Hero Xpulse 210 : కుర్రాళ్లకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే రాబోతున్న హీరో కొత్త అడ్వెంచర్ బైక్-hero xpulse 210 teased ahead of eicma 2024 check more details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Xpulse 210 : కుర్రాళ్లకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే రాబోతున్న హీరో కొత్త అడ్వెంచర్ బైక్

Hero Xpulse 210 : కుర్రాళ్లకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే రాబోతున్న హీరో కొత్త అడ్వెంచర్ బైక్

Anand Sai HT Telugu
Nov 06, 2024 05:37 AM IST

Hero Xpulse 210 : అడ్వెంచర్ బైకులంటే కుర్రాళ్లకు చాలా క్రేజ్. కొత్తగా హీరో అడ్వెంచర్ బైకు తక్కువ ధరతో రాబోతోంది. ఈ మేరకు హీరో ఎక్స్‌పల్స్ 210 వివరాలు వెల్లడయ్యాయి.

హీరో ఎక్స్‌పల్స్
హీరో ఎక్స్‌పల్స్

ఇండియాలో అడ్వెంచర్ బైక్‌లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, హీరో ఎక్స్‌ప్లస్ వంటి బైకుల అమ్మకాలే ఇందుకు ఉదాహరణ. తక్కువ ధరకే ఎక్స్‌పల్స్ పేరుతో బైక్‌ను విడుదల చేసి అడ్వెంచర్ సెగ్మెంట్‌లో హీరో కంపెనీ పెను తుఫాను సృష్టించింది. ఇప్పుడు హీరో కంపెనీ తన కొత్త ఎక్స్‌పల్స్‌లో 210 సిసి వెర్షన్‌ను విడుదల చేయడానికి రెడీ అయింది.

త్వరలో భారతీయ మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బైక్ రాబోయే నెలల్లో అమ్మకానికి రానుంది. ఈ కొత్త హీరో ఎక్స్‌పల్స్ 210 బైక్‌కి సంబంధించిన కొత్త టీజర్ విడుదలైంది. టీజర్ కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పాటు హెచ్ ఆకారపు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లతో ప్రొజెక్టర్ సెటప్‌తో రానుంది.

టీజర్ కొత్త టీఎఫ్‌టీ డిస్‌ప్లేను కూడా ప్రదర్శించింది. ఈ కొత్త బైక్‌లో రోడ్ మోడ్ కూడా ఉంటుంది. ఇంజిన్ పవర్ డెలివరీని మార్చే లేదా ఏబీఎస్‌ని ఆన్ లేదా ఆఫ్ చేసే రైడింగ్ మోడ్‌లను కూడా ఆశించొచ్చు. కొత్త హీరో ఎక్స్‌పల్స్ 210 బైక్ ఇటీవల లడఖ్‌లోని ఖర్దుంగ్‌లా సమీపంలో కనిపించింది. కరిష్మా ఎక్స్ఎమ్ఆర్ 210 స్పోర్ట్స్ బైక్ నుండి లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఈ బైక్ పోలి ఉంటుంది. ఇది డ్యూయల్ పర్పస్ అడ్వెంచర్ టూరర్ బైక్. కరిష్మా 210సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

అడ్వెంచర్ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌కు మద్దతు ఇచ్చే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడా వస్తుంది. ఇది స్విచ్ చేయగల డ్యూయల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇతర విషయానికి వస్తే కొత్త హీరో ఎక్స్‌పల్స్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనక వైపున మోనోషాక్‌ను పొందుతుంది.

రైడర్‌ను విండ్‌బ్లాస్ట్ నుండి రక్షించడానికి కొత్త విండ్‌స్క్రీన్, అడ్వెంచర్ టూరర్, ఆఫ్-రోడ్ మోటార్‌సైకిళ్లకు సాధారణమైన ఎల్ఈడీ టర్న్ సూచికలు రానున్నాయి. బాడీ ప్యానెల్‌లలో కూడా కొన్ని మార్పులు ఆశించొచ్చు. ధర కూడా తక్కువే ఉండే అవకాశం ఉంది.

Whats_app_banner