iPhone 16 launch date : యాపిల్ లవర్స్ గెట్ రెడీ- ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్..
iPhone 16 launch date in India : యాపిల్ లవర్స్‌కి కీలక అప్డేట్. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ డేట్‌ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యాపిల్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! ఐఫోన్ 16 సిరీస్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న వారికి క్రేజీ అప్డేట్. ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 9న లాంచ్ కానుంది. యాపిల్ తన లాంచ్ ఈవెంట్‌కి "ఇట్స్ గ్లోటైమ్" అన్న థీమ్‌ని ప్రకటించింది. ఈ ప్రత్యేక యాపిల్ ఈవెంట్ కోసం మీడియాను ఆహ్వానించి లాంచ్‌ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్ యాపిల్ పార్క్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రసారం అవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9, 2024 రాత్రి 10:30 గంటలకు ఈవెంట్ లైవ్ అవుతుంది. ఈ ఈవెంట్ యూట్యూబ్, యాపిల్ ఈవెంట్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
యాపిల్ ఈవెంట్ 2024: ఐఫోన్ 16 లాంచ్..
ఐఫోన్లు, ఎయిర్పాడ్లు, వాచ్‌లు.. ఈ సెప్టెంబర్ ఈవెంట్లో అరంగేట్రం చేస్తాయని అంచనాలు ఉన్నాయి. అయితే కొత్త మ్యాక్‌బుక్ మాత్రం ఒక నెల తరువాత అక్టోబర్‌లో ప్రత్యేక ఈవెంట్‌ను పొందొచ్చు.
ఐఫోన్ 16 సెప్టెంబర్ 9న లాంచ్ అయినప్పటికీ, సేల్స్ మాత్రం సెప్టెంబర్ 20 నుంచి మొదలవుతాయని సమాచారం. దీనిపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఐఫోన్ 16 సిరీస్ ధర పెరగకపోవచ్చని సమాచారం. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ధరలు తగ్గొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమవుతుందో వేచి చూడాలి.
ఇదీ చూడండి:- iPhone 16 launch: ఎక్కువ ధర పెట్టి ఐఫోన్ 16 ప్రొ కొనడం కన్నా ఐఫోన్16 కొనడం బెటర్.. ఎందుకంటే?
ఈ ఏడాది భారతదేశంలో ఐఫోన్ 16 ధర తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ కూడా ఒక కారణం అవ్వొచ్చు. మొదటిది, ఫాక్స్‌కాన్ దేశంలో తన తయారీ కేంద్రాన్ని విస్తరిస్తున్నందున ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారతదేశంలో అసెంబుల్ అవుతాయని రూమర్స్ ఉన్నాయి. అందువల్ల, అధికారిక ప్రకటన తరువాత, ఐఫోన్ 16 ప్రో మోడళ్ల ఉత్పత్తి భారతదేశంలో స్థానికంగా ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ మార్పుతో భారత్‌కు పరికరాలను దిగుమతి చేసుకోవడానికి వినియోగిస్తున్న భారీ మొత్తాన్ని కంపెనీ ఆదా చేయగలిగింది. ఫలితంగా ధర కూడా తగ్గొచ్చు! రాబోయే ఐఫోన్ 16 ప్రో మోడళ్లు గత సంవత్సరం ఐఫోన్ 15 ప్రో మోడళ్ల కంటే తక్కువ ధర కలిగి ఉండటానికి ఇది అతిపెద్ద కారణం కావచ్చు.
ఐఫోన్ 16 ఫీచర్స్ ఇవేనా?
ఐఫోన్ 16 ఫీచర్స్పై గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐఫోన్ 16లో 48 మెగా పిక్సెల్ మెయిన్, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు స్పేషియల్ వీడియో సపోర్ట్‌తో డ్యూయెల్ కెమెరా ఉంటుందని సమాచారం. మెరుగైన పనితీరు, ఏఐ ఫీచర్ల కోసం, ఐఫోన్ 16 కొత్త ఏ18 ప్రో చిప్సెట్తో వస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్లో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం