All In One Charger : ఈ ఒక్కటి మీ దగ్గర ఉంటే.. దేనికైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు!
All In One Charger : టెక్ బ్రాండ్ అంబ్రేన్ భారత మార్కెట్లో ఆల్ ఇన్ వన్ ఛార్జింగ్ సొల్యూషన్‌గా ఏరో సింక్ 65ను విడుదల చేసింది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ల నుంచి యాక్ససరీలు, ల్యాప్‌టాప్ వరకు అన్నింటిని ఛార్జింగ్ చేయవచ్చు.
ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అంబ్రేన్ ఇండియా సరికొత్త ఆల్ ఇన్ వన్ ఛార్జింగ్ సొల్యూషన్ ఏరోసింక్ 65ను విడుదల చేసింది. దీనిని భారతదేశంలో రూపొందించారు. ఈ వినూత్న 4-ఇన్-1 ఛార్జర్ సహాయంతో, చాలా పరికరాలను సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా ఇది ప్రయాణీకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఒక్క పరికరం మీ దగ్గర ఉంటే.. చాలా వాటికి ఛార్జింగ్ పెట్టవచ్చు.
కొత్త 4-ఇన్-1 పరికరం వాల్ ఛార్జర్‌గా మాత్రమే కాకుండా, ఇన్ బిల్ట్ టైప్-సి కేబుల్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది మాగ్ సేఫ్ పవర్ బ్యాంక్‌గా కూడా పనిచేస్తుంది. 65వాట్ అవుట్ ఫుట్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. దీని సహాయంతో స్మార్ట్‌ఫోన్లు, యాక్ససరీలు, ల్యాప్‌టాప్‌లను సులభంగా ఛార్జ్ చేయవచ్చు.
ఏరో సింక్ 65 పూర్తి ఛార్జింగ్ సొల్యూషన్‌గా రూ.4,799 ప్రత్యేక ధరతో లాంచ్ అయింది. ఈ లాంచ్ ఆఫర్‌తోపాటుగా ఈ డివైస్ ఎంఆర్పీని రూ.9,999గా ఉంచారు. ఈ ఛార్జింగ్ సొల్యూషన్‌కు 180 రోజుల కాలపరిమితితో కూడిన వారంటీ ఇస్తున్నారు.
దీని బరువు 381 గ్రాములు, మందం 33 మిమీ మాత్రమే. అంటే దీనిని ఒక చిన్న సంచిలో లేదా జేబులో సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇందులో 15000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంది. దీనిలో కనిపించే మార్చదగిన పిన్లు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎక్కడకు వెళ్లినా.. చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అలాగే ఏరో సింక్ 65లో మల్టీ-లేయర్ భద్రతను అందించారు. తద్వారా పరికరాన్ని ఛార్జ్ చేసేటప్పుడు ఓవర్ ఛార్జింగ్, ఓవర్ హీటింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యలు ఉండవు. ఈ ఛార్జర్ టైప్-సి (65 వాట్ మ్యాక్స్), యుఎస్బీ-ఎ (18 వాట్ మ్యాక్స్), వైర్లెస్ ఛార్జింగ్ (15 వాట్ మ్యాక్స్), ఎసి అడాప్టర్ (30 వాట్ మ్యాక్స్)తో లభిస్తుంది.
టైప్-సి, టైప్-ఎ ద్వారా టైప్-సి ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేసే అవకాశాన్ని ఛార్జర్ ఇస్తుంది. అలాగే మ్యాగ్ సేఫ్, క్యూఐ టెక్నాలజీ ఉన్న డివైజ్‌లను కూడా దీని ద్వారా ఛార్జ్ చేయవచ్చు.