Demat Account Open : ఇంట్లోనే కూర్చొని డీమ్యాట్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి? ప్రాసెస్ తెలుసుకోండి-how to open demat account in phone know step by step process for trading in stock ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Demat Account Open : ఇంట్లోనే కూర్చొని డీమ్యాట్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి? ప్రాసెస్ తెలుసుకోండి

Demat Account Open : ఇంట్లోనే కూర్చొని డీమ్యాట్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి? ప్రాసెస్ తెలుసుకోండి

Anand Sai HT Telugu
Jul 02, 2024 12:30 PM IST

Demat Account Open : ఇటీవలి కాలంలో డీమ్యాట్ అకౌంట్లు ఎక్కువగా పెరిగాయి. జనాలు ట్రేడింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దీనిని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం..

డీమ్యాట్ ఖాతా ఎలా తెరవాలి?
డీమ్యాట్ ఖాతా ఎలా తెరవాలి? (Unsplash)

స్నేహితులంతా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు గడిస్తున్నారు. నేను వారిలా డబ్బు సంపాదించాలి అనుకుంటారు. ఇలా అని మీకు ఎప్పుడో ఒకసారి అనిపించి ఉండవచ్చు. మీరు ట్రేడింగ్ ప్రారంభించాలనుకుంటే, ముందుగా మీకు డీమ్యాట్ ఖాతా అవసరం. స్టాక్ అయినా లేదా మ్యూచువల్ ఫండ్ అయినా మీకు ఈ డీమ్యాట్ ఖాతా తప్పనిసరి.

yearly horoscope entry point

డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? మీకు ఏ రకమైన డీమ్యాట్ ఖాతా సరైనది? చూద్దాం. డీమ్యాట్ అంటే డీమెటీరియలైజ్డ్ ఖాతా. డీమ్యాట్ ఖాతా అనేది ఎలక్ట్రానిక్ రూపంలో స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన షేర్లు, డిబెంచర్లు, బాండ్లు, ఇటిఎఫ్‌లు మొదలైనవాటిని నిల్వ చేసే ఖాతాగా చెప్పవచ్చు. సరళంగా చెప్పాలంటే, డీమ్యాట్ ఖాతా మీ షేర్లను సురక్షితంగా ఉంచే బ్యాంక్ లాకర్ లాగా పనిచేస్తుంది.

డీమ్యాట్ ఖాతా తెరవడానికి వచ్చినప్పుడు మీరు సరైన డిపాజిటరీని అంటే DPని ఎంచుకోవడం చాలా అవసరం. సులభమైన బ్యాంకింగ్ కోసం మంచి బ్యాంకును ఎంచుకున్నట్లే, మీరు సరైన డిపాజిటరీని ఎంచుకోవాలి. మీరు స్టాక్స్, డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. మీ డీమ్యాట్ ఖాతా ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. కోవిడ్ సమయంలో డీమ్యాట్ ఖాతా తెరవడం అకస్మాత్తుగా పెరిగింది. మొబైల్ యాప్స్ ద్వారా ప్రజలు స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. భారతదేశంలో 40 శాతం కంటే ఎక్కువ క్రియాశీల డీమ్యాట్ ఖాతాలు యాప్‌ల ద్వారా తెరవబడ్డాయి.

డీమ్యాట్ ఖాతాను ఎక్కడ తెరవాలి. డిస్కౌంట్లను అందించే బ్రోకరేజ్ కంపెనీలలో? లేదా పూర్తి-సేవ బ్రోకరేజ్ కంపెనీలా? దీనికి కూడా సమాధానం తెలియాలి. గత 4 సంవత్సరాలలో డీమ్యాట్ ఖాతాలను తెరవడం విషయంలో డిస్కౌంట్ బ్రోకరేజ్ కంపెనీలు పూర్తి సేవ బ్రోకరేజ్ కంపెనీలను అధిగమించాయి.

బ్రోకరేజ్ సంస్థలు

డిస్కౌంట్ బ్రోకరేజ్ కంపెనీలు చాలా తక్కువ బ్రోకరేజ్ ఫీజులు లేదా ఫ్లాట్ ఫీజులను వసూలు చేస్తాయి. ఇక్కడ డీమ్యాట్ ఖాతా నిర్వహణ ఛార్జీలు చాలా తక్కువ లేదా ఉచితంగా ఉంటాయి. ఈ డిస్కౌంట్ బ్రోకరేజ్ కంపెనీలు డీమ్యాట్ ఖాతాలను తెరిచే ప్రక్రియను చాలా సులభతరం చేశాయి. ఇక్కడ కనీస రికార్డు సరిపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక్క రోజులో అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ ప్రారంభించవచ్చు.

సాధారణంగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ కారణంగా రోజురోజుకు అనేక డీమ్యాట్ అప్లికేషన్లు పుట్టుకొస్తున్నాయి. మీకు ట్రేడింగ్‌లో కొన్ని సంవత్సరాల అనుభవం ఉంటే, మీరు మొబైల్ అప్లికేషన్‌లో ఖాతాను తెరవవచ్చు. మెుదటిసారి ఇందులోకి ప్రవేశిస్తున్నట్లయితే మార్కెట్ పురోగతి, కంపెనీల సూచనను తెలియజేసే బ్రోకరేజ్ కంపెనీలో ఖాతాను తెరవడం మంచిది.

డీపీని ఎంచుకోవాలి

పైన చెప్పుకున్నట్టుగా డీమ్యాట్ అకౌంట్ కోసం డిపాజిటరీ పార్టిసిపెంట్(DP)ని ఎంచుకోవాలి. ఈ డీపీ ఏదైనా బ్యాంక్ కూడా కావొచ్చు. డీపీ కోసం బ్రోకరేజ్ సంస్థలు కూడా ఉంటాయి. దీని తర్వాత అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఓ ఫామ్ నింపాలి. ఆ తర్వాత దానిని సమర్పించాలి. ఈ అకౌంట్ తెరిచేందుకు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఐడీ రుజువుగా రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. దీనితోపాటుగా బ్యాంకులో క్రాస్ చేసిన చెక్కు కూడా అడుగుతారు. తర్వాత బ్యాంక్ మిమ్మల్ని అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయమని అడుగుతుంది.

ఆ తర్వాత బ్యాంక్ మీ డీ మ్యాట్ అకౌంట్ తెరుస్తుంది. మీకు ఐడీ వస్తుంది. ఇక మీరు షేర్లు కొనుగోలు చేయవచ్చు. సేల్ చేసే సమయంలో సూచనలు ఏంటనే స్లిప్ కూడా మీకు ఇస్తారు.

మీరే ఎలా ఓపెన్ చేయాలి?

ఇంట్లో కూర్చొని డీమ్యాట్ అకౌంట్ తెరవాలి అనుకుంటే సంబంధిత డీపీ అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి. తర్వాత డీమ్యాట్ అకౌంట్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఖాతా తెరిచేందుకు తర్వాత ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ధృవీకరణ కోసం కాల్ వస్తుంది. లేదా మెసేజ్ రావొచ్చు. తర్వాత బెనిఫిషియరీ ఐడీ లేదా డీమ్యాట్ ఖాత నెంబర్ పొందుతారు. తర్వాత ఈ ఖాతా ద్వారా మీరు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టవచ్చు.

Whats_app_banner