Honda Electric SUV : హోండా నుంచి సరికొత్త ఈవీ.. రేంజ్​, లాంచ్​ వివరాలివే!-honda to launch electric suv named prologue check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Electric Suv : హోండా నుంచి సరికొత్త ఈవీ.. రేంజ్​, లాంచ్​ వివరాలివే!

Honda Electric SUV : హోండా నుంచి సరికొత్త ఈవీ.. రేంజ్​, లాంచ్​ వివరాలివే!

Sharath Chitturi HT Telugu
Oct 02, 2023 04:01 PM IST

Honda Electric car : ఓ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని లాంచ్​ చేసే పనిలో ఉంది హోండా సంస్థ. లాంచ్​ టైమ్​, రేంజ్​ వంటి వివరాలు బయటకి వచ్చాయి. అవేంటంటే..

హోండా నుంచి సరికొత్త ఈవీ.. రేంజ్​ ఎంతంటే..!
హోండా నుంచి సరికొత్త ఈవీ.. రేంజ్​ ఎంతంటే..!

Honda Electric SUV : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా.. ఈవీవైపు వేగంగా అడుగులు వేస్తోంది. సంస్థ చరిత్రలోనే తొలి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. దీని పేరు హోండా ప్రొలాగ్​! 2024 తొలినాళ్లల్లో ఇది లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా కొత్త ఈవీ రేంజ్​ ఎంతంటే..!

ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న హోండా సీఆర్​-వీ ఎస్​యూవీతో పోల్చుకుంటే ఈ హోండా ప్రొలాగ్​ ఈవీ.. పెద్దగా ఉంటుందని సమాచారం. ఇంటీరియర్​ కూడా పెద్దగా ఉంటుందని తెలుస్తోంది. సోషల్​ మీడియాలో లీక్​ అయిన సమాచారం ప్రకారం.. ఈ హోండా కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​లో 85 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉండొచ్చు. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 482 కి.మీల దూరం ప్రయాణించవచ్చు. సింగిల్​ మోటార్​ లేదా డ్యూయెల్​ ఎలక్ట్రిక్​ మోటార్​ సెటప్​ ఉండొచ్చు. ఈ ఇంజిన్​ 288 బీహెచ్​పీ పవర్​ను, 451 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేసే విధంగా ఉంటుంది.

Honda Prologue EV : కేవలం ఎలక్ట్రిక్​ వాహనాల కోసమే ఓ కొత్త ప్లాట్​ఫామ్​ను రూపొందించింది హోండా సంస్థ. ఈ ప్రొలోగ్​ ఎస్​యూవీని ఇందులోనే తయారు చేస్తోంది. రానున్న సంవత్సరాల్లో మరిన్న ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలు ఈ ప్లాట్​ఫామ్​పై తయారయ్యే అవకాశం లేకపోలేదు!

ఇదీ చూడండి:- Skoda new electric vehicle : స్కోడా నుంచి సరికొత్త ఈవీ.. తక్కువ ధరకే క్రేజీ ఫీచర్స్​!

ఇక ఈ హోండా ప్రొలాగ్​ ఇంటీరియర్​, ఫీచర్స్​పై పెద్దగా డేటా లేదు. అయితే ఇందులో పానోరమిక్​ సన్​రూఫ్​ ఉంటుందని తెలుస్తోంది. రేర్​లో హెచ్​- మార్క్​ బ్యాడ్జ్​ ఉండనుంది. 21 ఇంచ్​ వీల్స్​ రానున్నాయి. నార్త్​ షోర్​ పర్ల్​ రంగులో ఇది అందుబాటులోకి రావొచ్చు.

ఇండియా లాంచ్​ ఎప్పుడు..?

Honda Prologue EV price in India : హోండా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీగా గుర్తింపు పొందనున్న ఈ ప్రొలాగ్​.. ఇండియాలో ఇప్పట్లో లాంచ్​ అవ్వకపోవచ్చు. ఇండియాలో సంస్థ ఫ్యూచర్​ ప్లాన్స్​లో ఈ ఎస్​యూవీ పేరు లేకపోవడం ఇందుకు కారణం.

ఇక ఈ మోడల్​ లాంచ్​ డేట్​, పూర్తి ఫీచర్స్​, ధర వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. లాంచ్​ టైమ్​ సమీపించే కొద్ది.. వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం