Smartphones Under 10k : రూ.10వేలలోపు స్మార్ట్‌ఫోన్లు.. 16జీబీ ర్యామ్, 108ఎంపీ కెమెరా!-middle class budget smartphones under 10000 rupees 16gb ram and 108mp camera know all features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphones Under 10k : రూ.10వేలలోపు స్మార్ట్‌ఫోన్లు.. 16జీబీ ర్యామ్, 108ఎంపీ కెమెరా!

Smartphones Under 10k : రూ.10వేలలోపు స్మార్ట్‌ఫోన్లు.. 16జీబీ ర్యామ్, 108ఎంపీ కెమెరా!

Anand Sai HT Telugu
Sep 15, 2024 04:30 PM IST

Smartphones Under 10k : తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లు కొనాలని చూస్తున్నారా? అయితే మీకోసం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. రూ.10,000 కంటే తక్కువ ధరలో వస్తున్న కొన్ని స్మార్ట్‌పోన్ల గురించి తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వినియోగదారులు తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్స్ కొనాలని చూస్తారు. ఉత్తమ ఫీచర్లతో తక్కువ ధరలో ఫోన్లను కోరుకుంటున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకోసం బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. రూ.10,000 కంటే తక్కువ ధరలో వస్తున్న కొన్ని గొప్ప స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోండి. ఈ ఫోన్లలో మీకు 16 జీబీ ర్యామ్ (పొడిగించిన ర్యామ్‌తో) లభిస్తుంది. 108 మెగాపిక్సెల్ వరకు కెమెరాను కూడా వస్తుంది. ఈ ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

టెక్నో స్పార్క్ 20సి

అమెజాన్ ఇండియాలో రూ .7,999కు ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌తో ఈ ఫోన్ ర్యామ్ 16జీబీ వరకు ఉంటుంది. ఆర్ మైక్రో ఎస్‌డీ కార్డు సాయంతో ఫోన్ మెమరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ప్రాసెసర్‌గా కంపెనీ మీడియాటెక్ హీలియో జీ36 చిప్‌సెట్‌ను ఫోన్‌లో అందిస్తోంది. ఫోన్‌లో ఇచ్చిన డాట్ ఇన్ డిస్ ప్లే 6.56 అంగుళాలు. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

ఐటెల్

ఈ ఫోన్ ఎస్24 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.9,999గా ఉంది. ఇందులో 16 జీబీ వరకు ర్యామ్ విత్ మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ91 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఫోన్ హెచ్‌డీ+ డిస్ప్లే 6.6 అంగుళాలు. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్, ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

లావా ఓ2

ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.7,999 ధరకు లభిస్తోంది. ఈ ఫోన్లో 8 జీబీ రియల్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ లభిస్తుంది. దీంతో ఫోన్ మొత్తం ర్యామ్ 16 జీబీకి పెరిగింది. లావా ఈ ఫోన్లో 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ను అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో ఉంది. ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లభిస్తుంది. లావాకు చెందిన ఈ ఫోన్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్, ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.