EPFO Wage Ceiling hike: ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెరగనుందా? కేంద్రం ఏమంటోంది?
EPFO Wage Ceiling hike: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లో చందాదారులుగా చేరడానికి అవసరమైన వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచనుందని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ వేతన పరిమతి పెంచాలన్న ప్రతిపాదన చాన్నాళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది.
EPFO news: ఈపీఎఫ్ఓ (EPFO) వేతన పరిమితిని రూ. 15,000 నుంచి రూ. 21,000 లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. తద్వారా ఈపీఎఫ్ఓ పరిధిని విస్తరించి, ఈ సామాజిక భద్రత సదుపాయాన్ని మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
లాంగ్ పెండింగ్ ప్రపోజల్
ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని పెంచాలన్న డిమాండ్ ఉద్యోగుల నుంచి చాలా సంవత్సరాలుగా వస్తోంది. దాంతో, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది. గతంలో చివరగా, ఈపీఎఫ్ఓ వేతన పరిమితి (EPFO Wage Ceiling) ని 2014 లో పెంచారు. అప్పుడు, పీఎఫ్ వేతన పరిమితిని రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు పెంచారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని పెంచి దాదాపు 8 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో, మరోసారి ఈ పరిమితిని పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే, ఈ డిమాండ్ కు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోకి ఇంకా ఎక్కువ మంది ఉద్యోగులు వస్తారు. దానివల్ల, ప్రభుత్వం పై మరింత ఆర్థిక భారం పడుతుంది. అందువల్ల, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తోందని తెలుస్తోంది.
అధిక పెన్షన్ కోసం మార్గదర్శకాలు
అర్హులైన ఉద్యోగుల కోసం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి EPFO గత ఏడాది జూన్‌లో చర్యలు చేపట్టింది. వారి యజమాని నుండి ఉమ్మడి అభ్యర్థన లేదా అనుమతి లేని వారికి ఈ ప్రక్రియ సౌకర్యాన్ని సులభతరం చేసింది. జూన్ 14, 2023న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, EPFO అవసరమైన పత్రాలు మరియు అధిక పెన్షన్ దరఖాస్తులను అంగీకరించే విధానాన్ని వివరించింది. ఈ ప్రక్రియలో యజమానిచే ధృవీకరణ, డిజిటల్ మార్పిడి, పర్యవేక్షకులు మరియు ఖాతా అధికారులచే పరీక్ష, దరఖాస్తుదారులకు తుది కమ్యూనికేషన్.. తదితర దశలు ఉంటాయి. సెప్టెంబర్ 1, 2014 నాటికి EPF సభ్యులుగా ఉన్నవారు మాత్రమే అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి అర్హులు. EPFO ఫీల్డ్ ఆఫీసుల్లో కూడా ఇప్పుడు EPF పథకం కింద అధిక పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి.