Ather Rizta electric scooter : ఏథర్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ‘రిజ్టా’ వచ్చేస్తోంది..-ather rizta electric scooter teased by comedian anubhav singh bassi ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ather Rizta Electric Scooter : ఏథర్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ‘రిజ్టా’ వచ్చేస్తోంది..

Ather Rizta electric scooter : ఏథర్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ‘రిజ్టా’ వచ్చేస్తోంది..

Sharath Chitturi HT Telugu
Feb 18, 2024 08:00 AM IST

Ather Rizta family scooter : ఏథర్​ ఎనర్జీ నుంచి ఓ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రాబోతోంది. అది.. ఏథర్​ రిజ్టా. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

ఏథర్​ రిజ్టాతో ప్రముఖ​ కమీడియన్​ అనుభవ్​ సింగ్​ బస్సి..
ఏథర్​ రిజ్టాతో ప్రముఖ​ కమీడియన్​ అనుభవ్​ సింగ్​ బస్సి..

Ather Rizta e- scooter : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​కు మంచి డిమాండ్​ కనిపిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా.. 2 వీలర్​ ఈవీ సెగ్మెంట్​లో అటు డిమాండ్​తో పాటు ఇటు పోటీ కూడా తీవ్రంగానే ఉంటోంది. ఇక ఇప్పుడు.. పోటీని మరింత పెంచుతూ.. ఓ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఏథర్​ ఎనర్జీ. ఈ ఈ-స్కూటర్​ పేరు రిజ్టా! భారతీయ కుటుంబాలకు సూట్​ అయ్యే విధంగా.. ఈ ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్​ని సంస్థ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మోడల్​.. లాంచ్​ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో.. ఈ ఈవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫీచర్స్​ ఇవే..!

ఈ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​కి సంబంధించిన టీజర్​ని తాజాగా విడుదల చేసింది.. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ. టీజర్​ ద్వారా పలు కీలక వివరాలు స్పష్టమైయ్యాయి. ఏథర్​ రిజ్టా ఈ-స్కూటర్​ లోవర్​ ఆప్రాన్​లో ఎల్​ఈడీ హెడ్​లైట్​ ఇంటిగ్రేట్​ అయ్యి ఉంటుంది. ఫ్రెంట్​లో భారీ ఇన్​స్ట్రుమెంట్​ ప్యానెల్​ కూడా ఉంది. అది టచ్​స్క్రీన్​ అయ్యే అవకాశం ఉంది.

Ather Rizta family scooter : ఏథర్​ 450ఎస్​లో ఉన్న ఎల్​సీడీ ప్యానెల్​నే కొత్త ఈవీలో కూడా కొనసాగించవచ్చు. తద్వారా.. ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో బ్లూటూత్​ కనెక్టివిటీ, నేవిగేషన్​ ఫీచర్స్​కు కొదవే ఉండదు! స్టైలిష్​ టర్న్​ ఇండికేటర్స్​తో పాటు ఫుల్లీ డీజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​ కూడా వస్తాయి.

ఇదీ చూడండి:- Tata EV's price cut : ‘ఈవీ’ ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్​.. రూ. 1.2 లక్షల వరకు!

కొత్త ఈవీలో లాంగ్​, వైడ్​ సీట్​, డీసెంట్​ అండర్​ సీట్​ స్టోరేజ్​ ఉంటాయి. ఏథర్​ 450ఎక్స్​తో పోల్చితే.. ఈ ఏథర్​ రిజ్టాలో కొత్త మోటర్​తో పాటు పెద్ద బ్యాటరీ ప్యాక్​ ఉండే అవకాశం ఉంది. 2.9 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఇందులో ఉండొచ్చు.

ఏథర్​ రిజ్టా- లాంచ్​ ఎప్పుడు? ధర ఎంత?

Ather Rizta launch date in India : 2024 జూన్​లో ఏథర్​ కమ్యూనిటీ డే జరగనుంది. ఆ ఈవెంట్​లోనే..​ ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్​ని సంస్థ లాంచ్​ చేస్తుందని టాక్​ నడుస్తోంది. ఈ మోడల్​ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ.. ఈ ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 1.25 లక్షలు- రూ. 1.35 లక్షల మధ్యలో ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఏథర్​ రిజ్టాకి చెందిన ఓ ఫొటోను తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో షేర్​ చేశారు ప్రముఖ స్టాండప్​ కమీడియన్​ అనుభవ్​ సింగ్​ బస్సి.

ఇక ఈ ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇతర ఫీచర్స్​, ధర వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం