Ather Rizta : ఏథర్​ రిజ్టా ప్రొడక్షన్​ షురూ- ఈ-స్కూటర్​ కొనొచ్చా? ధర, రేంజ్​ వివరాలు చూసేయండి..-ather rizta production begins check out price range of latest escooter ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ather Rizta : ఏథర్​ రిజ్టా ప్రొడక్షన్​ షురూ- ఈ-స్కూటర్​ కొనొచ్చా? ధర, రేంజ్​ వివరాలు చూసేయండి..

Ather Rizta : ఏథర్​ రిజ్టా ప్రొడక్షన్​ షురూ- ఈ-స్కూటర్​ కొనొచ్చా? ధర, రేంజ్​ వివరాలు చూసేయండి..

Sharath Chitturi HT Telugu
Jun 10, 2024 11:15 AM IST

Ather Rizta : ఏథర్​ రిజ్టా ప్రొడక్షన్​ మొదలైంది. మరి ఈ ఈ-స్కూటర్​ని​ కొనొచ్చా? ధర, రేంజ్​తో పాటు ఇతర పూర్తి వివరాలు చూసేయండి..

ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఏథర్​ రిజ్టా..
ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఏథర్​ రిజ్టా..

Ather Rizta on road price in Hyderabad : ఏథర్​ రిజ్టా స్కూటర్​పై మరో కీలక అప్డేట్! ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఉత్పత్తి ప్రారంభమైంది. ఏథర్ రిజ్టా ఈ ఏడాది తొలినాళ్లల్లో రూ .1.10 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇంట్రడక్టరీ) ప్రారంభ ధరతో లాంచ్​ అయ్యింది. దీనిని ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​గా ప్రమోట్​ చేస్తోంది సంస్థ. ఇది మూడు వేరియంట్లు, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఈ-స్కూటర్​ని కొనే ముందు.. దీని వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఏథర్​ రిజ్టా వివరాలు..

తమిళనడు హోసూర్ తయారీ కేంద్రంలో ఏథర్ రిజ్టా ప్రొడక్షన్​ ఇటీవలే ప్రారంభమైంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా సోమవారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్​లో ఈ అధికారిక ప్రకటన చేశారు. కొత్త రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏథర్ చాలా ఆశలు పెట్టుకుంది. కుటుంబాలకు సౌకర్యవంతమైన రైడ్ ఎంపికగా ఇది నిలుస్తుందని చెబుతోంది.

ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాలకు సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. ముఖ్యంగా.. ఎలక్ట్రిక్​ 2 వీలర్​లను కొనేందుకు కస్టమర్లు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టు ఆప్షన్స్​ ఇస్తుండటంతో.. ఏథర్​ సంస్థకు మంచి పేరు వచ్చింది. తక్కువ కాలంలోనే బాగా ఎదిగింది. ఎథర్ 450ఎస్, 450ఎక్స్, 450 అపెక్స్ వంటి మోడళ్లు.. మార్కెట్​లో ఉన్న ఇతర ఈవీ తయారీ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. అయితే ఏథర్ రిజ్టా.. పూర్తిగా కొత్త మోడల్​గా వస్తుండటం.. పోటీని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది సంప్రదాయకంగా కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం తో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి వాటికి కూడా బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది.

ఏథర్ రిజ్టా ధర ఎంత?

Ather Rizta price in Hyderabad : ఈ ఏడాది ఏఫ్రిల్​లో.. ఏథర్​ రిజ్టా అధికారికంగా భారత మార్కెట్​లోకి అడుగుపెట్టింది. దీని ప్రారంభ ధర రూ .1.10 లక్షలు. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ గరిష్ఠ ధర సుమారు రూ .1.46 లక్షలు (ఎక్స్-షోరూమ్. ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజ్​లని గుర్తుపెట్టుకోవాలి. రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన మోడళ్లపై వర్తించే వివిధ రాయితీలకు కూడా ఇస్తోంది ఏథర్​ సంస్థ.

ఏథర్ రిజ్టా రేంజ్ ఎంత?

ఏథర్ రిజ్టా డ్యూయెల్​ బ్యాటరీ-ప్యాక్ ఎంపికలను పొందుతుంది. ప్రతి దానికి రేంజ్​ మారుతుంది. రిజ్టా అత్యంత సరసమైన వెర్షన్ 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 105 కిలోమీటర్లను రేంజ్​ ఇస్తుంది. ఇందులో 3.7 కిలోవాట్ల పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది సుమారు 125 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఏథర్ రిజ్టా స్పెషల్ హైలైట్స్ ఏంటి?

ఫ్రేమ్​కు అమర్చిన పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటారుతో నడిచే ఎథర్ రిజ్టా 3.7 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీ, మోనో-ఎల్ఈడీ హెడ్​ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్లైట్లు, 12-ఇంచ్​ అల్లాయ్ వీల్స్​తో కూడిన టిీఎఫ్టీ టచ్-ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్.. ఏథర్ రిజ్టా ఫీచర్ల జాబితాలో ఉంది. 34 లీటర్ల కార్గో ఏరియాతో ప్యాక్ చేసిన రిజ్టా భారతదేశంలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్​తో పోల్చినా అతిపెద్ద సీటును కలిగి ఉంది.

ఎథర్ రిజ్టా.. సంస్థకు చెదిన 450 సిరీస్ నుంచి ప్రేరణ పొందింది. కానీ గణనీయంగా భిన్నమైన డిజైన్​తో పూర్తిగా కొత్త ప్లాట్​ఫామ్​పై రూపొందించడం జరిగింది. టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్ 1 ఎయిర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి పెట్రోల్ ఆధారిత మోడళ్లకు రిజ్టా గట్టి పోటీ ఇస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం