Adani Hindenburg Case : ‘కొటాక్​’ ఫండ్స్​తో అదానీ సంస్థల్లో షార్ట్​ సెల్లింగ్​! హిండెన్​బర్గ్​ సంచలన ఆరోపణలు..-adani hindenburg case now kotak bank uday kotak are also part of adani battle ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Hindenburg Case : ‘కొటాక్​’ ఫండ్స్​తో అదానీ సంస్థల్లో షార్ట్​ సెల్లింగ్​! హిండెన్​బర్గ్​ సంచలన ఆరోపణలు..

Adani Hindenburg Case : ‘కొటాక్​’ ఫండ్స్​తో అదానీ సంస్థల్లో షార్ట్​ సెల్లింగ్​! హిండెన్​బర్గ్​ సంచలన ఆరోపణలు..

Sharath Chitturi HT Telugu
Jul 02, 2024 01:23 PM IST

అదానీ షార్ట్​ సెల్లింగ్​ వ్యవహారంలో హిండెన్​బర్గ్​కి షోకాజ్​ నోటీసులు ఇచ్చింది సెబీ. దీనికి బదులుగా పలు సంచలన ఆరోపణలు చేసిందిన హిండెన్​బర్గ్​!

ఉదయ్​ కొటాక్​
ఉదయ్​ కొటాక్​ (Photo: REUTERS)

అదానీ- హిండెన్​బర్గ్​ వివాదంలో మరో కీలక మలుపు! అమెరికా ఆధారిత షార్ట్​ సెల్లర్​కి సెబీ (సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్​ఛేంజ్​ బోర్డ్​ ఆఫ్​ ఇండియా) షోకాజ్​ నోటీసులు ఇవ్వగా.. పలు సంచలన ఆరోపణలు చేస్తూ బదులిచ్చింది హిండెన్​బర్గ్​. కొటాక్​ మహీంద్రా బ్యాంక్​ ఏర్పాటు చేసిన ఫండ్స్​తోనే అదానీ గ్రూప్​ సంస్థల్లో షార్ట్​ సెల్లింగ్​ జరిగినట్టు పేర్కొంది.

కొటాక్​పై హిండెన్​బర్గ్​ సంచలన ఆరోపణలు..

అదానీ సంస్థల్లో అవకతవకలు జరుగుతున్నట్టు, తాము షార్ట్​ సెల్లింగ్​ చేస్తున్నట్టు గతేడాది జనవరిల హిండెన్​బర్గ్​ ప్రకటించడం, ఆ తర్వాత గ్రూప్​నకు చెందిన అన్ని సంస్థల షేర్లు కుప్పకూలడం మనకు తెలిసిందే. ఇదే విషయంపై హిండెన్​బర్గ్​కి ఈ ఏడాది జూన్​ 27న షోకాజ్​ నోటీసులు పంపించింది సెబీ. దీనిపై స్పందిస్తూ.. పలు కీలక ఆరోపణలు చేసింది హిండెన్​బర్గ్​.

"మాపై అధికారాన్ని క్లెయిమ్​ చేసుకునేందుకు సెబీ చాలా ప్రయత్నిస్తోంది. కానీ ఇండియాతో సంబంధం ఉన్న అసలైన పార్టీ గురించి బయటపెట్టడం లేదు. అది భారతదేశ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటి కొటాక్​ బ్యాంక్​. ఉదయ్​ కొటాక్​ స్థాపించిన బ్యాంకు, బ్రోకరేజ్​ సంస్థలు విదేశీగడ్డపై ఒక ఫండ్​ని క్రియేట్​ చేశాయి. వాటిని ఉపయోగించుకునే మా ఇన్​వెస్టర్​ పార్ట్​నర్​ అదానీలో షార్ట్​ సెల్లింగ్​ చేయడం జరిగింది. కొటాక్​ గురించి బయటకు చెప్పకుండా సింపుల్​గా కే-ఇండియా ఆపర్చ్యునిటీస్​ ఫండ్​ అని సెబీ చెప్పి వదిలేసింది. కేఎంఐఎల్​లో కే అంటే.. కొటాక్​," అని హిండెన్​బర్గ్​ ఆరోపించింది.

అంతేకాదు కొటాక్​ మహీంద్రా బ్యాంక్​ని స్థాపించిన ఉదయ్​ కొటాక్​, 2017లో సెబీ కార్పొరేట్​ గవర్నెన్స్​ కమిటీకి నేతృత్వం వహించారని హిండెన్​బర్గ్​ గుర్తుచేసింది.

"కొటాక్​ పేరును సెబీ కావాలనే చెప్పలేదని మేము అనుమానిస్తున్నాము. మరో శక్తివంతమైన వ్యాపారవేత్తను విచారణ నుంచి రక్షించేందుకే సెబీ ఇలా చేస్తోంది," అని హిండెన్​బర్గ్​ వెల్లడించింది.

అదానీ షేర్లను షార్ట్​ చేసేందుకు తాము ఒక ఇన్​వెస్టర్​ పార్ట్​నర్​తో డీల్​ కుదుర్చుకున్నట్టు హిండెన్​బర్గ్​ చెప్పింది. ఆ పార్టనర్​, నాన్​-ఇండియన్​, ఆఫ్​షోర్​ ఫండ్​ స్ట్రక్చర్​ని ఉపయోగించుకుని అదానీ డెరివేటివ్స్​లో షార్టింగ్​ చెసినట్టు వివరించింది. కాగా ఆ పార్ట్​నర్​ పేరు కింగ్డన్​ క్యాపిటల్​ మేనేజ్​మెంట్​ ఎల్​ఎల్​ఎసీ అని తెలుస్తోంది. అదొక ఫారిన్​ పోర్ట్​ఫోలియో ఇన్​వెస్ట్​మెంట్​ సంస్థ.

హిండెన్​బర్గ్​కి సెబీ ఇచ్చిన షోకాజ్​ నోటీస్​ ప్రకారం కే- ఇండియా ఆపర్చ్యునిటీస్​ ఫండ్​ ఒక ట్రేడింగ్​ అకౌంట్​ ఓపెన్​ చేసింది. 2023 జనవరిలో హిండెన్​బర్గ్ నివేదిక బయటకు వచ్చేముందు ఆ అకౌంట్​లో కేవలం అదానీ సంస్థలకు సంబంధించిన షేర్లపైనే ట్రేడింగ్​ జరిగింది. ఫిబ్రవరిలో పొజీషన్స్​ స్క్వేర్​ఆఫ్​ అయిపోయాయి. లా రూ. 183.24 కోట్ల లాభాలు ఆ ట్రేడింగ్​ అకౌంట్​లో నమోదయ్యాయి.

అయితే 2023 జనవరి 5న కింగ్డన్​ క్యాపిటల్​తో కేఎంఐఎల్​ హడావుడిగా ఒక ఇన్​వెస్ట్​మెంట్​ అడ్వైజరీ ఒప్పందం​ కుదుర్చుకుందని సెబీ తన షోకాజ్​ నోటీస్​లో వెల్లడించింది. ఆ తర్వాత ట్రేడింగ్​ అకౌంట్​ వాడుకుని అన్ని నిర్ణయాలు కింగ్డన్​ తీసుకున్నట్టు పేర్కొంది. అదానీపై ఆరోపణలతో కూడిన డ్రాఫ్ట్​ని 2022 నవంబర్​లోనే కింగ్డన్​కి హిండెన్​బర్గ్​ షేర్​ చేసిందని సెబీ చెబుతోంది. 2023 జనవరిలో బయటకి వచ్చిన అసలైన రిపోర్టు, ఆ డ్రాఫ్ట్​కి మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని స్పష్టం చేసింది.

కొటాక్​ మహీంద్రా బ్యాంక్​ షేర్లు పతనం..

అదానీ- హిండెన్​బర్గ్​ వివాదంలో కొటాక్​ పేరు బయటకు రావడంతో మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో కొటాక్​ మహీంద్రా బ్యాక్​ భారీ నష్టాల్లోకి జారకుంది. మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల సమయంలో ఈ సంస్థ షేర్లు 63.15 పాయింట్లు లేదా 3.5శాతం నష్టంతో 1,745 వద్ద ట్రేడ్​ అవుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం