iPhone 12 price drop: మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకే ఐ ఫోన్ 12.. మిస్ చేసుకోలేరు..-iphone 12 price drop check discount exchange deal bank offers and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 12 Price Drop: మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకే ఐ ఫోన్ 12.. మిస్ చేసుకోలేరు..

iPhone 12 price drop: మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకే ఐ ఫోన్ 12.. మిస్ చేసుకోలేరు..

HT Telugu Desk HT Telugu
Oct 28, 2023 08:10 PM IST

iPhone 12 price drop: యాపిల్ ఐ ఫోన్ 12 ధర భారీగా తగ్గింది. ఫ్లిప్ కార్ట్ లో 128 స్టోరేజ్ వేరియంట్ ఐ ఫోన్ 12 ఇప్పుడు రూ. 45 వేల లోపు ధరకే లభిస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

iPhone 12 price drop: గత నెలలో ఐ ఫోన్ 15 (iPhone 15) సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను యాపిల్ సంస్థ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దాంతో, అప్పటివరకు రాజ్యమేలిన ఐ ఫోన్ 14 సిరీస్, ఐ ఫోన్ 13 సిరీస్, ఐ ఫోన్ 12 ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. లేటెస్ట్ గా ఐ ఫోన్ 12 (iPhone 12) గతంలో ఎన్నడూ లేనంత తక్కవ ధరకు లభిస్తోంది.

చాలా తక్కువ ధరకు

ఐ ఫోన్ కలిగి ఉండడం ఇప్పుడు స్టేటస్ సింబల్. అందుకే పెద్ద, చిన్న తేడా లేకుండా అంతా ఐ ఫోన్ ను కలిగి ఉండాలని ఆశ పడుతుంటారు. లక్ష కు పైగా ధర పలుకుతున్న ఐ పోన్ 15 సిరీస్ ను కొనుగోలు చేయలేని వారు.. ఐ ఫోన్ 14 సిరీస్, ఐ ఫోన్ 13 సిరీస్, ఐ ఫోన్ 12 లను వివిధ ఈ కామర్స్ సైట్స్ లో కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్లిప్ కార్ట్ లో ఐ ఫోన్ 12 గతంలో ఎన్నడూ లేనంత తక్కవ ధరకు లభిస్తోంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఐ ఫోన్ 12 ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో 18% డిస్కౌంట్ తో రూ. 44999 లకు లభిస్తోంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ. 54900.

అదనంగా..

ఈ డిస్కౌంట్ తో పాటు ఐ ఫోన్ 12 పై ఫ్లిప్ కార్ట్ లో అదనంగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్, బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. వర్కింగ్ కండిషన్ లో ఉన్న మీ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, గరిష్టంగా రూ. 39150 వరకు ధర తగ్గుతుంది.

ఐ ఫోన్ 12 ఫీచర్స్

ఐఫోన్ 12లో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 6.1 ఇంచ్ ల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ డిస్ప్లే ఉంటుంది. ఐ ఫోన్ 12 లో వెనుకవైపు 12 ఎంపీ డ్యూయల్-లెన్స్ సిస్టమ్, 12 ఎంపీ ట్రై డెప్త్ (TrueDepth) ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ A14 బయోనిక్ చిప్‌తో పాటు నెక్స్ట్ జనరేషన్ న్యూరల్ ఇంజన్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది సిరామిక్ షీల్డ్ టెక్నాలజీ మరియు ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్ ఫోన్. ఇందులో డాల్బీ విజన్‌తో 30 ఎఫ్పీఎస్ వరకు హెచ్ డీఆర్ వీడియో రికార్డింగ్, 30 ఎఫ్పీఎస్ లేదా 60 ఎఫ్పీఎస్ వద్ద 1080పీ హెచ్ డీ వీడియో రికార్డింగ్, 120 ఎఫ్పీఎస్ వద్ద 1080 పీ కోసం స్లో-మోషన్ వీడియో సపోర్ట్, నైట్ మోడ్, డీప్ ఫ్యూజన్, క్విక్‌టేక్ వీడియో, అనిమోజీ, మెమోజీ .. తదితర ఫీచర్స్ ఉన్నాయి.

Whats_app_banner