Recharge Plans : నెల నెలా రీఛార్జ్ చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందా? ఇదిగో చౌకైన 1 ఇయర్ ప్లాన్స్-cheapest 365 days validity prepaid recharge plans from bsnl airtel jio and vi check in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Recharge Plans : నెల నెలా రీఛార్జ్ చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందా? ఇదిగో చౌకైన 1 ఇయర్ ప్లాన్స్

Recharge Plans : నెల నెలా రీఛార్జ్ చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందా? ఇదిగో చౌకైన 1 ఇయర్ ప్లాన్స్

Anand Sai HT Telugu
Oct 20, 2024 08:30 PM IST

1 Year Recharge Plans : ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవడం కొందరికి ఇబ్బంది. అందుకే ఏడాది ప్లాన్స్ కోసం చూస్తారు. అలాంటివారి కోసం చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..

365 రోజుల రీఛార్జ్ ప్లాన్స్
365 రోజుల రీఛార్జ్ ప్లాన్స్

ప్రతి నెలా మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకోవడం కాస్త చిరాకుగా అనిపిస్తుంది. ఈ టెన్షన్ వద్దనుకుంటే 365 రోజుల వ్యాలిడిటీతో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. యాన్యువల్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాది పొడవునా టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఎయిర్‌టెల్, జియో, వొడా ఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ చౌకైన వార్షిక రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. ఏ కంపెనీ తన కస్టమర్లకు అతి తక్కువ ధరకు 365 రోజుల వాలిడిటీ ప్లాన్‌ను అందిస్తుందో చూడండి..

బీఎస్ఎన్ఎల్

బీఎస్ఎన్ఎల్ 365 రోజుల వ్యాలిడిటీతో చౌకైన ప్లాన్‌ను రూ.1198గా నిర్ణయించింది. ఈ ప్లాన్లో కస్టమర్లకు 12 నెలల పాటు 300 నిమిషాల కాలింగ్, 3 జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. కంపెనీ వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం, అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 24 మధ్య రీఛార్జ్ చేసే వినియోగదారులకు 24 రోజుల వ్యాలిడిటీతో 24 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ రూ.1999తో 365 రోజుల వాలిడిటీతో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్లో వినియోగదారులు 365 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. ఈ ప్లాన్ 24 జీబీ డేటాను అందిస్తుంది. డేటా ముగిసిన తర్వాత మీరు ప్రత్యేక డేటా ప్యాక్ కొనాల్సి ఉంటుంది. అదనపు ప్రయోజనంగా ఈ ప్లాన్‌లో అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్స్, స్పామ్ కాల్ అలర్ట్స్ ఉన్నాయి.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో రూ.3599తో 365 రోజుల వాలిడిటీతో ప్లాన్‌ను కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు 365 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, రోజుకు 2.5 జీబీ డేటా అంటే మొత్తం 912.5 జీబీ, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. రోజువారీ డేటా కోటా అయిపోయిన తర్వాత కూడా వినియోగదారులు 64 కేబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. జియో 5జీ నెట్ వర్క్ మీ ప్రాంతంలో ఉండి, మీ వద్ద 5జీ ఫోన్ ఉంటే అపరిమిత 5జీ డేటాను ఉచితంగా వాడుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఈ ప్లాన్‌లో లభిస్తుంది.

వొడాఫోన్ ఐడియా

వొడాఫోన్ ఐడియా (వీఐ) 365 రోజుల వ్యాలిడిటీతో రూ.1999 రీఛార్జ్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్లో వినియోగదారులకు 24 జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌తో మొత్తం 3600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. డేటా కోటా అయిపోతే 1 ఎంబీకి 50 పైసలు, ఎస్ఎంఎస్ కోటా అయిపోయినప్పుడు స్థానిక ఎంఎంఎస్‌కు రూ.1, ఎస్టీడీ ఎంఎంఎస్‌కు రూ.1.5 వసూలు చేస్తారు.

Whats_app_banner