Hyundai India Diwali offers : 'హ్యుందాయ్​' వాహనాలపై భారీ డిస్కౌంట్లు..!-hyundai india offers up to rs 1 lakh discount on vehicles for diwali ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Hyundai India Offers Up To <Span Class='webrupee'>₹</span>1 Lakh Discount On Vehicles For Diwali

Hyundai India Diwali offers : 'హ్యుందాయ్​' వాహనాలపై భారీ డిస్కౌంట్లు..!

Sharath Chitturi HT Telugu
Oct 16, 2022 02:34 PM IST

Hyundai India Diwali offers : దీపావళికి వాహనాలపై డిస్కౌంట్లు ఇస్తున్న ఆటో సంస్థల జాబితాలో హ్యుందాయ్​ కూడా చేరింది. వివిధ వాహనాలపై రూ. 1లక్ష వరకు డిస్కౌంట్లు ఇస్తోంది హ్యుందాయ్​. ఆ వివరాలు..

'హ్యుందాయ్​' వాహనాలపై భారీ డిస్కౌంట్లు..!
'హ్యుందాయ్​' వాహనాలపై భారీ డిస్కౌంట్లు..! (REUTERS)

Hyundai India Diwali offers : దీపావళి నేపథ్యంలో వాహనాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి వివిధ ఆటో సంస్థలు. తాజాగా ఈ జాబితాలోకి హ్యుందాయ్​ ఇండియా కూడా చేరింది. హ్యుందాయ్​ ఔరా, హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​తో పాటు వివిధ వాహనాలపై రూ. 1లక్ష వరకు డిస్కౌంట్లను ఇస్తోంది. ఇవి ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 2022 అక్టోబర్​ 31 వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి. ఆ వివరాలను మీరూ చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు

హ్యుందాయ్​ ఔరా..

Hyundai Aura discounts : హ్యుందాయ్​ ఔరా హ్యాచ్​బ్యాక్​పై రూ. 33వేల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. పెట్రోల్​ వేరియంట్​పై రూ. 5వేలు, సీఎన్​జీ వేరియంట్​పై రూ. 20వేల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. క్యాష్​, రూ. 10వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​ రూపంలో ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్​, కార్పొరేట్​ ఎంప్లాయీ బెనిఫిట్స్​(రూ.3వేలు) కూడా ఉన్నాయి.

హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​..

Hyundai Grand i10 Niosలో 1.2లీటర్​ పెట్రోల్​, 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ వేరియంట్స్​ ఉన్నాయి. పెట్రోల్​, సీఎన్​జీ మోడళ్లపై రూ. 48వేల వరకు బెనిఫిట్స్​ ఇస్తున్నారు. క్యాష్​ ఆఫర్​(రూ. 35,000), ఎక్స్​ఛేంజ్​ డిస్కౌంట్​(రూ. 10వేలు), గవర్నమెంట్​, కార్పొరేట్​ ఎంప్లాయీస్​ బెనిఫిట్స్​(రూ. 3వేలు) వంటి డిస్కౌంట్లు ఉన్నాయి.

హ్యుందాయ్​ ఐ20..

Hyundai i20 price : హ్యుందాయ్​ ఐ20పై రూ. 20 వేల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. రూ. 10వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​, రూ. 10వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​లు ఈ వాహనంపై ఉన్నాయి. పెట్రోల్​, డీజిల్​ వేరియంట్లకు ఈ డిస్కౌంట్​ వర్తిస్తుంది.

హ్యుందాయ్​ కోనా ఎలక్ట్రిక్​:-

Hyundai Kona Electric car discounts : హ్యుందాయ్​ కోనా ఎలక్ట్రిక్​ వాహనంపై రూ. 1లక్ష వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. క్యాష్​ ఆఫర్లు కూడా ఈ డిస్కౌంట్లలో ఉన్నాయి. ఎక్స్​ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ బెనిఫిట్స్​ లేకుండానే రూ. 1లక్ష వరకు డిస్కౌంట్లు లభిస్తుండటం విశేషం.

టాటా మోటార్స్​ కూడా.. వివిధ వాహనాలపై దీపావళి డిస్కౌంట్లను ప్రకటించింది. ఆ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Diwali offers on cars : పండుగ సీజన్​లో కార్లు కొనాలని చాలా మంది భావిస్తు ఉంటారు. వారిని ఆకర్షించేందుకు, వాహనాల సేల్స్​ను పెంచుకునేందుకు ఆటో సంస్థలు డిస్కౌంట్లు, ఆఫర్లను ఇస్తూ ఉంటాయి. ఫలితంగా వాహనాల ధరలు దిగొస్తాయి. ప్రజలకు కూడా కొనుగోలు చేయాలన్న ఆసక్తి పెరుగుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం