iPhone 14 price drop : ఐఫోన్​ 14పై భారీ డిస్కౌంట్​.. కొనేందుకు ఇదే రైట్​ టైమ్​!-iphone 14 price cut grab this amazing deal on flipkart today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 14 Price Drop : ఐఫోన్​ 14పై భారీ డిస్కౌంట్​.. కొనేందుకు ఇదే రైట్​ టైమ్​!

iPhone 14 price drop : ఐఫోన్​ 14పై భారీ డిస్కౌంట్​.. కొనేందుకు ఇదే రైట్​ టైమ్​!

Sharath Chitturi HT Telugu
Oct 24, 2023 12:50 PM IST

iPhone 14 : ఫ్లిప్​కార్ట్​లో ఐఫోన్​ 14పై భారీ డిస్కౌంట్స్​ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​ని కొనేందుకు ఇదే సరైన సమయం!

ఐఫోన్​ 14పై భారీ డిస్కౌంట్​..
ఐఫోన్​ 14పై భారీ డిస్కౌంట్​.. (AFP)

iPhone 14 price cut : పండుగ సీజన్​ నేపథ్యంలో.. ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థలు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లు పోటీపడి మరీ ఆఫర్స్​ను ప్రకటిస్తున్నాయి. ఫలితంగా.. పలు ప్రీమియం సెగ్మెంట్​ స్మార్ట్​ఫోన్స్​పై క్రేజీ డీల్స్​ లభిస్తున్నాయి. ఇక ఇప్పుడు.. ఫ్లిప్​కార్ట్​లో ఐఫోన్​ 14పై అదిరిపోయే డిస్కౌంట్​ కనిపించింది. ఆ వివరాలు..

ఐఫోన్​ 14పై క్రేజీ డిస్కౌంట్స్​..

ఇండియాలో ఐఫోన్​ 14 వాస్తవ ధర రూ. 79,900. కాగా.. ఫ్లిప్​కార్ట్​లో ఈ మోడల్​ ఇప్పుడు రూ. 56,999కే లభిస్తోంది. ఫలితంగా తమ స్మార్ట్​ఫోన్​ని అప్​గ్రేడ్​ చేసుకుందామని చూస్తున్న వారికి ఇది చక్కటి అవకాశం.

Flipkart offers on iPhone 14 : ఐఫోన్​ 14 ధరను కట్​ చేయడమే కాకుండా.. ఈ గ్యాడ్జెట్​పై అదనంగా అనేక బ్యాంక్​ ఆఫర్స్​, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్స్​ కూడా ఇస్తోంది. ఫలితంగా ఈ మోడల్​ ధర మరింత దిగొస్తుంది.

కొటాక్​ బ్యాంక్​, ఆర్​బీఎల్​ బ్యాంక్​, ఎస్​బీఐ క్రెడిట్​ కార్డుల వాడి ఐఫోన్​ 14 కొంటే.. రూ. 1,250 వరకు 10శాతం డిస్కౌంట్​ పొందొచ్చు. ఇక పాత స్మార్ట్​ఫోన్​తో ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ని వినియోగించుకుంటే రూ. 39,150 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ అనేది.. పాత డివైజ్​ పనితీరుపై ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

ఇదీ చూడండి:- Vivo Y200 5G : వివో వై200 5జీ లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే!

iPhone 14 festival discounts : ఐఫోన్​ 15 సిరీస్​ని గత నెలలోనే లాంచ్​ చేసింది యాపిల్​ సంస్థ. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 14 మోడల్స్​ని కొనేందుకు ఇదే సరైన సమయం అని టెక్​ నిపుణులు చెబుతున్నారు. ఈ ఐఫోన్​ 14లో 6.1 ఇంచ్​ సూపర్​ రెటీనా ఎక్స్​డీఆర్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. 12ఎంపీతో కూడిన రేర్​, 12ఎంపీ ఫ్రెంట్​ కెమెరాలు లభిస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్​లో ఏ15 బయోనిక్​ చిప్​సెట్​, ఫేస్​ ఐడీ టెక్నాలజీ వంటివి కొన్ని కీలక ఫీచర్స్​గా ఉన్నాయి.

ఐఫోన్​ 14 ప్లస్​పైనా ఆఫర్స్​..!

iPhone 14 plus offers : కొన్ని రోజుల క్రితమే.. ఐఫోన్​ 14 ప్లస్​పై కూడా క్రేజీ ఆఫర్స్​ను ప్రకటించింది ఫ్లిప్​కార్ట్​. రూ. 73,999కే ఈ మోడల్​ని అందించింది. అదనంగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్​ను కొనుగోలు చేస్తే 10% తక్షణ డిస్కౌంట్ లభించే విధంగా చర్యలు తీసుకుంది. ఈ తక్షణ తగ్గింపు గరిష్టంగా రూ. 1500 వరకు ఉంది. అంతేకాదు, అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం