Realme GT 6: స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో రియల్ మీ జీటీ 6 లాంచ్; ధర ఎంతంటే?
Realme GT 6: హై మిడ్ రేంజ్ లో మరో స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ లాంచ్ చేసింది. ఈ రియల్ మీ జీటీ 6 స్మార్ట్ ఫోన్ లో అత్యంత అడ్వాన్స్డ్ చిప్ సెట్ అయిన స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ని పొందుపర్చింది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.39,999 ప్రారంభ ధరతో భారత్ లో లభిస్తుంది.
Realme GT 6: కొన్ని వారాల ఊహాగానాల తరువాత, రియల్ మీ జీటీ 6 ఎట్టకేలకు హై-మిడ్ రేంజ్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇంతకుముందు కంపెనీ రియల్ మీ జీటీ 6టీ ని లాంచ్ చేసింది. ఆ మోడల్ చాలా ప్రజాదరణ పొందింది. దాంతో, ఇప్పుడు జీటీ 6 సిరీస్ కింద రెండో స్మార్ట్ ఫోన్ ను మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో లాంచ్ చేసింది.
స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్
రియల్ మీ (Realme) జీటీ 6 లో లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ను పొందుపర్చారు. ఇది సంక్లిష్టమైన పనులు, ఆన్-డివైజ్ ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కొత్త జీటీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ లో కొత్త ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో చూడండి.
రియల్ మీ జీటీ 6 స్పెసిఫికేషన్లు
రియల్ మీ జీటీ 6 (Realme GT 6) లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, డాల్బీ విజన్, 6000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్ నెస్ తో 6.78-అంగుళాల 8టీ ఎల్టీపీఓ ప్రో-ఎక్స్ డీఆర్ డిస్ ప్లే ఉంది. స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ LPDDR5X సదుపాయాలు ఉన్నాయి. అదనంగా, హీటింగ్ సమస్య తలెత్తకుండా ఇందులో ఐస్ బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఏఐ నైట్ విజన్ మోడ్, ఏఐ స్మార్ట్ లూప్, ఏఐ స్మార్ట్ రిమూవల్ వంటి పలు ప్రత్యేకమైన ఏఐ ఫీచర్లను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.ఇది పిక్సెల్ 8 మ్యాజిక్ ఎరేజర్ మాదిరిగానే పనిచేస్తుంది.
ట్రిపుల్ కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ కోసం రియల్ మీ జీటీ 6 లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ ను అందిస్తుంది. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. రియల్ మీ జీటీ 6 స్మార్ట్ ఫోన్ లో 5500 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉంటుంది.
రియల్ మీ జీటీ 6 ధర
రియల్ మీ జీటీ 6 స్మార్ట్ ఫోన్ రేజర్ గ్రీన్, ఫ్లూయిడ్ సిల్వర్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 256 జీబీ, 16 జీబీ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. రియల్ మీ జీటీ 6 ప్రారంభ ధర రూ.40,999. అయితే ప్రస్తుతం, ప్రారంభ ఆఫర్ గా దీనిని రూ.35,999లకు అందిస్తున్నారు.
ప్రీ-ఆర్డర్ సేల్
రియల్ మీ ప్రీ-ఆర్డర్ సేల్ లో భాగంగా అన్ని స్టోరేజ్ వేరియంట్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. 8 జీబీ + 256 జీబీ, 16 జీబీ + 512 జీబీ వేరియంట్లపై రూ.4000 బ్యాంక్ డిస్కౌంట్, 12 జీబీ + 256 జీబీ వేరియంట్లపై రూ.3000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. జూన్ 20, 2024 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్ ప్రారంభమవుతుంది. ప్రారంభ ఆఫర్లు జూన్ 24 వరకు అందుబాటులో ఉంటాయి.