డీలర్షిప్ షోరూమ్స్‌లో ఈ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త వర్షెన్‌లో ఏముంటుంది..?
అప్డేటెడ్ కియా సెల్టోస్‌లో డిజైన్ పరంగా పెద్దగా మార్పులు లేవు. కానీ లుక్ మరింత బోల్డ్‌గా మారింది. ఇందులో స్కల్ప్టెడ్ బానెట్, క్రోమ్ సరౌండెడ్ టైగర్ నోస్ గ్రిల్, ఇంటిగ్రేడెట్ డీఆర్ఎల్స్తో కూడిన స్లీక్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, రివైజ్డ్ బంపర్స్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, ఓఆర్వీఎంలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, డిజైనర్ డ్యూయెల్- టోన్ అలాయ్ వీల్స్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి.
ఇక రేర్‌లో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, వ్రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, షార్క్ ఫిన్ యాంటీనాలు వస్తున్నాయి.
2023 కియా సెల్టోస్ ఫీచర్స్ ఇవే..!
ఈ ఎస్‌యూవీలోని 5 సీటర్ కేబిన్.. స్పెషియస్గా ఉంటుంది. పానారోమిక్ సన్‌రూఫ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ 10.25 ఇంచ్ స్క్రీన్ సెటప్ వంటివి వస్తున్నాయి.
ఇదీ చూడండి:- Honda Elevate vs Kia Seltos : ఎలివేట్ వర్సెస్ సెల్టోస్.. స్పెసిఫికేషన్స్‌లో ఏది బెస్ట్?
6 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్ టెక్నాలజీతో పాటు ఇతర సేఫ్టీ ఫీచర్స్ ఈ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ సొంతం.
ఇంజిన్.. ధర..
త్వరలో లాంచ్‌కానున్న 2023 కియా సెల్టోస్ ఎస్‌యూవీలో సరికొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇవి.. 160 హెచ్‌పీ పవర్- 253 ఎన్ఎం టార్క్, 113.4 హెచ్‌పీ పవర్- 244 ఎన్ఎం టార్క్, 113.4 హెచ్‌పీ పవర్- 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తాయి.
ఇక ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ధరతో పాటు ఇతర వివరాలు లాంచ్ సమయంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ ప్రీమియం కారు ఎక్స్‌షోరూం ధర రూ. 10.89లక్షలు- రూ. 19.65లక్షల మధ్యలో ఉండొచ్చని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
ఇక లాంచ్ అనంతర 2023 కియా సెల్టోస్.. హ్యుందాయ్ క్రేటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాకు గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం