Hyundai Creta facelift : హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్‌లో భారీ మార్పులు పక్కా! లాంచ్ ఎప్పుడు?
Hyundai Creta facelift : హ్యుందాయ్ క్రేటా ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఈ మోడల్ టెస్ట్ రన్ జరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు..
Hyundai Creta facelift test run : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్‌కు ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది 'క్రేటా' ఎస్యూవీ. ఈ క్రేటాకు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రాబోతోందని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఈ ఊహాగానాలను నిజం చేస్తూ ఓ వార్త బయటకొచ్చింది. క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ప్రస్తుతం టెస్ట్ రన్ దశలో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఫలితంగా ఈ మోడల్ త్వరలోనే ఇండియాలో లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్..
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఖండ్వాకు సమీపంలోని నాట్రాక్స్ టెస్టింగ్ సెంటర్లో హ్యుందాయ్ క్రేటా ఎస్యూవీ టెస్ట్ రన్ జరిగింది. ఆన్లైన్లో తొలిసారిగా ఈ మోడల్ ఫొటోలు లీక్ అయ్యాయి.
Hyundai Creta facelift launch date : క్రేటాను 2016లో ఇండియాలో లాంచ్ చేసింది హ్యుందాయ్ సంస్థ. ఇక ఈ ఎస్‌యూవీకి చెందిన ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చే ఏడాది లాంచ్ అవ్వొచ్చు. లాంచ్ తర్వాత.. ఈ మోడల్ కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి ఎస్‌యూవీలకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
ఇక తాజాగా లీకైన ఫొటోల్లో క్రేటా డిజైన్ పరంగా పెద్దగా వివరాలు తెలియడం లేదు. ఈ వాహనాన్ని వ్రాప్ చేసి టెస్ట్ రన్ చేయడం ఇందుకు కారణం. అయితే స్పై షాట్స్ ప్రకారం.. ఈ ఎస్‌యూవీలో వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ క్లస్టర్ ఉంటుందని తెలుస్తోంది. అలాయ్ వీల్స్ కొత్తగా వస్తున్నట్టు కనిపిస్తోంది. వీల్స్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. హ్యుందాయ్ అల్కజార్‌ను ఇవి పోలి ఉన్నాయి.
ఇదీ చూడండి:- Hyundai car Sales: జూన్ నెలలో హ్యుండై కార్ల అమ్మకాల జోరు; ఈనెలలోనే మార్కెట్లోకి ఎక్స్టర్ ఎస్యూవీ
కేబిన్‌లో భారీ మార్పులు పక్కా..!
Hyundai Creta facelift India : రానున్న క్రేటా వర్షెన్కు సంబంధించిన రూఫ్లైన్ని కూడా స్పై షాట్స్ చూపించాయి. పెద్దగా మార్పులేవీ కనిపించలేదు. అయితే ఓఆర్వీఎంలపై కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో 360 డిగ్రీ వ్యూ ఫీచర్ ఉండనుంది.
ఇక వెహికిల్ రేర్‌లో బంపర్‌ను రీడిజైన్ చేసే అవకాశం ఉంది. టెయిల్‌గేట్ క్లస్టర్ కొత్తగా ఉండొచ్చు. ఎల్ఈడీ లైట్ బార్ కూడా కొత్తగా రావొచ్చు. ఫ్రెంట్ ఫేస్ కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త గ్రిల్ ఉండొచ్చు.
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ కేబిన్‌లో భారీ మార్పులే జరగొచ్చని తెలుస్తోంది. ఏడీఏఎస్ టెక్నాలజీ రాబోతోంది! కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లోనూ ఇది ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
Hyundai Creta facelift 2023 : ఇక ఈ క్రేటా కొత్త వర్షెన్‌లో 1.5లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ కొత్తగా ఉండే అవకాశం ఉంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉండొచ్చు. వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో దీనిని తొలిసారిగా పరిచయం చేసింది సంస్థ.
ఈ క్రేట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు హ్యుందాయ్ క్రేటా ఈవీ ని కూడా సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం