iPhone 13 price cut : ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌తో యాపిల్ సంస్థకు చెందిన ఇతర స్మార్ట్‌ఫోన్స్ ధరలు దిగొస్తున్నాయి. వీటికి తోడు.. ఇండియాలో ఫేస్టివల్ సీజన్ నడుస్తుండటంతో, కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఫలితంగా.. ఐఫోన్ ధరలు మునుపెన్నడూ లేని విధంగా దిగొస్తున్నాయి. తాజాగా.. ఐఫోన్ 13 128జీబీ మోడల్‌పై క్రేజీ డిస్కౌంట్స్ ఇస్తోంది అమెజాన్. ఆ వివరాలు..
ఐఫోన్ 13 128జీబీ మోడల్‌పై 16శాతం డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. ఫలితంగా.. ఈ గ్యాడ్జెట్ ధర రూ. 59,900 నుంచి రూ. 50,499కి పడింది. అంతేకాదు.. పలు ఎగ్జైటింగ్ బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీరు రూ. 45వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇది మీరు ఎక్స్ఛేంజ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మీ ఏరియాలో ఈ ఆఫర్ అప్లై అవుతోందో లేదో కూడా చూసుకోవాలి.
Amazon offers on iPhone 13 : ఇక ఐఫోన్ 13పై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ (కనీసం రూ. 5వేలు)పై రూ. 750 ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. మరి ఈ క్రేజీ ఆఫర్‌ని అస్సలు మిస్ అవ్వకండి.
అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌కు లభిస్తున్న ఐఫోన్ 13లో 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉంటుంది. అడ్వాన్స్డ్ డ్యూయెల్ కెమెరా సిస్టెమ్ దీని సొంతం. 12ఎంపీ వైడ్, అల్ట్రా వైడ్ కెమెరాలు వస్తున్నాయి. అనేక ఫొటోగ్రఫీ మోడ్స్ దీని సొంతం. ఇందులో ఉన్న నైట్ మోడ్ ఫీచర్ హైలైట్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ గ్యాడ్జెట్లో ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉంటుంది.
iPhone 13 festival discounts : లేటెస్ట్గా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై క్రేజీ ఆఫర్స్ లభిస్తున్నాయి. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్‌లో 18శాతం డిస్కౌంట్‌తో రూ. 44999 లకు లభిస్తోంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ. 54900.
ఈ డిస్కౌంట్‌తో పాటు ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్ట్‌లో అదనంగా క్యాష్‌బ్యాక్ ఆప్షన్, బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. వర్కింగ్ కండిషన్లో ఉన్న మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే, గరిష్టంగా రూ. 39150 వరకు ధర తగ్గుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం