Ambani family wealth: అంబానీ కుటుంబ సంపద ఎంతో తెలుసా? మన దేశ జీడీపీలో 10 శాతం..!
Ambani family wealth: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన, భారత్ లోని ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన ముకేశ్ అంబానీ కుటుంబ సంపదకు సంబంధించి ‘బార్క్లేస్-హురున్ ఇండియా’ ఒక నివేదికలో ఆసక్తికర విశేషాలను వెల్లడించింది అంబానీ కుటుంబ సంపద భారత జీడీపీలో 10% ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది.
Ambani family wealth: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ (Mukesh ambani) కుటుంబం సంపద భారత జీడీపీలో 10 శాతం ఉంటుందని బార్క్లేస్-హురున్ ఇండియా నివేదిక వెల్లడించింది. భారత్ లోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాను బార్క్లేస్-హురున్ ఇండియా నివేదికలో పొందుపర్చారు.
అంబానీ ఫ్యామిలీ టాప్
భారత్ లోని సంపన్న కుటుంబాలకు సంబంధించి బార్క్లేస్-హురున్ ఇండియా రూపొందించిన నివేదికలో అంబానీ కుటుంబం రూ .25.75 ట్రిలియన్ల విలువతో అగ్రస్థానంలో ఉంది. ఇది భారతదేశ జీడీపీ (GDP) లో దాదాపు 10 శాతానికి సమానం. మార్చి 20, 2024 నాటికి కంపెనీ వాల్యుయేషన్ల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఉంటాయి. డబుల్ కౌంటింగ్ ను నివారించడానికి ప్రైవేట్ పెట్టుబడులు, లిక్విడ్ ఆస్తులను మినహాయించారు.
రెండో స్థానంలో బజాజ్ కుటుంబం
అంబానీల తర్వాత రూ.7.13 ట్రిలియన్ల విలువతో నీరజ్ బజాజ్ నేతృత్వంలోని బజాజ్ కుటుంబం రెండో స్థానంలో ఉంది. బిర్లా కుటుంబం రూ.5.39 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది. టాప్ 3 కుటుంబ వ్యాపారాల ప్రయోజనాలు కలిపి 460 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఇది సింగపూర్ జీడీపీకి సమానమని నివేదిక తెలిపింది. ఈ జాబితాలో రూ.4.71 లక్షల కోట్ల విలువైన సజ్జన్ జిందాల్ కుటుంబం నాలుగో స్థానంలో, రూ.4.30 లక్షల కోట్ల విలువతో నాడార్ కుటుంబం ఐదో స్థానంలో ఉన్నాయి. నాడార్ కుటుంబానికి చెందిన రోష్ని నాడార్ మల్హోత్రా టాప్ 10 కుటుంబ వ్యాపారాల జాబితాలో ఉన్న ఏకైక మహిళ.
మొదటి తరం కుటుంబాల సంగతేంటి?
రూ.15.44 ట్రిలియన్ల విలువతో అదానీ కుటుంబం అత్యంత విలువైన మొదటి తరం కుటుంబ వ్యాపారంగా అవతరించగా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని పూనావాలా కుటుంబం రూ.2.37 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. రూ.91,200 కోట్ల విలువతో దివి కుటుంబం మూడో స్థానంలో ఉంది. హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాపార రంగంలో భారతదేశం స్థాయిని పెంపొందించడంలో ఈ వ్యాపారాలు కీలకమని వ్యాఖ్యానించారు. ఈ కుటుంబ వ్యాపారాలు భారతదేశంలో దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్ధికి కారణమయ్యాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ఈ కుటుంబాల పాత్ర ముఖ్యమైనదన్నారు.
బహుళ తరాల వ్యాపారాలు..
ఆసియా పసిఫిక్ బార్క్లేస్ ప్రైవేట్ బ్యాంక్ అధిపతి నితిన్ సింగ్ మాట్లాడుతూ భారత్ సంక్లిష్టమైన దేశం. ఇది వివిధ రాష్ట్రాలు మరియు వివిధ విషయాలతో రూపొందించబడింది. ఈ సంక్లిష్ట వాతావరణంలో ఎలా పనిచేయాలో తెలిసిన వ్యక్తులకు ఇది బహుమతి ఇస్తుంది. అనేక సంవత్సరాలుగా బహుళ-తరాల వ్యాపారాలు అదే చేయగలిగాయని నేను అనుకుంటున్నాను; వారు ఈ సంక్లిష్ట వాతావరణంలో పనిచేయడంలో అభివృద్ధి చెందగలిగారు."