Bajaj Pulsar 400 : బజాజ్ పల్సర్ 400 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్స్ లీక్!
Bajaj Pulsar 400 launch date : బజాజ్ బైక్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! బజాజ్ పల్సర్ 400 లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఆన్లైన్లో లీక్ అయిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Bajaj pulsar 400 on road price Hyderabad : బైక్ లవర్స్‌కి క్రేజీ న్యూస్..! ఫ్లాగ్షిప్ బజాజ్ పల్సర్ 400 లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మే 3, 2024న ఈ బైక్‌ని లాంచ్ చేయనుంది దిగ్గజ 2 వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో. కాగా.. లాంచ్‌కు ముందే.. ఈ కొత్త బైక్‌కి సంబంధించిన కొన్ని వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. అఫార్డిబుల్ ధరలో మంచి మంచి ఫీచర్స్‌తో ఈ పల్స్ 400 బైక్ రెడీ అవుతోందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బైక్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూద్దాము..
బజాజ్ పల్స్ 400 బైక్ విశేషాలు..
ఆన్లైన్లో లీక్ అయిన డేటా ప్రకారం.. బజాజ్ పల్సర్ 400 బైక్‌లో రీడిజైన్డ్ ఫ్రంట్ ఫేస్- ట్యాంక్ ఉంటాయి. ముఖ్యంగా, పల్సర్ 400 లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది. ప్రతి వైపు ట్విన్ డీఆర్ఎల్స్ ఉంటాయి. ఆన్లైన్లో లీక్ అయిన బైక్ ఫొటోలను V12Allies.in అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ప్రదర్శించారు. అదనంగా.. టర్న్-బై-టర్న్ నావిగేషన్ సహా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లతో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఊహాగానాలు సూచిస్తున్నాయి.
Bajaj pulsar 400 : డామినార్ 400 నుంచి ప్రేరణ పొందిన పల్సర్ 400 బైక్.. స్ల్పిట్ రివర్స్ ఎల్సీడీ డిస్ప్లేని వారసత్వంగా పొందవచ్చు. లేదా అప్‌గ్రేడ్ చేసిన ఫుల్-కలర్ డిస్ప్లే కలిగి ఉండొచ్చు. డామినర్ 400లో కనిపించే ఇంజినే.. ఈ కొత్త బైక్‌లోనూ ఉండొచ్చు. ఇది.. 39 బీహెచ్పీ పవర్ 35 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
ఇదీ చూడండి:- Tata Altroz on road price Hyderabad : హైదరాబాద్‌లో టాటా ఆల్ట్రోజ్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
ట్రయంఫ్ స్పీడ్ 400, కెటిఎమ్ 390 డ్యూక్.. బీఎమ్‌డబ్ల్యూ జీ310ఆర్ వంటి పోటీదారుల నుంచి భిన్నంగా.. ఈ పల్సర్ ఏరోడైనమిక్ ప్రొఫైల్ ఉంటుందని తెలుస్తోంది.
బజాజ్ పల్సర్ 400 బైక్‌లో వెడల్పాటి రియర్ టైర్, రెండు వైపులా 17 ఇంచ్ చక్రాలు, స్టాండర్డ్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటాయి.
Bajaj pulsar 400 tp speed : పల్సర్ బైక్ మొదటిసారి 2001 లో లాంచ్ అయ్యింది. అప్పటి నుంచి భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్లో దూసుకెళుతోంది. గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది.
బజాజ్ పల్సర్ 400ని పక్కనపెడితే.. సీఎన్జీ బైక్స్‌ని లాంచ్ చేస్తామని సంస్థ చెప్పిన మాటలతో మార్కెట్ ఎగ్జైట్ అయ్యింది. జూన్ 2024 లో ప్రారంభం కానున్న ఈ ఆవిష్కరణ.. ఆటోమోటివ్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
సంబంధిత కథనం