Hero MotoCorp price hike : కస్టమర్లకు భారీ షాక్​- హీరో బైక్స్​, స్కూటర్స్​ ధరల పెంపు.. !-hero motorcycles and scooters to get more expensive from july 1 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Motocorp Price Hike : కస్టమర్లకు భారీ షాక్​- హీరో బైక్స్​, స్కూటర్స్​ ధరల పెంపు.. !

Hero MotoCorp price hike : కస్టమర్లకు భారీ షాక్​- హీరో బైక్స్​, స్కూటర్స్​ ధరల పెంపు.. !

Sharath Chitturi HT Telugu
Jun 24, 2024 12:45 PM IST

Hero MotoCorp price hike : కస్టమర్ల జేబులకు చిల్లు! హీరో మోటోకార్ప్​ సంస్థ.. తన పోర్ట్​ఫోలియోలోని అన్ని బైక్స్​, స్కూటర్స్​ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలు..

File photo of 2024 Hero హీరో బైక్స్​, స్కూటర్స్​ ధరల పెంపు.. !Plus Xtec 2.0.
File photo of 2024 Hero హీరో బైక్స్​, స్కూటర్స్​ ధరల పెంపు.. !Plus Xtec 2.0.

Hero bikes price hike : కస్టమర్లకు షాక్​ ఇస్తూ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హీరో మోటోకార్ప్​.. తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. పెంచిన ధరలు జులై 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఫలితంగా.. బెస్ట్​ సెల్లింగ్​ హీరో స్ప్లెండర్​, హీరో ప్యాషన్​, హీరో గ్లామర్​ ధరలు పెరగనున్నాయి.

హీరో మోటోకార్ప్​ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మోడల్స్​పై గరిష్ఠంగా రూ. 1,500 వరకు ధరల పెంపు ఉంటుంది. అయితే.. ఏ బైక్​పై, ఏ స్కూటర్​పై కచ్చితంగా ఎంత పెంచుతున్నామో సంస్థ ఇంకా చెప్పలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే.. వాహనాల ధరల పెంపు నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై ప్రతి ఆటోమొబైల్​ సంస్థ చెప్పే మాటలే హీరో మోటోకార్ప్​ పునరుద్ఘటించింది. ముడిసరకు ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనాల ధరలను పెంచుతున్నట్టు స్పష్టం చేసింది.

Hero splendor on road price in Hyderabad : 2 వీలర్​ వాహనాల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది హీరో మోటోకార్ప్​. ఇండియన్​ మార్కెట్​పైనా మంచి పట్టు ఉంది. కానీ.. గత మే నెలలో (ఇయర్​ ఆన్​ ఇయర్​) సంస్థ సేల్స్​ 7శాతం తగ్గాయి. 2023 మేలో 5,08,309 యూనిట్​లను విక్రయించిన హీరో మోటోకార్ప్​.. ఈసారి మాత్రం 4,79,450 యూనిట్​లను అమ్మగలిగింది. అయితే.. గతేడాదితో పోల్చితే ఈసారి ఎగుమతులు పెరిగాయి. 2023 మేతో (11,165) పోల్చితే.. ఈసారి 18,673 యూనిట్​లను విక్రయించింది.

ఇదీ చూడండి:- BMW CE 04 : ఇండియాలో బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

ధరల పెంపుతో సంస్థ సేల్స్​పై ప్రభావం ఎంత?

హీరో మోటోకార్ప్​ పోర్ట్​ఫోలియోలో హీరో స్ప్లెండర్​, హీరో ప్యాషన్​, హీరో గ్లామర్​, ఎక్స్​పల్స్​, ఎక్స్​ట్రీమ్​, డెస్టినీ, ప్లెజర్​+ లు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​గానే ఉన్నాయి.

అయితే.. ప్రైజ్​ పాయింట్​ విషయంలో దేశీయ 2- వీలర్​ ఆటోమొబైల్​ మార్కెట్​ చాలా సెన్సిటివ్​. కాగా.. ధరల పెంపుతో డిమాండ్​ తగ్గకపోవచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. పైగా.. ఈసారి రుతుపవనాలు సాధారణం కన్నా మెరుగ్గా ఉంటాయన్న వార్తల నేపథ్యంలో.. రూరల్​ మార్కెట్​లో మంచి డిమాండ్​ కనిపిస్తుందని ఆశిస్తున్నాయి.

Hero price hike : అయితే.. డిమాండ్​ ఉన్నా, సప్లై చెయిన్​ సరఫరాలో జాప్యం, మార్కెటింగ్​ కార్యకలాపాలు సరిగ్గా లేకపోవడం.. మార్కెట్​కు నష్టం చేస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హీరో మోటోకార్ప్​ తర్వాత ఇతర సంస్థలు కూడా తమ వాహనాల ధరలను పెంచుతాయో లేదో చూడాలి.

గత కొన్నేళ్లుగా వాహనాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల జేబుకు చిల్లులు పడుతూనే ఉన్నాయి. పైగా.. లోక్​సభ ఎన్నికల కోసం ఓపికపట్టిన రాష్ట్రాలు.. ఇప్పుడిప్పుడే పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలో కర్ణాటక, గోవా చేరాయి. త్వరలో మరిన్ని రాష్ట్రాలు ఈ లిస్ట్​లో చేరే అవకాశం ఉంది. ఇది.. కస్టమర్లపై భారాన్ని మరింత పెంచుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం