iPhone SE 4 launch: ఆపిల్ మిడ్-రేంజర్.. ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ ఎప్పుడంటే?-iphone se 4 launch timeline tipped apples powerful mid ranger expected to launch in ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone Se 4 Launch: ఆపిల్ మిడ్-రేంజర్.. ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ ఎప్పుడంటే?

iPhone SE 4 launch: ఆపిల్ మిడ్-రేంజర్.. ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu
Aug 28, 2024 07:12 PM IST

iPhone SE 4 launch: దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ ఆపిల్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ పై కథనాలు, అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. త్వరలో ఐఫోన్ 16సిరీస్ లాంచ్ అవుతున్న నేపథ్యంలో ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ కూడా త్వరలో ఉండబోతోందని సమాచారం.

ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్
ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ (X/Heya_stuff)

iPhone SE 4 launch: ప్రస్తుతం టెక్ కమ్యూనిటీలో ఎక్కువగా చర్చ జరుగుతున్న ఫోన్లలో ఐఫోన్ ఎస్ఈ 4 ఒకటి. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ పై ఆపిల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 9 న జరిగే ఆపిల్ ఈవెంట్ లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. దాంతో, ఆపిల్ అభిమానులు ఇప్పుడు మిడ్ రేంజ్ ఐఫోన్ ఎస్ఈ 4 ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు.

రెండున్నర ఏళ్ల క్రితం..

ఆపిల్ చివరి ఐఫోన్ ఎస్ఈ మోడల్ ను లాంచ్ చేసి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. గత కొన్ని వారాలుగా, ఐఫోన్ ఎస్ఈ 4 (iPhone SE 4 launch) ఎలా రూపుదిద్దుకుంటుందో అనేక నివేదికలు వెల్లడించాయి. ఇప్పుడు, బ్లూమ్ బర్గ్ లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే టైమ్ లైన్ వెల్లడయింది.

2025, మార్చిలో లాంచ్ అయ్యే అవకాశం

ఆపిల్ ఇప్పటి వరకు మూడు ఐఫోన్ ఎస్ఈ మోడళ్లను లాంచ్ చేసింది. అవన్నీ కూడా మార్చి నెలలోనే లాంచ్ చేసింది. అందువల్ల, ఐఫోన్ ఎస్ఈ 4 ను కూడా ఆపిల్ అదే మార్చి నెలలో లాంచ్ చేస్తుందని, 2025 మార్చిలో ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2025 మార్చి నెలలో ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ కానుందన్న వార్తలు వెలువడడం ఇదే మొదటిసారి కాదు. ప్రసిద్ధ ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో తో పాటు, ది ఇన్ఫర్మేషన్ మేగజీన్ కూడా ఐఫోన్ ఎస్ఈ 4 ను 2025 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేసే అవకాశం ఉందని గతంలో సూచించాయి. ఆపిల్ (apple) సరఫరాదారులు ఈ అక్టోబర్లో ఈ ఫోన్ ఉత్పత్తిని భారీగా పెంచవచ్చని ‘ది ఇన్ఫర్మేషన్’ వెల్లడించింది.

ఐఫోన్ ఎస్ఈ 4 లో ఏ ఫీచర్స్ ఉండొచ్చు..

2022 లో అరంగేట్రం చేసిన ఐఫోన్ (iPhone) ఎస్ఈ 3 లో 4 జీబీ ర్యామ్ ఉంది. ఐఫోన్ ఎస్ఇ 4 లో 8 జీబీ ర్యామ్ ను పొందుపర్చే అవకాశం ఉంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లలో 6 జీబీ ర్యామ్ ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈలో ర్యామ్ జంప్ కు ఆపిల్ ఇంటెలిజెన్స్ హార్డ్ వేర్ అవసరాలే కారణమని భావిస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ 4 ధర 500 డాలర్ల కేటగిరీలోకి వస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ 4 ప్యానెల్ రాబోయే ఐఫోన్ 16 ను పోలి ఉంటుందని, ముందు భాగంలో ఇది ఐఫోన్ 14 లాగా ఉండవచ్చని అంటున్నారు. యాక్షన్ బటన్, ఏ18 చిప్సెట్, యూఎస్బీ-సీ పోర్ట్, టచ్ ఐడీకి బదులు ఫేస్ ఐడీ, యాపిల్ డిజైన్ చేసిన 5జీ మోడెమ్ తో పాటు పెద్ద ఓఎల్ఈడీ డిస్ప్లే కూడా ఇందులో ఉండనున్నాయి.