Infinix Note 40X 5G vs Moto G64 5G : రూ. 15వేల బడ్జెట్​- ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?-infinix note 40x 5g vs moto g64 5g know which smartphone is better under 15000 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infinix Note 40x 5g Vs Moto G64 5g : రూ. 15వేల బడ్జెట్​- ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Infinix Note 40X 5G vs Moto G64 5G : రూ. 15వేల బడ్జెట్​- ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Aug 11, 2024 01:50 PM IST

Infinix Note 40X 5G price : ఇన్ఫీనిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ వర్సెస్ మోటో జీ64.. ఈ రెండింట్లో ఏది బెస్ట్​? ఫీచర్స్​, ధరతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? (Infinix)

2024 ప్రారంభం నుంచి మిడ్ రేంజ్ సెగ్మెంట్​లో పలు స్మార్ట్​ఫోన్స్​ లాంచ్ అయ్యాయి. అయితే రూ.15,000 లోపు స్మార్ట్​ఫోన్స్​ విషయానికి వస్తే కొన్ని గ్యాడ్జెట్స్​ మాత్రమే హైలైట్​గా నిలిచాయి. ఇన్ఫీనిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ, మోటో జీ64 5జీ స్మార్ట్​ఫోన్స్​ ముందువరుసలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? ఎందులో ఎక్కువ ఫీచర్స్​ ఉన్నాయి? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకోండి..

ఇన్ఫీనిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ వర్సెస్ మోటో జీ64 5 జీ..

డిస్​ప్లే: ఇన్ఫీనిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో 6.78 ఇంచ్​ ఐపీఎస్ ఎల్​సీడీ డిస్​ప్లే కలిగి ఉంది. ఇది ఫుల్​ హెచ్​డీ + రిజల్యూషన్​ని కూడా అందిస్తుందని పేర్కొంది. మోటో జీ64 5జీలో 6.5 ఇంచ్​ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది.

కెమెరా: ఇన్ఫీనిక్స్ నోట్ 40ఎక్స్ 5జీలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. మరోవైపు, మోటో జీ64 5జీ డ్యూయెల్ కెమెరా సెటప్​ని కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్ మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.

పనితీరు: రోజువారీ పనులు కోసం, ఇన్ఫీనిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ ర్యామ్, యుఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్​తో వస్తోంది. మోటో జీ64 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్​సెట్​తో పాటు ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి. ఇన్ఫీనిక్స్ స్మార్ట్​ఫోన్​లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్​ ఉంది. అయితే మోటో ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్​ని అందిస్తుంది.

ఇదీ చూడండి:- Google Pixel 9 : రెండు రోజుల్లో గూగుల్​ పిక్సెల్​ 9 సిరీస్​ లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలు లీక్​

బ్యాటరీ: ఇన్ఫీనిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ 18 వాట్ ఛార్జింగ్​ని సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. మరోవైపు, మోటో జీ64 5జీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది.

ధర: ఇన్ఫీనిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ 8 జీబీ + 256జీబి వేరియంట్ ప్రారంభ ధర రూ .14999. మోటో జీ64 5జీ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999.

మరి ఈ రెండు గ్యాడ్జెట్స్​లో మీకు ఏది నచ్చింది? దేనిని కొనుగోలు చేస్తారు?

ఇంకో విషయం. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో అందుబాటులో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని అనుసరించండి!

సంబంధిత కథనం