Citroen Basalt : టాటా కర్వ్​కి పోటీగా సిట్రోయెన్​ బసాల్ట్​ లాంచ్​- ఈ కూపే ఎస్​యూవీని కొనొచ్చా?-citroen basalt coupe suv launched in india prices start at 7 99 lakh ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen Basalt : టాటా కర్వ్​కి పోటీగా సిట్రోయెన్​ బసాల్ట్​ లాంచ్​- ఈ కూపే ఎస్​యూవీని కొనొచ్చా?

Citroen Basalt : టాటా కర్వ్​కి పోటీగా సిట్రోయెన్​ బసాల్ట్​ లాంచ్​- ఈ కూపే ఎస్​యూవీని కొనొచ్చా?

Sharath Chitturi HT Telugu
Aug 09, 2024 12:05 PM IST

Citroen Basalt price India : సిట్రోయెన్ బసాల్ట్ భారతదేశంలో మొదటి లాంచ్​ అయిన ఐసీఈ-ఆధారిత కూపే ఎస్​యూవీ. ఈ మోడల్​ ఫీచర్స్​, మైలేజ్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

సిట్రోయెన్​ బసాల్ట్​ లాంచ్
సిట్రోయెన్​ బసాల్ట్​ లాంచ్

ఇండియాలో కూపే ఎస్​యూవీ సెగ్మెంట్​ని తెరలేపుతూ కర్వ్​ ఈవీని లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. ఇక ఈ సెగ్మెంట్​లో మరో కొత్త మోడల్​ తాజాగా లాంచ్​ అయ్యింది. దీని పేరు సిట్రోయెన్​ బసాల్ట్​. ఈ కూపే ఎస్​యూవీ ప్రారంభ ధర రూ .7.99 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ప్రారంభ ధర 2024 అక్టోబర్ 31 వరకు వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది. సంస్థకు చెందిన డీలర్​షిప్​ షోరూమ్స్​లో రూ.11,001 టోకెన్ అమోంట్​తో బుకింగ్​లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. 

ఈ సిట్రోయెన్​ బసాల్ట్ మాస్-మార్కెట్ సెగ్మెంట్​లో మొదటి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) కూపే ఎస్​యూవీ! ఇప్పటికే ఎలక్ట్రిక్ అవతారంలో విడుదల చేసిన టాటా కర్వ్​కు పోటీగా ఉంటుంది. టాటా కర్వ్ ఐసీఈ సెప్టెంబర్ 2, 2024న లాంచ్ కానుంది.

2021లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన సిట్రోయెన్ నుంచి వస్తున్న ఐదొవ ప్రాడక్ట్​ ఈ బసాల్ట్​. మార్కెట్​లో సిట్రోయెన్​కి సంబంధించి ఇప్పటికే సీ5 ఎయిర్ క్రాస్, సీ3, ఈ-సీ3, సీ3 ఎయిర్ క్రాస్ వంటి కార్లు అందుదుబాటులో ఉన్నాయి.

సిట్రోయెన్ బసాల్ట్ స్పెసిఫికేషన్లు..

సిట్రోయెన్ బసాల్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 80బీహెచ్​పీ పవర్, 115 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.2-లీటర్ 3 సిలిండర్​, టర్బో పెట్రోల్ 109 బీహెచ్​పీ పవర్​ని అందిస్తుంది. ట్రాన్స్​మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మేన్యువల్ 190 ఎన్ఎమ్ టార్క్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ 205 ఎన్ఎమ్ టార్క్​ జనరేట్​ అవుతుంది.

సిట్రోయెన్ బసాల్ట్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ..

సిట్రోయెన్ కొత్త కూపే ఎస్​యూవీ 1.2 నేచురల్ ఆస్పిరేటెడ్ మోడల్​లో లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 1.2 టర్బో పెట్రోల్ మన్యువల్ లీటర్​కు 19.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ లీటరుకు 18.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

సిట్రోయెన్ బసాల్ట్ ఫీచర్లు..

కొత్త సిట్రోయెన్ బసాల్ట్ కూపై ఎస్​యూవీలో ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16 ఇంచ్​ అల్లాయ్ వీల్స్, ర్యాప్ రౌండ్ టెయిల్ లైట్స్, రియర్ ఏసీ వెంట్స్, రెండో వరుసలో ఉన్నవారికి అడ్జెస్టబుల్ థై-సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కూపే ఎస్​యూవీలో వైర్​లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25-ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా లభిస్తుంది.

సేఫ్టీ విషయానికొస్తే, ఈ కొత్త కూపే ఎస్​యూవీలో స్టాండర్డ్​గా 6 ఎయిర్ బ్యాగులు, ఈఎస్​సీ, పార్కింగ్ సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) ఉంటాయి. పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్ అనే ఐదు మోనోటోన్లతో సహా ఏడు రంగుల్లో బసాల్ట్ కూపే ఎస్​యూవీ లభిస్తుంది. గ్రే రూఫ్​తో పోలార్ వైట్, బ్లాక్ రూఫ్​తో గార్నెట్ రెడ్ అనే రెండు డ్యూయెల్ టోన్ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి.

కూపే ఎస్​యూవీనే అయినప్పటికీ ఈ సిట్రోయెన్​ బసాల్ట్​.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, వోక్స్ వ్యాగన్ టైగన్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ సహా మరెన్నో కాంపాక్ట్ ఎస్​యూవీలతో పోటీ పడనుంది . డైరక్ట్​ ఫైట్​ మాత్రం వచ్చే నెలలో లాంచ్​ అయ్యే టాటా కర్వ్​ ఐసీఈ వర్షెన్​తోనే ఉంటుంది.

సంబంధిత కథనం