Amazon Monsoon Mobile Mania : అమెజాన్​ సేల్​లో ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ ఆఫర్స్​..!-amazon monsoon mobile mania 2024 top smartphone deals on iphone 13 and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Monsoon Mobile Mania : అమెజాన్​ సేల్​లో ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ ఆఫర్స్​..!

Amazon Monsoon Mobile Mania : అమెజాన్​ సేల్​లో ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ ఆఫర్స్​..!

Sharath Chitturi HT Telugu
Jun 24, 2024 03:31 PM IST

Amazon Monsoon Mobile Mania sale : యాపిల్, వన్​ప్లస్​, రియల్​మీ, రెడ్​మీ, శాంసంగ్​ వంటి టాప్ బ్రాండ్లపై.. అమెజాన్​ మాన్​సూన్​​ మొబైల్ మేనియా సేల్​లో సూపర్​ డీల్స్​ లభిస్తున్నాయి. ఆ వివరాలు..

ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ ఆఫర్స్​..!
ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ ఆఫర్స్​..! (Pexels)

Amazon Monsoon Mobile Mania 2024 : అమెజాన్ మాన్​సూన్ మొబైల్ మేనియా సేల్​లో యాపిల్, ఐక్యూ, వన్​ప్లస్, రియల్​మీ, రెడ్​మీ, శాంసంగ్ తదితర టాప్​ బ్రాండ్ల స్మార్ట్​ఫోన్లపై క్రేజీ డీల్స్​ లభిస్తున్నాయి. ఈ సేల్ జూన్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. ఈలోపు మీకు నచ్చిన స్మార్ట్​ఫోన్​ని కొనేయండి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ స్మార్ట్​ఫోన్స్​పై సూపర్​ డీల్స్​..!

యాపిల్ ఐఫోన్ 13…

ఈ యాపిల్​ ఐఫోన్​ 13లో 12 మెగాపిక్సెల్ వైడ్, అల్ట్రా వైడ్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్, 4కే డాల్బీ విజన్ హెచ్డిఆర్ రికార్డింగ్, సూపర్ రెటీనా ఎక్స్​డీఆర్ డిస్ప్లే ఉన్నాయి. ఏ15 బయోనిక్ చిప్ దీని పనితీరును మెరుగుపరుస్తుంది. అమెజాన్​లో ఈ స్మార్ట్​ఫోన్​ రూ.48,999 ధరకు లభిస్తుంది.

అంతేకాదు.. యాపిల్​ సంస్థ సొంతంగా.. బ్యాక్​ టు స్కూల్​ ఆఫర్స్​ని ప్రకటించింది. ఐప్యాడ్​, మ్యాక్​బుత్​ వంటి ప్రాడక్ట్స్​ని తక్కువ ధరకే మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఎయిర్​పాడ్స్​ ఫ్రీగా పొందొచ్చు. విద్యార్థులు.. ఈ ఆఫర్స్​ని సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

హానర్ ఎక్స్9బీ 5జీ..

కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 గేమింగ్ చిప్సెట్, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మ్యాజిక్ఓఎస్ 7.2, 5800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఈ హానర్​ ఎక్స్​9బీ స్మార్ట్​ఫోన్​లో ఉన్నాయి. నెలకు రూ.7,333 ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్​లో రూ.21,999 ధరకు దీనిని కొనుగోలు చేయవచ్చు.

ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ..

6.72 ఇంచ్​ డిస్ ప్లే, 50 ఎంపీ ఏఐ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ వంటి ప్రత్యేకతలు ఈ స్మార్ట్​ఫోన్​ సొంతం. నెలకు రూ.4,000 నుంచి ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభమవుతాయి. అమెజాన్​లో ఇది రూ.11,999 ధరకు లభిస్తుంది.

వన్​ప్లస్​ 11ఆర్ 5జీ..

స్నాప్​డ్రాగన్ 8+ జెన్ 1 సీపీయూతో పనిచేసే ఈ వన్​ప్లస్​ 11ఆర్​ 5జీ ఫోన్ లో 50 ఎంపీ ఐఎంఎక్స్ 890 ట్రిపుల్ కెమెరా సిస్టమ్, హైపర్ టచ్ ఇంజన్, 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్​ప్లే, 100వాట్ సూపర్్​వూక్ ర్యాపిడ్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. అమెజాన్​ సేల్​లో రూ.27,999 ధరకు ఈ గ్యాడ్జెట్​ని కొనుగోలు చేయవచ్చు.

రియల్​మీ జీటీ 6టీ 5జీ..

Realme GT 6T 5G discount : 9 లేయర్ కూలింగ్ సిస్టెమ్, సూపర్ ఓఐఎస్, 6000 బ్రైట్ డిస్ప్లే, 7+ జెన్ 3 ఫ్లాగ్​షిప్​ ప్రాసెసర్ ఈ రియల్​మీ స్మార్ట్​ఫోన్​లో ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్లు నెలకు రూ.2,417 నుంచి ప్రారంభమవుతాయి. అమెజాన్​ మాన్​సూన్ మొబైల్ మేనియా సేల్​లో దీనిని  రూ.28,999 ధరకు కొనుగోలు చేసుకోవచ్చు.

రెడ్​మీ 13సీ 5జీ..

Redmi 13C 5G Amazon sale : మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.74 ఇంచ్​ డిస్ప్లే, 18వాట్ ఫాస్ట్ ఛార్జర్, 50 ఎంపీ ఏఐ ట్విన్ కెమెరా ఉన్నాయి. నెలకు రూ.1,917 నుంచి ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభమవుతాయి. అమెజాన్​ మాన్​సూన్ మొబైల్ మేనియా సేల్​లో రూ.11,499 ధరకు కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ..

120 హెర్ట్జ్ ఎస్​అమోలెడ్ డిస్ప్లే, విజన్ బూస్టర్ టెక్నాలజీతో కూడిన 50 మెగాపిక్సెల్ నో షేక్ కెమెరా ఈ ఫోన్​లో ఉన్నాయి. నెలకు రూ.2,167 నుంచి ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభమవుతాయి. అమెజాన్​లో రూ.12,999 ధరకు లభిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం