iPhone 16: ఐఫోన్ 16 లో సిమ్ కార్డ్ స్లాట్ ఉండదా?.. ‘ఈ- సిమ్ ఓన్లీ’ ఐప్యాడ్ 2024 గ్లోబల్ లాంచ్ తో పెరిగిన ఊహాగానాలు-iphone 16 to come without sim card slot global launch of esim only ipad 2024 range sparks new speculations ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 16: ఐఫోన్ 16 లో సిమ్ కార్డ్ స్లాట్ ఉండదా?.. ‘ఈ- సిమ్ ఓన్లీ’ ఐప్యాడ్ 2024 గ్లోబల్ లాంచ్ తో పెరిగిన ఊహాగానాలు

iPhone 16: ఐఫోన్ 16 లో సిమ్ కార్డ్ స్లాట్ ఉండదా?.. ‘ఈ- సిమ్ ఓన్లీ’ ఐప్యాడ్ 2024 గ్లోబల్ లాంచ్ తో పెరిగిన ఊహాగానాలు

HT Telugu Desk HT Telugu
Jun 19, 2024 07:22 PM IST

ఈ సంవత్సరం ఆపిల్ విడుదల చేయనున్న ఐఫోన్ 16 లో సిమ్ కార్డ్ స్లాట్ ఉండదా? కేవలం ‘ఈ-సిమ్’ ద్వారానే ఐఫోన్ 16 పని చేస్తుందా?.. కొత్తగా ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసిన ఐప్యాడ్ లలో సిమ్ కార్డ్ స్లాట్స్ లేవు. అవి ‘ఈ-సిమ్’ తో మాత్రమే పని చేస్తాయి. అందువల్ల ఐఫోన్ 16 లలో కూడా ‘ఈ-సిమ్’ మాత్రమే ఉంటుందా?

ఇకపై ‘ఈ - సిమ్ ఓన్లీ’ ఐ ఫోన్స్
ఇకపై ‘ఈ - సిమ్ ఓన్లీ’ ఐ ఫోన్స్ (REUTERS)

eSIM only iPhone: ఐఫోన్ 16 అమెరికాలో సిమ్ కార్డ్ స్లాట్ లేకుండా లాంచ్ కానుంది. ఎందుకంటే ఆపిల్ గత ఏడాది సిమ్ కార్డ్ స్లాట్ ను తొలగించి యుఎస్ మార్కెట్ కోసం ‘ఈ-సిమ్ ఓన్లీ’ ఐఫోన్ 15 (eSIM only iPhone 15) మోడళ్లను రూపొందించింది. ఇప్పుడు, ఆపిల్ యుఎస్ లో ‘ఈ-సిమ్ ఓన్లీ’ ఐఫోన్ 16 మోడళ్లను కొనసాగిస్తుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా అంతటా ఇదే ‘ఈ-సిమ్ ఓన్లీ’ మోడల్ ను ఆపిల్ లాంచ్ చేస్తుందా? అన్న విషయంలో స్పష్టత లేదు.

‘ఈ-సిమ్ ఓన్లీ’ ఐప్యాడ్ 2024

కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రోలను పరిచయం చేస్తూ ఆపిల్ తన తాజా ఆఫర్లను మంగళవారం ఆవిష్కరించింది. ఈ రెండు డివైజెస్ గురించిన ఆసక్తికరమైన వివరాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అవి ప్రత్యేకంగా ‘ఈ-సిమ్’ కు మద్దతు ఇస్తాయి. వాటిలో సాంప్రదాయ సిమ్ కార్డ్ ట్రే ఉండదు. ఈ మార్పు ‘ఈ-సిమ్’ ను విస్తృతం చేయాలన్న ఆపిల్ ఆలోచనను వెల్లడిస్తుంది. అందువల్ల, ఐఫోన్ 16లలో సిమ్ కార్ట్ ట్రే ఉండకపోవచ్చని, ఈ మార్పును ఒక్క యూఎస్ కే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ పరిచయం చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

‘ఈ-సిమ్’ టెక్నాలజీ గ్లోబల్ రీచ్

తాజాగా ఆపిల్ విడుదల చేసిన 2024 ఐప్యాడ్ మోడళ్లైన ఎం 2 ఐప్యాడ్ ఎయిర్, ఎం 4 ఐప్యాడ్ ప్రో సెల్యులార్ వెర్షన్లలో సిమ్ కార్డ్ ట్రే ను తొలగించారు. వాటిలో ‘ఈ-సిమ్’ ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని ఆపిల్ తన వెబ్ సైట్ లో అధికారికంగా ధృవీకరించింది. అమెరికాలో ఆపిల్ 2022 నుంచే అన్ని ఐఫోన్ మోడళ్ల నుండి సిమ్ ట్రేను తొలగించింది. దాంతో, యుఎస్ లోని వినియోగదారులు ‘ఈ-సిమ్ ఓన్లీ’ ఐఫోన్ లకు అలవాటు పడ్డారు. ఇతర దేశాలలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇతర దేశాలలో కొనుగోలు చేసిన ఐఫోన్లలో ఇప్పటికీ సిమ్ కార్డ్ ట్రే ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో మాత్రమే ‘ఈ-సిమ్’ టెక్నాలజీని వాడుతున్నారు.

ఐప్యాడ్ ఆఫర్లలో వ్యూహాత్మక మార్పు

అయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన కొత్త ఐప్యాడ్ ల్లో ఇసిమ్-ఓన్లీ మోడళ్లు మాత్రమే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అవి మాత్రమే అందుబాటులో ఉంటాయి. చైనాలో కూడా, ఆపిల్ ఇసిమ్-ఓన్లీ ఐప్యాడ్ మోడళ్లను విక్రయిస్తారు. చైనా మార్కెట్ కోసం రూపొందించిన ఐఫోన్లలో కనిపించే డ్యూయల్ సిమ్ సెటప్ ను తొలగించారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే, ఆపిల్ తన ఫ్లాగ్షిప్ ఐఫోన్ లైనప్ కు ‘ఈ- సిమ్ ఓన్లీ’ టెక్నాలజీని విస్తరించాలని భావిస్తోందని, ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న ఐఫోన్ 16తో అది ప్రారంభమవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

WhatsApp channel