IDFC First Bank merger : ఐడీఎఫ్​సీ- ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ విలీనంపై లేటెస్ట్​ అప్డేట్​..-idfc first bank merger to complete in 2023 ratio fixed full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Idfc First Bank Merger : ఐడీఎఫ్​సీ- ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ విలీనంపై లేటెస్ట్​ అప్డేట్​..

IDFC First Bank merger : ఐడీఎఫ్​సీ- ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ విలీనంపై లేటెస్ట్​ అప్డేట్​..

Sharath Chitturi HT Telugu
Jul 04, 2023 06:08 AM IST

IDFC First Bank merger ratio : ఐడీఎఫ్​సీ- ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ విలీనంపై ఓ అప్డేట్​ వచ్చింది. ఐడీఎఫ్​సీతో మర్జర్​కు ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

ఐడీఎఫ్​సీ- ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ విలీనానికి ముహూర్తం ఫిక్స్​!
ఐడీఎఫ్​సీ- ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ విలీనానికి ముహూర్తం ఫిక్స్​!

IDFC First Bank merger ratio : ఐడీఎఫ్​సీతో మర్జర్​కు ఐడీఎఫ్​సీ బ్యాంక్​ తాజాగా ఆమోద ముద్ర వేసింది. అమాల్గమేషన్​ స్కీమ్​ ద్వారా ఈ విలీనాన్ని పూర్తి చేయనుంది. ఇందుకు సంబంధించిన రేషియోను 155:100గా నిర్ణయించింది. ఈ మర్జర్​ ప్రక్రియ.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ప్రణాళికలు రచించింది ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​. ఈ మేరకు సోమవారం దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్​లో పేర్కొంది. 2023లో హెచ్​డీఎఫ్​సీ- హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ మర్జర్​ తర్వాత రెండో అతిపెద్ద ఒప్పందంగా ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ విలీనం నిలువనుంది.

రేషియో వివరాలు..

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ బోర్డు ఆమోదించిన రేషియో ప్రకారం.. 100 ఐడీఎఫ్​సీ షేర్లు ఉన్న వారికి.. 155 ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్లు లభిస్తాయి. ఫేస్​ వాల్యూ రూ. 10గా ఉంటుంది.

IDFC IDFC First bank merger : "ఎలాంటి అవాంతరాలు లేకపోతే.. ఈ మర్జర్​ను ఈ ఆర్థిక ఏడాదిలో పూర్తి చేయాలని భావిస్తున్నాము. ప్రతిపాదిత మర్జర్​తో బ్యాంక్​ బుక్​ వాల్యూ 4.9శాతం పెరుగుతుంది," అని ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ వెల్లడించింది.

ఇక ఇప్పుడు ఈ మర్జర్​కు ఆర్​బీఐ, సెబీ, సీసీఐ, ఎన్​సీఎల్​టీ, బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈతో పాటు ఇతర రెగ్యులేటరీలు, షేర్​హోల్డర్ల నుంచి ఆమోద ముద్ర లభించాల్సి ఉంది. వీటన్నింటికి కొంత సమయం పడుతుంది.

ఇదీ చూడండి:- HDFC merger : విలీనానికి వేళాయె.. నేడే హెచ్​డీఎఫ్​సీ- హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ మర్జర్​..!

"విలీన ప్రక్రియతో.. ఐడీఎఫ్​సీ లిమిటెడ్​ షేర్​హోల్డర్లను ఆహ్వానిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మా బ్యాంక్​ పునాదులు చాలా బలంగా తయారు చేశాము. కస్టమర్​ ఫ్రెండ్లీ ప్రాడక్ట్స్​ రూపొందిస్తున్నాము. కార్పొరేట్​ గవర్నెన్స్​ చాలా హైగా ఉంటుంది," అని ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ ఎండీ, సీఈఓ వీ వైద్యనాథ్​ తెలిపారు.

IDFC First Bank mrger with IDFC : ఈ ఐడీఎఫ్​సీ- ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ విలీనం.. హెచ్​డీఎఫ్​సీ- హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​తో పోలి ఉంటుంది. అంటే.. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​.. తన పేరెంట్​ కంపెనీ అయిన ఐడీఎఫ్​సీ హౌజింగ్​ ఫైనాన్స్​ కంపెనీని తనలో మర్జ్​ చేసుకుంటోంది. ఓ బ్యాంక్​ను ఏర్పాటు చేసుకునేందుకు 2014లో ఐడీఎఫ్​సీకి ఆర్​బీఐ నుంచి అనుతులు లభించాయి. 2015లో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఐడీఎఫ్​సీ లోన్​ అసెట్స్​, అప్పులు.. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​కు వెళ్లాయి. 2018 డిసెంబర్​ 18న ఐడీఎఫ్​సీ బ్యాంక్​- క్యాపిటల్​ ఫస్ట్​లు విలీనమయ్యాయి.

షేర్​ ప్రైజ్​లు ఇలా..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి ఐడీఎఫ్​సీ షేరు రూ. 7 లాభంతో రూ. 109.90 వద్ద ముగిసింది. ఇక ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేరు 2.9శాతం లాభంతో రూ. 81.70 వద్ద స్థిరపడింది.

Whats_app_banner

సంబంధిత కథనం