Hyundai Exter launch : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ లాంచ్​.. రేపే!-hyundai exter launching on july 10 see what all we know so far ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter Launch : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ లాంచ్​.. రేపే!

Hyundai Exter launch : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ లాంచ్​.. రేపే!

Sharath Chitturi HT Telugu
Jul 09, 2023 12:30 PM IST

Hyundai Exter launch : 2023 మచ్​ అవైటెడ్​ ఎస్​యూవీల్లో ఒకటైన హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. సోమవారం లాంచ్​కానుంది. ఈ మోడల్​ బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

రేపే హ్యుందాయ్​ ఎక్స్​టర్​ లాంచ్​..
రేపే హ్యుందాయ్​ ఎక్స్​టర్​ లాంచ్​..

Hyundai Exter launch : ఇండియాలో సరికొత్త, ఎగ్జైటింగ్​ లాంచ్​కు సన్నద్ధమవుతోంది హ్యుందాయ్​ మోటార్స్​. ఎక్స్​టర్​ ఎస్​యూవీని జులై 10న లాంచ్​ చేయనుంది. ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఈ ఎక్స్​టర్​కు మంచి డిమాండ్​ ఉంటుందని మార్కెట్​లో అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ ఫీచర్స్​..

ఎక్స్​టర్​ ఎస్​యూవీ బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 11వేల టోకెన్​ అమౌంట్​తో ఈ వెహికిల్​ని బుక్​ చేసుకోవచ్చు. కాగా హ్యుందాయ్​ నుంచి వస్తున్న అతి చౌకైన ఎస్​యూవీగా ఈ మోడల్​ నిలుస్తుందని తెలుస్తోంది.

ఈ ఎస్​యూవీలో డిజైన్​ యునీక్​గా ఉండనుంది! ఫ్రెంట్​లో హెచ్​- షేప్​లో ఎల్​ఈడీ డేటైమ్​ లైట్స్​ వస్తున్నాయి. రేడియేటర్​ గ్రిల్​పై ఉండే ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​ పైన ఇవి ఉంటాయి. ఇక స్లీక్​ బ్లాక్​ స్ట్రిప్​నకు ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ కనెక్ట్​ అయ్యి ఉంటాయి.

ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వీల్​బేస్​ 2,450ఎంఎం. ఎత్తు 1,631ఎంఎం. ఫలితంగా లెగ్​రూమ్​, హెడ్​రూమ్​ చాలా ఎక్కువగా ఉండనుంది. ఇతర డైమెన్షన్స్​ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఈ కొత్త ఎస్​యూవీలో భారీ రేంజ్​ ఫీచర్స్​ ఉండొచ్చు! 4.2 ఇంచ్​ డిజిటల్​ డిస్​ప్లే, ఫ్రీ స్టాండింగ్​ 8 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, ఫ్రెంట్​- రేర్​ కెమెరాలతో కూడిన డాష్​కామ్​, కనెక్టివిటీ ఫీచర్స్​, వాయిస్​ ఎనేబుల్డ్​ స్మార్ట్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​ వంటి ఫీచర్స్​ ఉండొచ్చు.

కొత్త ఎస్​యూవీ ధర ఎంత ఉంటుంది..?

Hyundai Exter launch date India : ఇక సేఫ్టీ ఫీచర్స్​ విషయానికొస్తే.. ఇందులో 6 ఎయిర్​బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​, వెహికిల్​ స్టెబులిటీ కంట్రోల్​, హిల్​ అసిస్ట్​ కంట్రోల్​, సీట్​బెల్ట్​ రిమైండర్​, కీలెస్​ ఎంట్రీ, థెఫ్ట్​ అలారం, ఈఎస్​ఎస్​, పార్కిగ్​ సెన్సార్స్​, ఏబీఎస్​ విత్​ ఈబీడీ వంటివి ఉండొచ్చు.

ఇందులో ఈ20 ఫ్యూయెల్​ రెడీ 1.2 లీటర్​ కప్పా పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. సీఎన్​జీ వేరియంట్​ కూడా అందుబాటులోకి రావొచ్చు. 5 స్పీడ్​ మేన్యూవల్​ గేర్​బాక్స్​ ఆప్షన్​ లభిస్తుందని తెలుస్తోంది.

ఆల్​ న్యూ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలుగా ఉండొచ్చు. రూ. 10లక్షల వరకు వేరియంట్లు ఉండొచ్చు. ఇదే నిజమైతే.. టాటా పంచ్​, సిట్రోయెన్​ సీ3, రెనల్ట్​ ఖైగర్​, నిస్సాన్​ మాగ్నైట్​ వంటి సబ్​ ఎస్​యూవీ మోడల్స్​కు ఈ హ్యుందాయ్​ వెహికిల్​ నుంచి గట్టి పోటీ తప్పదు!

ఈ మోడల్​ ఫీచర్స్​, ధరకు సంబంధించిన పూర్తి వివరాలు జులై 10న లాంచ్​ టైమ్​లో అందుబాటులోకి వస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం