Infosys Q2 results : ఇన్ఫీ షేర్​ బై బ్యాక్​.. విలువ రూ. 9,300కోట్లు!-infosys q2 results net profit rises 11 pc to rs 6 021 crore ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infosys Q2 Results : ఇన్ఫీ షేర్​ బై బ్యాక్​.. విలువ రూ. 9,300కోట్లు!

Infosys Q2 results : ఇన్ఫీ షేర్​ బై బ్యాక్​.. విలువ రూ. 9,300కోట్లు!

Sharath Chitturi HT Telugu
Oct 14, 2022 08:57 AM IST

Infosys Q2 results : షేర్​ బై బ్యాక్​ని ప్రకటించింది ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​. వీటితో పాటు త్రైమాసిక ఫలితాలను కూడా ప్రకటించింది.

<p>ఇన్ఫోసిస్​ క్యూ2 ఫలితాలు</p>
ఇన్ఫోసిస్​ క్యూ2 ఫలితాలు (REUTERS)

Infosys Q2 results : దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్​.. క్యూ2 ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు ఆశించిన దాని కన్నా మెరుగ్గా ఉన్నాయి. ఇన్ఫోసిస్​ కన్సాలిడేటెడ్​ నెట్​ ప్రాఫిట్​ 11శాతం పెరిగి రూ. 6,021కోట్లుగా నమోదైంది. అంతేకాకుండా.. రూ. 9,300కోట్లు విలువ చేసే షేర్​ బై బ్యాక్​ను కూడా ఇన్ఫోసిస్​ ప్రకటించింది.

బెంగళూరు ఆధారిత ఇన్ఫోసిస్​.. ఎఫ్​వై23 రెవెన్యూ గ్రోత్​ గైడెన్స్​ను 15-16శాతం పెంచింది. గతంలో ఇది 14-16శాతంగా ఇచ్చింది. ఆర్డర్​ బుక్​ బలంగా ఉండటంతో సంస్థ ఫైనాన్షియల్స్​ మెరుగ్గా ఉన్నాయని చెప్పింది.

Infosys q2 results 2022 : వీటితో పాటు షేరుకు రూ. 16.50 ఇంటెరిమ్​ డివిడెండ్​ను కూడా ప్రకటించింది ఇన్ఫోసిస్​. దీని విలువ రూ. 6,940కోట్లుగా ఉంది. ఇందుకు సంబంధించిన రికార్డు డేట్​ ఈ నెల 28, పేఅవుట్​ డేట్​ నవంబర్​ 10గా నిర్ణయించింది.

ఇన్ఫోసిస్​ మార్జిన్లు 150బేసిస్​ పాయింట్లు వృద్ధిచెందాయి. ఆట్రీషన్​ రేటు జూన్​ త్రైమాసికంలో 28.4శాతంగా ఉండగా.. ఇప్పుడు 27.1శాతానికి దిగొచ్చింది.

"ఆర్థిక వ్యవస్థ ఔట్​లుక్​ ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. మా సంస్థకు డిమాండ్​ ఎక్కువగా ఉంది. మా సామర్థ్యాలపై క్లైంట్లకు నమ్మకం ఉంది. అందుకే రెవెన్యూ గ్రోత్​ను పెంచాము," అని ఇన్ఫోసిస్​ ఎండీ, సీఈఓ సలీల్​ పారేఖ్​ వెల్లడించారు.

Infosys share buyback : ఓపెన్​ మార్కెట్​ రూట్​లో షేర్ల బై బ్యాక్​ను చేయనున్నట్టు ఇన్ఫోసిస్​ వెల్లడించింది. రూ. 1,850ని బై బ్యాక్​ ప్రైజ్​గా నిర్ణయించారు. గురువారం ట్రేడింగ్​ సెషన్​ ముగింపు(రూ. 1420)తో పోల్చుకుంటే ఇది 30శాతం అధికం.

1993 లిస్టింగ్​ తర్వాత నుంచి ఇన్ఫోసిస్​.. బై బ్యాక్​ను ప్రకటించడం ఇది నాలుగోసారి. గతేడాది రూ. 9,200కోట్లు విలువ చేసే షేర్​ బై బ్యాక్​ను ప్రకటించింది.

మూన్​లైటింగ్​..

Infosys Moonlighting : మూన్​లైటింగ్​ను ఇన్ఫోసిస్​ అంగీకరించదని సలీల్​ స్పష్టం చేశారు. ఇలా చేస్తున్న పలువురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు వెల్లడించారు.

త్రైమాసిక ఫలితాల సీజన్​ నేపథ్యంలో.. అన్ని సంస్థలు రిజల్ట్స్​ని ప్రకటిస్తున్నాయి. విప్రో మినహా.. ఇతర ఐటీ సంస్థలు మంచి ప్రదర్శనే చేశాయి.

Whats_app_banner

సంబంధిత కథనం