How to take care of car paint : మీ కారు పెయింట్‌ను ఇలా జాగ్రతగా చూసుకోండి..
How to take care of car paint : కొత్తగా కారు కొన్నారా? మీ కారు పెయింట్‌ను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో మీకు తెలుసా? అయితే ఇది మీకోసమే..
How to take care of car paint : కారు కొనడం అనేది చాలా మందికి ఓ కల. ఇక ఈ కలను సాకారం చేసుకునే సమయంలో.. బడ్జెట్‌కు తగ్గట్టు రకరకాల ఆప్షన్స్ చూస్తుంటారు. ఇంజిన్ నుంచి కంఫ్టర్ట్, సేఫ్టీ వరకు అన్ని విషయాలను ఆరా తీస్తారు. నచ్చిన రంగులో కారును తీసుకోవాలని ఆర్డర్ ఇస్తారు. కాస్త లేట్ అయినా ఫర్లేదు.. ఆ కలర్ కారు వచ్చేంత వరకు వెయిట్ చేసే వారు చాలా మందే ఉన్నారు. అంతా వచ్చాక.. కొన్ని రోజులకే కారు పెయింట్ పోతో? ఫేడ్ అయిపోతే? బాధపడక తప్పదు. పెయింట్ వేయించడం భారీ ఖర్చుతో కూడుకున్న విషయం. మరి కారు పెయింట్‌ను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి? అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాము..
కారును తరచూ వాష్ చేయండి..
కారును నీరు, వాష్ సోప్, స్పాంజ్‌తో తరచూ కడగడం అన్నది పెయింట్‌ను కాపాడుకోవడంలో ముఖ్యమైన విషయం. అంతేకాకుండా.. కారు హైజీన్‌గా ఉండాలంటే కడుగుతూ ఉండాలి. కారును తరచూ శుభ్రం చేస్తే.. దాని మీద ఉన్న డస్ట్, చెత్త, దుమ్ము, మట్టి పోతాయి. కారును వాష్ చేసిన తర్వాత దానిని సరిగ్గా డ్రై కూడా చేయాలి. సాఫ్ట్ మైక్రోఫైబర్ టవెల్‌తో డ్రై చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా.. కారును కడిగి గాలికి వదిలేస్తే.. నీటిలోని మినరల్స్.. కారు మీద ఉండిపోతాయి. అవి పెయింట్కి మంచిది కాదు!
వాక్సింగ్ చేయండి..
Car paint protection : కారును వాష్ చేసిన తర్వాత.. దానిని వాక్సింగ్ చేయించండి. ఫలితంగా పెయింట్ మీద దమ్ము, కాలుష్యం, నీరుతో పాటు హానికరమైన పదార్థాలు పడకుండా ప్రొటెక్షన్ లభిస్తుంది. వాక్స్ బాగా చేస్తే చిన్నపాటి స్క్రాచ్‌లు కూడా కవర్ అయిపోతాయి. సరైన టెక్నిక్‌లు వాడి కొన్ని నెలలకి ఓసారి వాక్సింగ్ చేస్తే మంచిది.
ఇదీ చదవండి:- Tips to improve car mileage : ఏ గేర్‌లో నడిపితే కారు మైలేజ్ పెరుగుతుంది?
సన్‌లైట్ తగలకుండా చూసుకోండి..
సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు.. మనిషి చర్మానికే కాదు.. కారు పెయింట్కి కూడా మంచిది కాదు! అల్ట్రావాయలెంట్ రేస్ వల్ల ఆక్సిడైజ్ అయ్యి పెయింట్ ఫేడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా.. కారు పాతదిగా కనిపిస్తుంది. అందుకే.. డైరక్ట్ సన్‌లైట్‌లో కారును ఉంచకపోవడం శ్రేయస్కరం. నీడలో పార్కు చేయాలి. అలా జరగలేని పక్షంలో.. కారుకు కవర్ కప్పేయాలి. ఈ విధంగా మీ కేబిన్ కూడా చల్లగా ఉంటుంది.
సిరామిక్ కోటింగ్ వాడండి..
car paint protection tips : వాక్స్‌కు ప్రత్యామ్నాయంగా సిరామిక్ కోటింగ్‌ను వాడొచ్చు. కారు పెయింట్‌కు ఇది రక్షణ కల్పిస్తుంది. వాహనంపై వాక్స్ కన్నా ఇది ఎక్కువ కాలం ఉండటం గమనార్హం. సరిగ్గా వాడితే ఇది ఏడాది కాలం వరకు ఉంటుంది. నాణ్యమైన సిరామిక్ కోటింగ్‌తో మీ కారు కొత్తగా కనిపిస్తుంది.
పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్‌ని ఉపయోగించండి..
Car paint protection film : కారు పెయింట్‌ను స్క్రాచ్‌లు, సన్‌లైట్, ఇతర హానికరమైన పదార్థాల నుంచి కాపాడేందుకు పీపీఎఫ్ (పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్) ఉపయోగపడుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సిరామిక్, వాక్స్ కన్నా ఇది చాలా ఎక్కువ కాలం నడుస్తుంది. పైగా.. ప్రొఫెషనల్స్ మాత్రమే దీనిని కారుకు వేయగలరు!
సంబంధిత కథనం